వ్యసనాన్ని మానటం ఎలా అని తరచు అడిగే కొందరికి నేనిచ్చిన సూచనలను ఇక్కడ పెడ్తున్నాను.
మొదట వ్యసనానికి అలవాటుకు మద్య తేడాను గుర్తించాలి
వ్యసనం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా జరిగే మార్పుల ప్రభావాన్ని గుర్తించాలి
వ్యక్తిగత దృఢ సంకల్పంతో పాటూ మిత్రుల, కుటుంబీకుల సహకారం అవసరం.
వ్యసనాన్ని మానాలనుకున్నప్పుడు దాని తీవ్రతను గుర్తించాలి. తీవ్రతను బట్టి ఒక్కసారిగా మనాలా లేక అంచలంచలుగా మనాలా అనేది నిర్ణయించుకోవాలి.
వ్యసనం ప్రభావాన్ని చూపే సమయాన్ని గుర్తించాలి. ఆ సమయంలో జరిగే శారీరక, మానసిక పరిణామాలను గుర్తించాలి, దానికి అణుగుణంగా వైద్య సహకారాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. సమయాలను గుర్తించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవాడానికి, ఆ సమయాలను అదుపుచేసుకోవడానికి వీలుకలుగుతుంది
నేను మానాలనుకున్నప్పుడు చాలా సంఘర్షణకు లోనయ్యాను. సుమారు 4 సంవత్సరాలు పట్టింది.
ఈ సమయంలో నా ప్రక్కటెముక ఇచ్చిన సహకారం మరువలేనిది.
-----
4204