Showing posts with label విశాఖ వెళ్ళాను.. Show all posts
Showing posts with label విశాఖ వెళ్ళాను.. Show all posts

Thursday, November 3, 2011

10.10.2011 న విశాఖ మండే మొజాయిక్ - కొన్ని చిత్రాలు

నన్ను ఆహ్వానించినందుకు, ఇందులోని ఫోటోలను ఇచ్చినందుకు
మొదట   జగతి జగద్ధాత్రి
గారికిధన్యవాదాలు
అక్క, బావల నూతన గృహప్రవేసానికి విశాఖ  వెళ్ళాను.
పనిలో పనిగా మండే మొజాయిక్ ఆహ్వానం అందింది.
10.10.2011 ఉదయం కాళీగా ఉండలేక అలా ఆర్కె బీచ్, కైలాసగిరి తిరిగేసారికి కొంచెం అలసిపోయినట్టు అయింది. కైలాసగిరిలో రోప్, కొండపై రైలు  మంచి అనుభూతి నిచ్చాయి.
విశాకను సముద్రాన్ని కొండపైనుంచి చూడటం కొత్త అనుభూతే.

ఇక మండే మొజాయిక్ గురించి
చల్లని సాయంకాలం, విశాలకాశంలో పరుస్తున్న శరత్ వెన్నెల  క్రింద సమావేశం.
శ్రీ ఎల్.ఆర్. స్వామి గారు అధ్యక్షత వహించారుజగతి గారు అథిదిగా నన్ను ఆహ్వనించారు. 
మండే మొజాయిక్ సంవత్సర కాలం కార్యక్రమాలపై  బాబు మాట్లాడారు. 


ఈ మద్య కాలంలో నేను రాసిన ఊయలలూగే మనసు
మనసా ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ


మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల


పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల


గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఎదురుచూపుల దూరాలు
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
మరి మరి తలచి ఊగవే ఉయ్యాల

శ్రీమతి జ్యోతిర్మయి  స్వరపరచి వినిపించడం నాకు కొంచెం ఉత్కంటే అయ్యింది.


శ్రీ ఉదయ కుమార్ నా "అలలపై కలలతీగ" పుస్తకము మరియు కొన్ని ఇతర కవిత్వాన్ని పరిచయం చేసారు.


ఇక నేను మాట్లాడమని మైకు ఇచ్చేసరికి
విశాఖలో సాహిత్య కార్యక్రమంలో పాల్గనడం ఇదేమీ కొత్త కాదు. ఇది మూడవసారి. మొదటిసారి 26, 27 ఫిబ్రవరి 2005 లో 25 గంటల కవి సమ్మేళనంలో పాల్గొనడం  జరిగింది. అక్కడ నాకు కొందరు సాహిత్య మిత్రులు ఏర్పడి ఇప్పటికి మిత్రులుగా కొనసాగుతున్నారు వారిలో ముఖ్యులు శ్రీ అంగళకుర్తి విద్యాసాగర్, అప్పట్లో ఆయన గిరిజనాభివృద్ది సంస్థలో ఉన్నారు. ఈ సారి ఎవరిని కలుపుతుందో ఈ సమావేశం.
గత పదిహేను సంవత్సరాల  క్రితం నాకున్న మద్యపాన వ్యసనాన్ని మానటం కోసం చేసిన అనేక ప్రయత్నాలలో కవిత్వం నన్ను పట్టుకుంది. చదువుతూ చదువుతూ నా వ్యసనం ఏమయ్యిందో తెలియదు.
నా కవిత్వాని విశ్లేషిస్తూ నారాయణరెడ్డిని, శివారెడ్డిని ఉదహరించారు. నేను కవిత్వం రాయాలనుజున్న తొలినాళ్ళలో శివారెడ్డి చెప్పే ఒక మాట. ఒక కవితని విభిన్న రీతులలో రాసి చూసుకోవడం వల్ల దానిలోని లోతు పాతులు, పొరపాట్లు తెలుస్తాయని, బాగున్న దాన్ని ఎవరికి వారే ఎంచుకోవచ్చు. ఈ మాటలు నాకు చాలా నచ్చడంవల్ల పాటించాను కూడా. అందువల్ల శివారెడ్డి ప్రభావం నా కవిత్వంపై ఉండవచ్చు.
బాబు మాట్లాడిన దానికి జోడింపుగా ఒక మాట కవిత్వం రాయడానికి /సృజన  చేయడానికి మొదడులోని ఒక భాగపై వత్తిడి వుంటుంది. అదే అంతర్జాలంలో కవిత్వాన్ని రాయలంటే  మెదడులోని రెండు భాగలపై వత్తిడి పడుతుంది. ఒకటి సృజన, రెండవది  సాకేతికం. దీనిని కొత్తతరం అందిబుచ్చుకుంటుంది, కాని పాత తరం అందుకోవడానికి అవస్థ పడుతుంది. 
నేను అంతర్జాలంలో బ్లాగు మొదలుపెట్టినప్పుడు సుమారు 200 మంది మాత్రమే బ్లాగర్లు వుండేవారు.  ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది


కవిత్వాన్ని నా బ్లాగుల్లో చదవ వచ్చు.


సం"గతులు"(జాన్ హైడ్ కనుమూరి) సం " గతులు "

ప్రేమాంతరంగం ప్రేమ కావ్యం ప్రేమాంతరంగం  (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు)
 కొన్ని క్రైస్తవ ఆలోచనలు కోసం నడక
తెలుగు ఇంగ్లీషులలో బైబిలు తెలుగుబైబిలు


నేను చదివిన కొన్ని కవితలలో కొన్ని ఇక్కడ


రెండు గదుల స్వేచ్చ

రెండు గదుల్లోకి
జీవితాన్ని సర్దుకున్నప్పుడే
సగం స్వేచ్చకు సంకేళ్ళు వేయబడ్డాయి

అప్పుడప్పుడూ
అతిథులై పలుకరించే అవసరాలలో
మౌనంగా ముడుచుకుంటుంది
అటూ ఇటూ తిరిగే పిల్లలమధ్య
కళ్ళుతెరిచేలోగా
తృప్తి అసంతృప్తుల మధ్య
తెల్లవెంట్రుకలేవో పొడుచుకొస్తాయి

గొంతులో అల్లలాడిన పలుకులు
గుటకలై మిగిలిన స్వేచ్చ
జ్ఞాపకాలుగా
వంటగదిలో వేళ్ళాడే చిత్రపటాలౌతాయి

అలుపెరుగని దేహం
వోవర్ హాలింగు కోరుకుంటుంది
కుంటుతున్న ఆర్థిక ద్వారం
తుప్పట్టిన మడతబందుల మధ్య యిరుక్కొని
తెరుచుకోనంటుంది

శిశిరం అకాలంగా ముసిరితే
రాలుతున్న ఆకుల్లోచి తెగిపడ్డ స్వేచ్చ
తన సంకెళ్ళను తానే విప్పుకొని
మరో రెండుగదుల జీవితాన్ని వెదుక్కుంటుంది.
****
చివరిగా స్వామి గారు పోస్టాఫీసు(Translation of Ravindranath Tagoore) , కథా కేరళం పుస్తకాలనిచ్చారు.



పుస్పగుచ్చాన్నిచి సత్కరించారు
నేను నా ప్రక్కటెముక విజయ గ్రేస్

********