Showing posts with label సం గతులు. Show all posts
Showing posts with label సం గతులు. Show all posts

Monday, November 26, 2012

వంద(100)సార్లు చూసిన సినిమా - ఓ జ్ఞాపకం



మచిలీపట్నం

చిన్నక్క బి.ఇడి. చదువుతోడి. రికార్డులు బొమ్మలు వగరా వగైరా సాయంచేయడానికి నేను వెళ్ళాను. బృందావన్ సినిమా వెనుక రైసు మిల్లులు వున్నాయి వాటి వెనుక రెండు రూములు. సాయంత్రాలు అక్క స్నేహితులు వచ్చి అన్ని రకాల కబుర్లు చెప్పుకొని కొంత చదువుకొని వాళ్ళ రూములకు వెళ్ళెవారు. 

నాకు కొద్దిగా పెన్సిలు తిప్పడంలోనూ, ఇండియన్ ఇంకుతో బ్రస్సు తిప్పడంతోనూ పరిచయం వుండటంవల్ల అవసరమైన వాళ్ళకి చార్టులువేసి, బొమ్మలు వేసి నా జేబుఖర్చులు నింపుకొనేవాణ్ణి. 

అక్క కాలేజికి వెళ్ళాక నాకు పెద్దగా పనివుండెది కాదు. అలాగే ఓరోజు కాళీగావుండి ఆలా ముఖ్యమైన రోడ్లన్నీ సర్వేచేస్తున్నాను. ఆ సర్వేలో కొన్ని సినిమా హాలులు కనిపించాయి. (సినిమాహాలు పేరు గుర్తు రావడం లేదు) కొత్త సినిమా విడుదల అయ్యింది. నేను సినిమాకని బయలుదేరలేదు కాబట్టి జేబు పెద్దగా బరువుగా లేదు. అయినా వున్నంతలో చూద్దంలే అని హాలు లోపలికి వెళ్ళా. అది ఆరోజే విడుదలయ్యిన సినిమాకి ఉదయం ఆట. బుక్కింగు వైపు చూసాను ఎవ్వరూ కనబడలేదు. టికెట్లు అయిపోయాయనుకున్నా కాని తీరా చూస్తే చాలా ఖాళీగా వుంది. లోపలికి వెళ్ళాలా వదా అని తటపటాయించాను. సినిమా మొదలయ్యిన దగ్గరనుండి నేను వింత మోహానికి లోనయ్యాను. ఇంటర్వెల్‌లో బయటికి కూడా రాలేదు. బయటికి వచ్చేటప్పుడు చూస్టే చాలా తక్కువమంది వచ్చారని అర్థమయ్యింది. నాకు సినిమా మళ్ళీ చూడాలనిపించింది. 

బహుశ నాకు అలా అనిపించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి. ఇలా ఇంతకుముందు "పదహారేళ్ళా వయసు" ఉదయం ఆట, వెంటనే మాట్నీ చూసాను. 

జేబు కొంచెం బరువు తగ్గినట్టు అనిపించి రూముకు పరుగెత్తి, కడుపులోకి కొచెం అదరా బదరా మింగి మాట్నికి పరుగెత్తాను. 
రూముకు వచ్చి ఎంతలేపినా లేవనంతగా నిద్రపోయాను. 

***

10 గంటలప్పుడు తినడానికి అక్క లేపితే బలవంతంగా లేచాను. అప్పటికి అక్క స్నేహితులు వరండాలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. నేను తింటూ సినిమా సంగతి చెప్పా. నా మాటలు విన్న వాళ్ళు మరుసటి రోజు ఎలాగైనా సినిమా చూడాలని ప్లాన్ చేసుకున్నారు. నేను తిని మండుకున్నా సినిమాయే నాకు కళ్ళలో మెదిలింది.

***
నేను చెప్పిన కథనరీతికి ముగ్దులై  మరుసటిరోజు సినిమాచూసివచ్చారు. ఒకటే తిట్లు నాకు. వాళ్ళకి నచ్చలేదెందుకో.

వాళ్ళతో చాలా రోజులు వాదోపవాదాలు నడిచాయి. ఓ వారం తర్వాత వాళ్ళే మళ్ళీ చూసి నాకు సారీ చెప్పారు.

* * *
ఇంతకీ ఆ సినిమా శంకరాభరణం

* * *
గుడివాడలో, రాజమండ్రిలో, ఏలూరులో ఆ సినిమా ఎక్కడ కనబడినా చూసాను. ఏలూరులో విశ్వశాంతి హాలులో ఆడుతుండేది. ఒకవారంలో నాలుగు సార్లు వెళ్ళేటప్పటికి ఒకడు స్నేహితుడయ్యాడు. మానేజిమెంటు టికెట్లును గురించి చెప్పాడు, అవి కొంత కన్సెషనుకు తెలిసిన వాళ్ళకు ఇస్తారు. అవి తీసుకొని దాదాపు ఓ వంద(100)సార్లు పైగా చూసాను. (నాకు షీల్డు ఎవ్వరూ ఇవ్వలేదు) 

* * *

మొన్న టివిలో వస్తుంటే చూడలనిపించలేదు ఎందుకో అర్థం కాలేదు. 



Friday, March 23, 2012

అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా!!!!!

గత ఉగాదికి బైపాస్ ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ కోసం ఎదురు చూస్తున్నాను. డాక్టర్లు, నర్సులు ఉగాది పచ్చడి తినిపించారు. అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా అనిపిస్తుంది కాని, ఎన్ని అవాంతరాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిద్ర పట్టని రాత్రులు. అన్ని షడ్రుచుల సమ్మేళనమే.జ్ఞాపకాలను విప్పి చుపలేను కానీ, దేహం పై ఆపరేషన్ కుట్ల గాయాల కనిపిస్తూనే ఉన్నాయి.
జీవితమెప్పుడూ ఒకేలా ఉండదుకదా

గతంలో బ్లాగులో  సరదాగా నా చేతిని స్కాన్ చేసి హస్త సాముద్రకాన్ని గురించి ఎవరైనా చెబుతారా అని అడిగినప్పుడు ఓ అజ్ఞాత మిత్రుడు మీ ఆరోగ్యం జాగ్రత్త. త్వరలో ఏమైనా జరగోచ్చు అని చెప్పాడు. అప్పుడు సరదాగానే తేలికగా తీసుకున్నా. ఇప్పుడది చూసినప్పుడు ఆశ్చర్య మనిపిస్తుంది.

నాకు సేవ చేసిన పిల్లలు, నా ప్రక్కటెముక మరువ లేని వారే.

అన్ని వేళల్లోనూ స్పూర్తి నిచ్చి త్వరగా కోలుకోవడానికి ధైర్య పరిచిన మిత్రులను మరచిపోలేను. 
 


Monday, November 14, 2011

ఫేసుబుక్కు ఆరు నెలల ప్రయాణం – సింహావలోకనం


ఏప్రిల్, మే, జూన్ నెలలలో మెడికల్ శెలవులో వున్నప్పుడు  మే నెలలో ఇంటిలో నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అంతర్జాలము నాకేమి కొత్త కాదు. నేను బ్లాగు మొదలు పెట్టిన తొలినాళ్ళలో సుమారు 200 బ్లాగర్లు మాత్రమే వుండేవారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బ్లాగులు రాసిన రోజులవి. అప్పట్లో మదర్స్ డే సందర్భంగా  రాసిన పోస్టులతో అమ్మ అనే ఈ సంకలనం చేయడం జరిగింది. తెలుగులో వచ్చిన మొదటి ఈ సంకలనము. రెండవ ఈ పుస్తకము,
అంతర్జాల పోస్టులతో నాన్న  సంకలనం చేయాలని ఎప్పటిదో కొందరిమిత్రుల కోరిక.  ఫాదర్స్ డే రోజునుంచి కొంతమంది స్పందించారు. వారిలింకులనుండి పోస్టులను సేకరించాను. పేజి సెట్టింగులు చేసి కొంత పనిచేసాను కంప్యూటరులో వైరస్ రావడం, బ్యాకప్ తీసుకొనే అవకాశం చిక్కకుండా ఫార్మేట్ అవ్వడంతో ఆ కోరిక సగంలోనే అసంపూర్ణంగా మిగిలిపోయింది. శరీరం అనుకూలిస్తే అది పూర్తి చెయ్యాలి. ఇంతకుముందు స్పందించిన మిత్రులు ఇది చదువుతున్నట్లయితే మీ లింకులు పంపండి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను.   
సేకరించిన డాటా కోల్పోవడం చాలా బాదాకరం అనిపించింది.
అప్పుడే శ్రీమతి శైలజామిత్ర ఫేస్ బుక్కును పరిచయంచేసారు. ప్రతీరోజు గాయాలకు డ్రెస్సింగు అయ్యాక భోజన సమయంలోపు గ్రూపులోనివి  చదవడం అలవాటయ్యింది.. వివిధ మిత్రులద్వారా కొన్ని గ్రూపులు పరిచయమయ్యాయి. నిద్ర పట్టని రాత్రులను ఫేసుబుక్కు కవిత్వంలో గడిపాను.

సాహిత్య మిత్రులు, సాహిత్యనిధి, స్వేచ్చ, తెలుగు సాహితీ వలయం, మొజాయిక్, ప్రేమ ప్రేమకై.. ప్రేమించు, నానోలు ...ఇలా గ్రూపులు పరిచయమయ్యాయి. 
శైలజా మిత్ర సాహితినిధి, సాహితిమిత్రులు గ్రూపును పరిచయం చేసారు
జ్యోతిర్మయి తెలుగు సాహితీవలయం గ్రూపును పరిచయంచేసారు
ఈగ హనుమాన్ నానోలు గ్రూపును పరిచయంచేసారు
మురళీధర్ నామాల స్వేచ్చ గ్రూపును పరిచయం చేసారు
జగతి జద్దాత్రి మొజాయిక్ గ్రూపును పరిచయంచేసారు
శ్రీనివాస్ వాసుదేవ్ ప్రేమ ...ఒరేమకై ప్రేమించు... గ్రూపును పరిచయం చేసారు
 

ఇంతకుమునుపే సాహిత్యంలో పరిచయమున్నవారు ఫేసుబుక్కులో కొద్దిమంది మాత్రమే వున్నా నేను వున్న శారీరక పరిస్థితిని బట్టి ఆన్ని చదివినా నచ్చినవాటిని మాత్రమే అభిప్రాయాలు రాయటం మొదలుపెట్టాను.
వాదులాటలు, కీచులాటలు అభిప్రాయభేదాలు ఏ గ్రూపుల్లో కూడా తలెత్తినప్పుడు వాటినుండి దూరంగానే వున్నాను. 
కొందరికి నేను చేసిన సూచనలు నచ్చాయి, నచ్చినవారు అమలుచేయడం కనిపించింది. కొందరు వారిదోరణిలో(మొనాటనీ) వారు వెళుతున్నట్టే కన్పించారు. అటువంటివారి పోస్టులు పెద్దగా పట్టించుకోవడం మానేసాను.
ఆసుపత్రి అనుభవాలను అక్షరీకరిద్దామనే బలీయమైన కోరిక వుండేది, మొదలుపెట్టి కొన్ని పోస్టులు రాసాను. అవి చూసి వీడేంటి ఇలా రాస్తున్నాడు అనుకున్నవారు వుండేవుంటారు. రెండు మూడు నెలల తర్వాత ఆ పోస్తులను అన్నీ ఒకచోట పెడదాము అనుకుని ప్రయత్నం చేసా కానీ ఫేసు బుక్కులో రాసిన పోస్టులు శాశ్వతంగా (బాక్ అప్) ఉండవని అప్పుడే తెలిసింది.    వాటిని కోల్పోయాను. మళ్ళీ అలాగే రాయలేను.
 ఒకొక్కరిగా పరిచయాలవుతున్న నేపద్యంలో కొందరి మాటలు స్వాంతనను, కొత్త స్పూర్తిని నింపితే కొందరి మాటలు, పనితీరులు కొంత నొప్పించాయి. అప్పుడే గ్రూపులో ఏమి జరుగుతుంది అని చూడటం కంటే నాకు ఏది అవసరం అనే విషయంపైనే శ్రద్ద పెట్టాలి అని నిర్ణయించుకున్నాను.
పరిచయాలలో :
మురళీధర్ నామాల
బ్లాగులలో పరిచయం. తూర్పు పడమరల సమయ తేడాలవల్ల నిత్యం ఆన్‌లైనులో తోచినదేదో మాట్లాడినవాడు.
స్వేచ్చగ్రూపుకు మార్గం చూపాడు. ఇంచుమించు నా అన్ని రాతలను చదివిన వాడు.  
ఈగ హనుమాన్ ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. చాలా సందర్భాలలో కలిసిన, తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  నానోలలోని   రసాస్వాదనను  నాకు ఎక్కించాడు. 

ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  

జగతి జగద్దాత్రి - ఫేసు బుక్కుకంటే ముందుగానే తెలిసినా, ఫేసు బుక్కు సాహితీ సాన్నిహిత్యాన్ని పెంచింది. చాట్ చేస్తూ చేస్తూ మాట్లాడిన పదాలలోంచి పాటలుగా అల్లడం జరిగింది. ఆ ధోరణి(ఫీవర్) కొన్నిరోజులు సాగి సుమారు 12 పాటలు రాయడం జరిగింది. నా బ్లాగులో చూడవచ్చు. విశాఖకు వస్తే మొజాయిక్ ఆహ్వానం అనడంతో అక్టోబరు నెలలో (10.10.2011)  మండే మొజాయిక్‌ లో పాల్గొనడం జరిగింది. దాని వివరాలు బ్లాగులో చదవొచ్చు. 
నూతక్కి రాఘవేంద్ర రావు :
ఈయన మూడుచక్రాల బండి అనే కిరీటంతో రాసినవి నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, మరింత సన్నిహితం చేసాయి. పెద్దవయసులోకూడా ఆయన  కవిత్వాన్ని  గురించి చూపించే ఆసక్తి  నన్ను అబ్బుర పరుస్తూనేవుంది. నన్ను ఉత్తేజపరుస్తూనేవుంది.
బహుముఖ ప్రజ్ఞలు ఈమె కలిగి వుండటం ఆశ్చర్యపరచిన సందర్భంలో నన్ను గజల్ రాయమని సూచించడం జరిగింది. నేను మొజాయిక్‌లో పాల్గొన్నప్పుడు నేను రాసిన పాటను పాడివినిపించి మరింత ఆశ్చర్యానికి లోను చేసారు. కొన్ని గజల్స్ ప్రయత్నించడం  జరిగింది.

జగన్నాద్ వడిమెల్ల
కవికిరీటి మీకు నేను ఏకలవ్య శిష్యుడను అంటూ ఉక్కిరిబిక్కిరిచేసే సోదరుడయ్యారు.

తను రాసిన వీరి వీరి గుమ్మడిపండులో నన్నూ చేర్చడంద్వారా చేరువయ్యి నేను విశాఖ వెళ్ళినప్పుడు నా కవిత్వం గురించి సభలో పరిచయంచేసారు.

రసవత్తరంగా రాసే కవిత్వంతో పాటు అంతే రసవత్తరంగా ఆయన అభిప్రాయలు వెలిబుచ్చడం నన్ను సన్మోహనపరచాయి. గ్రూపులో బైబిలు వాక్యాలను పోస్టు చేయమని   ఉదయమే చదవడం చాలా బాగుంటుదని అని  బాధ్యతనిచ్చారు.
శ్యామిలి నయబిల్లి
పోస్టు చేయగానే లైకు పెట్టదానికి ముందువుంటుంది. ఎప్పుడు ఆన్‌లైనులోనే కనిపిస్తుంది. ఎప్పుడు నిద్రపోతుందా అనేది నా అనుమానం
తమదైన గొంతులతో కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ నాకెందుకో వీరి కవిత్వాన్ని చదవాలనే ఆసక్తిని కలిగించారు
కల్లూరి శైలబాల
తక్కువ పరిచయం ఎక్కువ ఇంపాక్ట్ /అనుభవం
ఓరోజు మీ కవితా నేపద్యం రాయండి అని ఒక పోస్టువేసారామె. దానికి స్పందిస్తూ నేను కొన్ని పోస్టులు రాసాను. రెండుమూడు పోస్టుల మినహా మిగతావి అమె చూసినట్టు నాకు అనిపించలేదు. ఎవరికి వారు అక్షరాల వెనుక, అక్షరాల మధ్య చదువుకునేది  కవిత్వం. నేపద్యం పాఠకుడికి చెప్పడంవల్ల అక్షరాల ముందు వెనుక, మధ్య అనే పరిధికి  పరిమితులు గీసినట్టు అవుతుంది. అదే విషయం మిత్రులు చెప్పారు, ఇది కోరినది శైలబాల  అయినా నన్ను నేను పునః పరిశీలించుకోవడానికి దోహదపడుతుందని రాసాను.
అవి ఒక డాక్యుమెంటుగా పొందు పరచాను. మరోసారి పోస్టుచేస్తాను.
కొన్నిరోజులతర్వాత మళ్ళి గ్రూపులో కనబడి ఎదో అడిగారు ఆమె. ఇలా అడుగుతారు మళ్ళీ కనబడరు అనేసరికి కోపమొచ్చినట్టువుంది. ఆ పోస్టును డిలీట్ చేసారు మళ్ళీ నాకు గ్రూపుల్లో తారస పడలేదు.
* * *

మూడునెలల శెలవుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆఫీసు అవసరాల దృష్ట్యా ఎప్పుడూ ఆన్‌లైను ఉండటం వల్ల ఫేసుబుక్కులోకి తొంగిచూసే అవకాశం చిక్కింది. 
మెల్ల మెల్లగా పనిభారం  పెరుగుతూ  వచ్చింది. అలా రావటంవల్ల చదివిన వాటికి అభిప్రాయాలు రాసే సమయం తగ్గిపోయింది.
సెప్టెంబరు 5న చాలారోజుల తర్వాత వురకలేసిన నా కలం - అనే కవిత రాసాను. అది చాలారోజుల తర్వాత రాసిన కవిత అది. దాని తర్వాత రాయటం తరుముకొచ్చింది.
------------------
ఈ మద్యలోనే చేసిన ఇతర పనులు
ఎప్పుడో రాసిన ప్రేమాంతరంగం - కావ్యాన్ని బ్లాగులో పోస్టుచేసాను.
తెలుగు ఇంగ్లీసులలో వచనం వంబడి వచనంగా  బైబిలులోని అధ్యాయాలు తెలుగు బైబిలు  బ్లాగులో పోస్టుచేసాను.
--------------
ఎక్కువసమయం ఆ ఫేసుబుక్కులోనే గడుపుతున్నావు అని నా ప్రక్కటెముక హెచ్చరిస్తుంది
అందుకే కొన్నిరోజులు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాను.

నా అభిప్రాయాలు రాస్తే బాగుంటుందని ఎదురుచూసి ఎవరైనా నిరుత్సాహం చెందితే మన్నించండి.


సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు  పీతవి

Tuesday, March 8, 2011

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాభినందనలు


అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శుభాభినందనలు

ఎందరో మహిళా మూర్తులు ప్రగతి పథంలో
ముందుకు నడుస్తూ, నడిపిస్తూ
నిలిచిన ఈ క్షణం
శిరసువంచి నమస్కరిస్తున్నాను


జాన్ హైడ్ కనుమూరి 





http://www.graphics18.com/wp-content/uploads/2010/03/women-s-day-greeting-cards

Saturday, August 21, 2010

'ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యం

చాలా సంతోషమనిపించింది.




నేను బ్లాగు మొదలుపిట్టిన మొదట్లో రీసెర్చికి కావసినంత విషయం వుందని, జరగాలని ఆశించినవాడిలో నేను ఒకణ్ణి.

ఇప్పుడు అది నిజం కాబోతుంది.
 
హలో ఫ్రెండ్స్..


నేను 'ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యం ' అనే అంశం మీద పరిశోధన చేస్తున్నాను.అందుకోసం నేను మీ సహకారాన్ని కూడా కోరుతున్నాను.కింది ప్రశ్నలలో మీకు తెలిసిన సమాధానాలను విపులంగా నాకు తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నలే కాక మీకు ఇంటర్నెట్ లో వున్న ఏ తెలుగు సమాచారమయినా , తెలుగు పత్రికలు,వెబ్ సైట్లూ... ఇలా తెలుగు కి సంబంధించిన ఏ విషయమయినా దయతో తెలియజేయండి.ఈ ప్రశ్నావళి నీ మీకు తెలిసిన మిత్రులకి కూడా పంపి సహకరించండి.

- అభినందనల తో

హేమలత పుట్ల





వెబ్ లో తెలుగు సాహిత్యం





1 ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యం ఉందని మీకు తెలుసా?



2. తెలిస్తే ఎటువంటి సాహిత్యం ఉందని భావిస్తున్నారు?



3.మీరు ఎక్కువగా ఇంటర్నెట్ లో ఎటువంటి సాహిత్యాన్ని చదువుతున్నారు?



4. తెలుగు సాహిత్య మాసపత్రికలు, బ్లాగులు మీరు చూస్తుంటారా?



5.పై వాటిలో సాహిత్య విలువలున్న పత్రికలూ తెలిస్తే చెప్పండి?



6.మాసపత్రికలలోని శీర్షికలలో మీకు బాగా నచ్చినవి ఏవి?



7. ఉపయోగకరమైన తెలుగు బ్లాగులను మీరు గుర్తించారా?



8. మీకు వెబ్ సైట్ ఉందా?



9. ఇంటర్నెట్లో ఇప్పుడున్న సాహిత్యం మెరుగ్గా ఉందా?లేదా మార్పులు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా?



10. వెబ్ లో తెలుగు భాషకి ప్రాధాన్యం ఇస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి మీకు తెలిస్తే చెప్పండి?



11. గూగుల్ , యాహూ, ఒపేరా, యాపిల్ కంపెనీ లు తెలుగుకి ప్రాధాన్యత ఇస్తున్నాయా ?



12. తెలుగు బ్రౌజర్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలిస్తే చెప్పండి?



13. మీకు తెలిసిన, నచ్చిన తెలుగు వెబ్ సైట్ల గురించి,బ్లాగుల గురించి, ఆర్కుట్ కమ్యూనిటీల గురించి ఇంకా మాస పత్రికల గురించి వివరాలు ఉంటె తెలియచేయండి?



14. మీకు కంప్యూటర్ పరిచయం ఉందా?



15. ఇంటర్నెట్ లో అక్షరాల formats గురించి తెలుసా? తెలిస్తే వివరించండి.



16. unicode font గురించి చెప్పండి?



17. శ్రీలిపి,అను,ఐలీప్ తదితర ఫాంట్సు యూనికోడ్ గా మారే సాఫ్ట్ వేర్ల గురించి మీరేం గుర్తించారు?





18.ఇంటర్నెట్ సాహిత్యానికి ప్రింట్ సాహిత్యానికి మధ్యగల సౌలభ్యాని గురించి మీరేం గుర్తించారు?



19. ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యాన్ని తెలుగుభాషలోనే చదువుతారా ?లేదా ఇతరభాషల్లో చదువుతారా?



*. తెలుగును తెలుగు లిపిలో చదవడం



*. తెలుగును ఇంగ్లీషు లిపిలో చదవడం



* తెలుగును ఇంగ్లీషు భాషలో చదవడం.



* తెలుగును ఇతర భాషల్లో చదవడం.







౨౦. తెలుగు సాఫ్ట్ వేర్ మొదట ఎప్పుడు ,ఎవరు కనుగొన్నారు?



21. తెలుగులో మొదటి బ్లాగర్ ఎవరు?



౨౨.తెలుగులో మొట్టమొదటి వెబ్ సాహిత్య పత్రిక ఏది?



౨౩. భవిష్యత్తులో తెలుగు సాహిత్యం ఇంటర్నెట్లో ఎంతగా అభివృద్ధి చెందబోతుంది. ప్రింట్ మీడియాకి,నెట్ సాహిత్యానికి ఎటువంటి పోటీ ఉండబోతుంది.?



౨౪. నెట్ వాడకందార్లు తెలుగుని ఎలా ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారు?



౨౫.స్తీలకోసం , పిల్లల కోసం ప్రత్యేకించిన పత్రికలు , లేదా మరేవైనా కొత్త పత్రికలు మీ దృష్టి కి వస్తే చెప్పండి.

Thursday, June 18, 2009

నా జీవితంలో శ్రీ శ్రీ

నా జీవితంలో శ్రీ శ్రీ

ఈ మద్య శ్రీ శ్రి గురించి చదుతున్నప్పుడు నాకు ఆయనతో ఎటువంటి అనుబందం లేకపోయిందే అనిపించింది.
నా యవ్వనంలో సాహిత్యం పెద్దగా చదివిన గుర్తులేదు. అందులోనూ శ్రీ శ్రీని అసలు చదలేదు.
ఓ సాయత్రం ఆఫీసు అయిపోయి ఇంటికి వెళుతున్నప్పుడు బస్సులో మగత మగతగా కొన్ని జ్ఞాపకాలు వెంటాడాయి.ముఖ్యంగా రెండు సందర్బాలు.

1. నా 24వ ఏట పెళ్ళి సంబందాలు రావటం మొదలయ్యాయి. అప్పటికి నాకంటే పెద్దదైన అక్కకు నాకు కలిపి కుండమార్పిడి సంబందం ఒకటి. మా ఇంటిలోని వారికి చాలా వరకు నచ్చింది. కాని నేను 28 సంవస్తరాలు వచ్చేవరకు చేసుకోనని నిర్దందంగా చెప్పేసాను. అప్పటికి నేను మద్యప్రదేశ్ లోని జబల్‌పూర్ వద్ద ఓ కంపెనిలో పనిచేస్తున్నాను. అక్కడనుంచి ఒక సంవత్సరంపాటు ఇంటికి రాలేదు. అక్క పెళ్ళికోసం వచ్చినప్పుడు నా మీద ముగ్గురు మరదళ్ళ చూపు పడింది. ముగ్గురుతో కొద్దిగా చనువు ఏర్పడింది. అది ప్రెమని నేను అనుకోను కాని మా మద్య పలకరింపుల లేఖలు నడిచాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత ముగ్గిరిలో ఎవరినైనా ఎన్నుకోవాలా లేక బయటకు వెళ్ళాలా అనే సందేహం కలిగింది. ఒకరు రూపంలో బాగుండేది, ఇంకొకరు చదువులో ముందుండేది, ఇక మోడో ఆమెకు రెండిటిలోనో సాధరణమే అయినా, పొలము పుట్ర సంక్రమించేవిగా వుంది. ఇలాంటి సమయంలో శ్రీ శ్రీ నాకు తెలియకుండా నా జీవితంలోకి ప్రవేశించాడు.
అది ఎలా అంటారా?
"నిన్ను నిన్నుగా ప్రెమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే బాగ్యమో! అదే స్వర్గమో!" ముగ్గురిలో ఒకరు నా ప్రక్కటెముకగా మారింది.
ఆ భాగ్యాన్ని, ఆ స్వర్గాన్ని సొంతంచేసుకున్నాక చాలా కాలం నన్ను ప్రభావితం చేసింది శ్రీ శ్రీ అని తెలియదు.

2
ఒ రోజు ఎక్కడికో ప్రయాణంచేస్తూ బస్సుకోసం ఎదురుచూస్తున్నప్పుడు ఫుట్పాత్ మీద పాత పుస్తకాలు కనిపించాయి. అందులో ఓ చిన్న పుస్తకాన్ని సైజు చూసి డిటెక్టివ్ అనుకోని అయిదు రూపాయలకు కొన్నాను. దానికి అట్టలేదు. తీరా బస్సు వచి, సీటు దొరికాక పుస్తకంలోపలికి వెళితే అది వచన కవిత్వం, అందులోనో మైకోవిస్కీ రచనకు తెలుగు అనువాదం (నిజానికి అప్పటికి మైకోవిస్కీ తెలియదు). ఆ పుస్తకం ఎంతగా నచ్చిందంటే ప్రతీ ప్రయాణంలో పట్టుకెళ్ళేవాడిని. కొన్నిరోజులు దాన్ని మర్చిపోయాను. మళ్ళీ ఓ సాహితి మిత్రుడు వద్ద ఏ పుస్తకం విషయం ప్రస్తావన వచ్చింది. అప్పుడు తెలిసింది అది మైకోవిస్కీ రచన, శ్రీ శ్రీ అనువాదం.
ఇది రాస్తున్న సమయానికి చాలా సంవస్తరాలే అయ్యింది చదివి. అందులోని పాదాలు నాకు కుర్తుకు లేవు. కానీ అది చదినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇప్పుడు అనిపిస్తుంది నేను సాహిత్యం చదవడం, మొదలుపెట్టాక రాయడంలో బహుశ దాని ప్రభావం వుందనిపిస్తుంది.
నాకు తెలియకుండానే నా జీవిత కీలక సంఘటనల్లో శ్రీ శ్రీ చొరవ తీసుకొని ఆలోచనాంతర్బాగం అయిపోయాడు. నన్ను రుణగ్రస్తుణ్ణి చేసేసాడు. ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది.
శిరసు వంచి నమస్కరిస్తున్నా.

Wednesday, March 25, 2009

ఎందుకో ఇలా??

నిర్మానుష్యమైన చోటికి పారిపోవాలని మనసు పదే పదే కోరుకుంటుంది. నిజానికి అలాంటి ప్రదేశం ఏదైనా దొరుకుతుందా? నిద్రకన్నుల రెప్పల్ని బలవంతంగా అలారం మోతతోటి తెరిచి, రొదపెడ్తన్న చోటుల్లోకి ఒకటే పరుగులు, వురకలు. కాసింత తొలిజాము కూతల పక్షుల సవ్వడి మరచిపోయామా? లేక రొదగా భావించి పక్షులకే అలారంమోత నేర్పి కొత్త సమయాన్ని, కొత్తస్థలాన్ని వెతుక్కోమని తోలివేసామా??
వెంటాడుతున్న బాద్యతల్ని ఒకొక్కటిగా నెమరువేసుకుంటూ నేటి పనుల జాబితాల్ని తయారు చేసుకుంటుంటే వాటి మద్య ఎక్కడైన నిర్మానుష్యమైన ప్రదేశానికి చోటుదొరుకుతుందా సమయం దొరుకుతుందా. బహుశ అంతర్జాల బ్రౌజర్లో వెతకాలేమో. దానికోసం ఏ ఏ కోడును ఉపయోగించాలో. ఒకదాని వెంబడి ఒకటి వెంటాడి వెతుకుతున్న దాన్ని మరిపింపచేసే గందరగోళంలో పడవేస్తాయి కదా!
బ్రతుకు జీవనం తరుముతుంటే రహదారులవెండి పరుగులు తీస్తుండాలి. వరదలాంటి వాహనాల ప్రవాహంలోకి జొరబడి ఒడ్డుకుచేర్చే తెడ్లకోసం వెతుకుతుంటాము.
మంచుకురిసినట్టో, ఎర్రని గుల్మోర్ పువ్వులు రాల్తున్న రహదారుల్లో రూపాయలకోసంవెతుకులాట గుర్తుకోచ్చి ప్రశ్నించే బాసు మొఖం కళ్ళముందు కదలాడి నుదుటపట్టే చెమటను తుడుచుకోవడమే మరచిపోయి పరుగులు తీయాల్సిందే! గాలివీచే కిటికీలను మూసివేసిన గదుల్లో ఎవరికివారే బందీలుగా అప్పగించుకొని బయటపడే మార్గంకోసం మరోవైపునుంచి వెతుక్కోవల్సిందే! బయటపడాటంకోకోసంచేసే ప్రయత్నాలలో అలసిన దేహం విశ్రాంతిని కోరుకొంటుంది. సుఖాన్ని మరచి, గతాన్ని మరచి మరుపుపొరలనద్య, మగత నిద్రల మద్య మరో రాత్రి పలకరించిపోతుంది.
దేన్ని వెతుకుతున్నానో ఏది కోరుకుంటున్నానో
ఎక్కడనుంచో మ్రోగిన రింగుటోను ఎదో అలజడిని గుర్తు చేస్తుంది.

Monday, December 1, 2008

గాయం ... సలుపెడుతుంది....

ఈ మద్య నేను నా సహచరుణ్ణి కోల్పోయాను. నిజానికి అతను నా చుట్టుతిరుగుతున్నప్పుడు, నాతోనో వుంటున్నప్పుడు అతణ్ణి నా సహచరుడుగా గుర్తించలేకపోయాను.
ఓ రోజు హటాత్తుగా వురిపెట్టుకొని చనిపోయాడనే వార్తను సెల్లుపోను నా చెవిలోకి జారవిడిచినప్పటినుంచి, నా హృదయాన్ని కుదిపేస్తుంది.
ఈ మద్య ఎప్పుడో ఆత్మహత్యలగురించి రాద్దమని చాలా విషయాలను సేకరించాను కాని నా వ్యక్తిగతము, సమయ చిక్కబట్టుకోలేక రాయలేకపొయా. రాసివుంటే బహుశ నా సహచరుడుకి వుపయోగపడెదేమో అనే సందేహం పీడిస్తుంది.
అలోచనలతో మస్తిష్కం వేడెక్కుతోంది, ఈ లోగా అవకాశాన్ని చూసుకొని ఎటునుంచి లోనికిదూరిందో క్రిమి (వైరస్) జ్వరమై పీడిస్తుంది. ఈ జ్వరంలో పలవరింతలు, భయాలు, ఒకొక్కటిగా దాడిచేస్తున్నాయి. నా దేహాన్ని నిర్వీర్యం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. నా సహచరుణ్ణి ఆర్థింకంగా వుచ్చులోబింగించి తనుకుతాను దూరంగా పారిపోవాలనే ఆలోచను రేకెత్తించి, బంధాలను బాద్యతలను నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. రోజూ చూపులతొనో, మాటలతోనో వేధించే తన సగభాగానికి పూర్తి బాద్యను నెట్టేసి పారిపోయాడు.
తను పారిపోయిన పిరికితనంలో నాకూ భాగస్వామ్యం వుందా?? అనే అలోచన ముల్లులా గుచ్చుకొని మరింత బాధిస్తుంది.
ఒక్కసారి లోనికి ప్రవేసించి రక్తంలొకి చొరబడ్డ వైరస్‌ను చంపడానికి చేస్తున్న ప్రయత్నాలలొ దేహం తూట్లు పదుతుంది.
దేహానికి కొత్తగాయమో, అంగచ్చేదనమో అవసరమౌతున్నాయి.

వైద్యంకోసంచేస్తున్న ప్రయత్నలూ నా దేహాన్ని బాదిస్తూనే వున్నాయి.
అయినా రేపటి ఉదయంకోసం నిరీక్షన, ఆసై ఎదురుచూస్తుంది.
ఏ జాములోనో కప్పిన మంచుపొరను చీల్చడానికి వేకువకిరణం ఆరాటపడుతునేవుంది.
నా సహచరురుణ్ణి గుర్తించడమే కష్టమౌతుంది. మనసుపొరల్లోచి మేలుకొన్న మానవత్వమై నీకోసం ఎదురుచూస్తాను.
ఛేదు జ్ఞాపకాన్ని ఇచ్చిపోయావు, మరెవరికీ ఈ రుచిని చూడొద్దని ఎలుగెత్తి చెప్తాను.

Friday, November 21, 2008

అప్పుడప్పుడు ఇలాకుడా జరుగుతుంది


నిన్న అనగా 20.11.2008 ఆధ్ర జ్యోతిలో రాధిక బ్లాగుపై వ్యాక్య వచ్చింది, కానీ పొరపాటున నాబ్లాగు లంకె ఇవ్వడంవల్ల కొద్దిగా నా బ్లాగులోకి సందర్శకులు వచ్చరని వ్యూ స్టట్ ను బట్టి తెలుస్తుంది

నిజానికి ఈ నొక్కులు రాధిక "స్నేహమా" బ్లాగుకు చెందవలసినవి.

ఆంధ్రజ్యోతివారు ఈ విషయం గమనించగలరు.

రాధిక గారికి అభినందనలు.

Friday, October 17, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి ?? వెంటాడుతుంది.

మార్టీన్ లూథరు ఒక చర్చికి ఫాదర్ వుంటున్నపుడు మత ఆచారలపేరిట జరుగుతున్న వాటిపై ఒక రకమైన వ్యతిరేకతను తెలియజేసాడు. ఆ వ్యతిరేకత చివరికి తిరుగుబాటుగా మారి క్రైస్తవ్యంలో పెద్ద చంచలనాన్ని, మార్పును తెచ్చింది.
అక్కడే క్రైస్తవ మతం పేరిట రెండుగా చీలిపోయింది.
కాథలిక్, ప్రటెస్టంటులుగా విడిపోయి ఆచారాలలోను, వ్యవహారలలోనూ నమ్మకాలలోను భిన్నత్వాన్ని ఏర్పరచుకున్నాయి.

Monday, October 13, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3
ఇలా రాయవలసిన అవసరం వస్తుందని అనుకోలేదు.
నేను రాసిన విషయము చర్చగా పక్కదారి పడుతున్నందుకు ఈ టపాను రాస్తున్నాను.
1. మతపరమైన దాడుల వార్తలను చూస్తున్నప్పుడు నాకు మా తాత గారు గుర్తుకురావటం జరిగింది. ఆయన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సామాజికంగాను పడిన అవస్థలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు నాకేమనిపించిందంటే దాడులు జరగటమనేది నేడు కొత్తకాదు అని..

దాడుల జరుగుతున్న నేపద్యంలో ఆస్థులను కోల్పోతూ, అస్థిత్వాన్ని కోల్పోతూ కూడా క్రైస్తవ్యాన్ని నమ్ముకోవడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది. అందువల్లనే తరువాత తరానికి అందించారు అని నాకు అనిపిస్తుంది.
మాలాగే హిందువులనుంచి అనేకులు క్రైస్తవులగా మారిన వారు, క్రైస్తవ వ్యాప్తికోసం, క్రైస్తవ సేవకోసం తమ ధనాన్ని, ఆస్తులను విరాళంగా ఇచ్చిన వారు వున్నారు ... అలా అస్తులను పంచీవ్వడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది.

3. మత ప్రచారాన్ని గురించిగాని, మార్పిడులగురించి గాని నేను ప్రస్తావించలేదు.
సామాజికంగా వెనుకబడిన వారు మతం మారుతున్న నేపద్యాలవెనుక అర్థిక, సామాజిక, లౌకిక రాజ్య పర్థితులు వున్నాయి. వాటిని నేను చర్చించడంలేదు.

4 నాకు లేఖరాసిన బ్లాగుమిత్రుడు ఇచ్చినవివరాలు, గణాంకాలు నిజానిజలతో నా టపాకు సంబంధం లేదనిపిస్తుంది.
నేను రాసినది స్వీయానుభవంనుండి నా భావన. అది గణాంకలతో కొలిచేది కాదు. మిత్రుడు రాసినది తన ఇంతకుముందు రాసిన టపాకు కొనసాగింపు. రెండు టపాలు క్రైస్తవ్యానికి సంబందించినవే అయినా విభిన్న పార్శ్వాలకు చెందినవి. ఒకచోట ముడివేయడం సరైయిన పద్దతి కాదేమో!

5. నేను మా తాతనుండి మా పిల్లవరకూ జరుగుతున్న క్రైస్తవ మార్పులను రాద్దామని మొదట అనుకున్నాను కాని పక్క దార్లు పడుతున్న వాదనలు, అభిప్రాయలకు కొంచెం కలతచెంది విరమించుకోవాలనుకుంటున్నాను.

ఏది ఏమైనా క్రైస్తవాన్ని స్వికరించి వడుదుడుకులకు, కాల వత్తిళ్ళకు నిలదొక్కుకుంటూ క్రైస్తవ్యాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నిలుపుకోవడంలో ఏదో మర్మం (సీక్రెట్) దాగివుందనే నా బలమైన నమ్మకం.

----
4829

Friday, October 10, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 2

ముందు రాసిన టపాకు వచ్చిన అభిప్రాయాలు, నాతో మాట్లాడిన స్నేహితుల మాటలను దృష్టిలో పెట్టుకొని మొదటి టపాకు కొనసాగింపుగా రాస్తున్నాను.
నా స్నేహితుల మద్య నడచిన సంభాషణల్లో క్రైస్తవ్యంలోకి జేరటంవల్ల ఆర్థికమైన సహాయం లబిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది ప్రశ్న?
నాకు నా అనుభవంలో అది నిజంకాదనిపిస్తుంది. మా మాన్న, పెదననాన్నలు మిషనరీల దగ్గర పెరిగినప్పటికి స్వయం పాలనను, వ్యక్తిగత స్వేచ్చను వారికి నానమ్మ నేర్పిందనిపిస్తుంది. కేవలము ఒక సామాజికమైన దన్నుకోసము, పిల్లలను చదివించాలనే లక్ష్యముతో మిషనరీల వద్ద పనిచేసింది కాని వారిజీవితాలను మిషనరీలపై ఆధారపడెటట్లు చెయ్యలేదు. తన ఆర్థిక వెసులుబాటుకోసం లేసులు అల్లేది (అప్పట్లో ఉభయగోదావరి జిల్లాలలో లేసులు అల్లి ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేవి), కలుపు పనులకు, కోతలకు, నాట్లకు వెల్లేది. నాన్న రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యొగంచేసారు. వారి సర్టిఫికెట్లలోగాని పిల్లమైన మా సర్టిఫికిట్లలోగాని "కులము" అనేది ఎక్కడా పేర్కొనలేదు.
నేను యవ్వనంలో ఈవిషయాన్ని చాలా సార్లు ప్రతావించినప్పుడు బైబిలులోని కొన్ని వాక్యాలను చెప్పేవారు "ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇవిగో సమస్తమును కొత్తవాయెను" ఈ వాక్యమును ఉదహరిస్తూ మనమిప్పుడు క్రీస్తును కలిగియున్నాము కాబట్టి మనము నూతనమైన వారము మనకి కులంతో ఏమి పని అనేవారు. వేదాంతపరంగా అది బాగున్నట్లు అనిపించినా తన వుద్యొగ ధర్మంలో తరచూ జరిగే బదిలీలలో అద్దేఇల్లు దొరకటం కష్టంగానేవుండేది. చాలా సార్లు ఊరిచివర్లోనో, కొత్తగా కడుతున్న ఇళ్ళలోనో వుండటం నాకు గుర్తు.
ఇక పోతే ఏడుగురు పిల్లలకు ప్రభుత్వంనుండి వచ్చే ఏరాయతీలకోసం ఆశించలేదు, కడుపు కట్టుకొనో అవసరాలను తగ్గించుకొనో, పస్తులు వుండో పిల్లలను చదివించారే తప్ప ప్రభుత్వ రాయతీలవైపు చూడలేదు. దానిక వెనుక దాగిన గొప్ప విశ్వాసమేదో నాకు ఇప్పటికీ అంతు పట్టడంలేదు.
ఒక్కడిగా వున్న మా తాతకు కలిగిన ముగ్గురు పిల్లలనుండి ఇరవైరెండు మంది పిల్లలుగా వృద్ది చెందడం, ప్రతివొక్కరూ చదువుకోవటం వారి పిల్లలు మరింత వున్నతమైన చదువులవైపు వెళ్ళడం ఆ నమ్మకంలోని ఆశీర్వాదమే అంటారు. ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలో అద్దె ఇల్లు దొరకటం అనేది పెద్ద సమస్య.
నమ్మకము, విశ్వాసాల మద్య సాంఘికమైన అవరోధాలు, అవమానాలు ఎదురౌతూనేవున్నాయి.
బలవంతంగా క్రైస్తవ్యంలోకి మారుస్తున్నారనేది మరొక అపవాదు. ఏది ఏమైనా క్రైస్తవులుగా మారటం ఒక సవాలే !
ఎన్ని జరుగుతున్నాఏదో ఒక కులాన్ని ఆశ్రయించి సాంఘిక లబ్ది పొదటం అనేది జరలేదు. ఇప్పుడు మాకుటుంబాలలో అన్ని రకాలైన కులాలనుండి వచ్చిన వారు వున్నారు.
మేమంతా క్రీస్తులో పాలి భాగస్తులమే అనేది మా అవగాహన. సామజికంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిపెడితే ఎటూ చెందని వారముగా మిగిలిపోతామేమో?

Wednesday, October 8, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి ?? వెంటాడుతూనే వుంది

ఏదో బ్లాగుల్లో రాసేయాలని ఒకటే తపన. ఏమిరాద్దామన్న ఎటూ తేలని ఆలోచనలు సతమతం చేస్తునే వున్నాయి. మతంపేరుతో జరుగుతున్న దాడులు కలవర పెడుతున్నాయి. ఇవేవీ కొత్తకాదు అనిపిస్తోది.

అప్పుడెప్పుడో సుమారు ఓ వంద సంవత్సరాల పూర్వం మా తాత (నాన్న గారి నాన్న) క్రైస్తవ్యంలో ఏమినచ్చిందో ఒక్కసారిగా ఆచారాలను, కుటుంబాన్ని కాదని క్రైస్తవ్యంలోకి దూకాడు. అది సరైనదికాదని ఎందరో నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృదా అయ్యాయి. అప్పటికి బ్రహ్మచారిగా వున్న తాతకు పిల్లను ఇవ్వటానికి చుట్టుప్రక్కల గ్రామాలలో నిరాకరించారు. దేశమేమీ గొడ్డుపోలేదంటూ అప్పటి మిషనరీల సాయంతో అప్పటికి ఐదవ తరగతి చదివిన మరో హిందూ కులంనుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తన బందువులమద్య, గ్రామంలోనూ ఇబ్బందులు మొదలయ్యాయి. కొన్ని తగాదాలు, పంచాయీతీలతర్వాత వూరినుంచి వెలివేసారు. అయినా తనకు సంక్రమించిన ఆస్తి అయిన 25 ఎకరాల పొలంలో ఒక పాకవేసుకొని జీవనం మొదలుపెట్టారు. వారికి వ్యవసాయంలో సాయానికి కూలీలు రాకుండా కట్టడి చేయబడింది. అయినా దేనికీ వెరవకుండా జీవనం సాగిస్తునే వున్నారు. వారికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. తనకు ముందు మూడు నాలుగు తరాలలో ఒకొక్కరే సంతానంగా వుంటూ వచ్చారు. తనకు ముగ్గురు మగసంతానం కలిగే సరికి మురిసిపోయేవాడట మా తాత గారు. తగ్గాయనుకున్న దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఇల్లు తగుల బెట్టబడింది. పాడి పశువులపై దాడి జరిగింది ఆ దాడిలో గాయపడిన తాతయ్య మళ్ళీ కోలుకోలేదు. చివరి మాటగా ఈ గ్రామంలో వుండవద్దు, ఎక్కడికైనా వెళ్ళి పిల్లలను చదివించు అని చెప్పి శాస్వత నిద్రలోకి జారిపోయారు. మా తాతగారి మాటను, ముగ్గురు పిల్లలను తీసుకొని ఆ గ్రామానికి దూరంగా వెళ్ళిపోయింది. తన ఐదవ తరగతి చదువు అక్కరకొచ్చింది. తనకంటూ ఎవ్వరూ లేని స్థితిలో మిషనరీలే అన్ని తామై ధైర్యానిచ్చారు. తనకు తెలిసిన లేసు అల్లికలతో, మిషనిరీల దగ్గర పనిచేస్తూ ముగ్గురినీ చదివించింది. పాతికెకరాల పొలంకోసం ఎప్పుడూ వెనుతిరిగి చూడలేదు. అందులో చివరి వారు మా నాన్న.
ఇవన్నీ అలోచిస్తున్నప్పుడు ఏ నిఘూఢ మర్మం నమ్మకం వెనుక దాగివుంది అనే అనుమానం కలుగుతుంది. జీవితాన్ని, జీవనాన్ని, ఆస్తులను పణంగా పెట్టడానికి వెనుకాడని మర్మం ఎమైవుంటుదనే సందేహాన్ని నేను వెతుకుతూనే వున్నాను.

4354

Friday, September 19, 2008

ప్రపంచం నలుమూలల నుంచి చదువుతున్న వారికి ధన్యవాదములు


బ్లాగుల ప్రపంచంలోకి దూరి నడుస్తూ నడుస్తూ అప్పుడే 15 నెలలు గడిచాయి. ఒక్క శాతంకూడా అర్థం కాలేదు

బ్లాగులంటే ఓ నిర్లిప్తత, నిరాశ, అసహనం... ఇలా కొన్ని భావనలు మీద పడుతున్న తరుణంలో నేనెందుకు బ్లాగాలి అని అన్పించింది. అదే విషయాన్ని టపాగా రాసినప్పుడు ఓ మిత్రుడు ఇచ్చిన సూచనమేరకు స్టాట్ కౌంటర్ను పెట్టి నాలుగు నెలలు అయ్యింది. అదే నిరాశ/చికాకుతో ఈ మద్య శెలవలు కూడా ప్రకటించుకున్నాను.

కానీ ఈ మద్య స్టాట్ కౌంటర్‌ను చూస్తున్నప్పుడు ఎవరెవరు, ఏ ఏ ప్రాంతాలనుండి చూస్తున్నారో అర్థం అయ్యింది. నచ్చినా నచ్చకపోయినా, అభిప్రాయాల్ని రాసినా రాయకపోయినా చూస్తున్నారన్న విషయం సుస్పష్టం. అందుకే నాకు నేనే కొత్త వుత్సాహాన్ని నింపుకొని నా పద్దతిలో ఎవరు చదివినా, ఎవరు చదవకపోయినా, ఎవరు తమ అభిప్రాయాల్ని తెల్పినా, తెలుపకపోయినా నా అనుకూలాన్ని బట్టి, నా ఆలోచనా సరళి బట్టి రాస్తూనే పోవాలని నిర్ణయించుకున్నాను.
---------
4119

Thursday, April 10, 2008

ఏది ప్రేమ అనే ప్రశ్న నన్ను నిరంతరం తొలుస్తూనే వుంటుంది.

ఏది ప్రేమ అనే ప్రశ్న నన్ను నిరంతరం తొలుస్తూనే వుంటుంది.
ప్రేమ శారీరక ఆకర్షణేనా??
ప్రేమ దేహం స్పందించే కణాల ఉపసమనం కోసమేనా??
ప్రేమంటే ప్రేమికులేనా???
ప్రేమంటే స్త్రీ పురష శారీరక, లైంగికావసరాలకు తొలి అడుగా??
ప్రేమంటే పురుషాధిక్యమా??
ప్రేమంటే సెల్యులాయిడ్(సినిమా) తెరపై చూపించే రెండు గంటల ప్రదర్శనేనా??
ప్రేమంటే హత్యప్రయత్నాలు, యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలేనా ??
ఇవన్ని(స్త్రీ) అమ్మాయిలపైనేనా??
యువత ఏమి అర్థంచేసుకుంటుంది??
రాబోయే తరానికి ఏ సంస్కృతిని ఆదర్శంగా నిలుపుతున్నాం??
లక్ష్మి, అయేషా, మీనా కుమారి, అరుణ ఇలా ఎవరో ఒకరు బలి అవ్వడానికి ప్రేరేపిస్తున్న ప్రవృత్తిని ఎక్కడనుంచి పెంచి పోషిస్తున్నాము??
మృగాలుగా, ఉన్మాదులుగా మారుస్తున్న పరిస్తితుల ప్రభావాలేమిటి??
అప్పుడెప్పుడో సుడిగుండాలు అనే సినిమా వచ్చింది. అందులో పిల్లలు నేర ప్రవృత్తికి ఇంటిలోని, సమాజంలోనివారే కారణమౌతున్నారనే విశ్లేషణ జరిగింది. ఆ ప్రవృత్తి ఇప్పుడు కొత్తరూపం దాల్చింది, దాల్చుతూనే వుంది. ఇలా కొనసాగవలసిందేనా????
ప్రశ్నలు? ప్రశ్నలు?? ప్రశ్నలు??
మనసును చిన్నభిన్నంచేస్తున్నాయి.

Monday, March 24, 2008

అతలాకుతలం చేసింది

రెండు రోజుల వర్షం అతలాకుతలం చేసింది
చేతికొచ్చిన పంట తడిసి
రంగు రుచి ధర కొల్పోయింది
నాలలు నిండి వరదై పొంగింది
రైతు గుండెలో కన్నిరు పారింది

ప్రతీ సారీ

పర్యావరణ సమతుల్యాన్ని గుర్తుచేస్తుంది

Saturday, March 15, 2008

ఎప్పుడు శిరసు వంచుతాయి???

బహుశ
ఎనబయ్యో దశకంలో
విద్యకు దూరమైనవారి కోసం
దూరవిద్య ప్రారంభ మైనప్పుడు
సిటీకి దూరంగా భవనాలను నిర్మిస్తుంటే
కొండచరియల మధ్య నిలబడితే
పరిసరాలు ఎక్కలేని బండలై
నను వెక్కిరించేవి
ఇప్పుడు
చదునుచేసిన రహదారివెంట
పరుగెడుతున్న నా ఆశల రథాన్ని చూసి
అవే బండలు
తలవొంచి ప్రక్కకు తప్పుకుంటున్నాయి.

(చాలా కాలం తర్వాత దర్శించిన డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలము, హైదరాబాదు)

Friday, March 14, 2008

సం గతులు తగునా మీకిది ??

తగునా మీకిది?
తాజా వార్తలు
ఈ రోజు బి.జా.పా. బంద్‌కు పిలుపునిచ్చింది
రాజకీయాలలో ఇలాంటివి సాధరణమైనవే అయినా ప్రజల పరిస్థిని అర్థంచేసుకుంటున్నారా??

బంద్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియెట్ బోర్డు ఈ రోజును పరిక్షను వాయిదావేసింది.
డిగృఈ పరీక్షను వాయిదా వేసారు

ఎన్నోరోజులుగా పరీక్షలకు సిద్దపడుతున్న విద్యార్థి విద్యార్థుల్లో ఒకటే ఉత్కంఠ. దానితో తల్లితండ్రుల మనసుల్లోను అలజడి.
వత్తిడికిలోనయ్యే విద్యార్థులకు తీవ్రమైన మానసిక పరిణామాలకు గురయ్యే అవకాశంవుంది.
ఇలా విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని అలజడికి గురిచేయడం

రాజకీయ నాయకులారా
మీకిది తగునా ?????????????

Thursday, March 13, 2008

నేను - హైదరాబాదు - సిటీ బస్సులు

సం"గతులు"
నేను - హైదరాబాదు - సిటీ బస్సులు

నేను వుంటున్నది రామచంద్రపురము. ఇక్కడ బి.హెచ్.ఇ.ఎల్. బస్సుడిపోవుంది.
కోఠికి 218, 225, 222 (వయా హైటెక్ సిటీ)
సికింద్రాబాదుకు 226, 219 నడుస్తూ వుంటాయి.

సిటీలో అత్యంత ఆదాయ మార్గాలలో ఇవి ఒకటి.
సిటి బస్సులు మూడు రకాలుగా నడుపుతున్నారు
1. సమాన్యం (జెనరల్)
2. మెట్రో ఎక్స్‌ప్రెస్
3. మెట్రో లైనర్ (ఇప్పుడు డీలక్సు అని పిస్తున్నారు)
225డి దిల్‌సుక్ నగర్ పఠాన్‌చెరుల మద్య నడుస్తుంది
దానికి ఇవ్వబడిన సమయము 1 గం. 40ని.లు
కాని ఇప్పటి ట్రాఫిక్ రోడ్లు పరిస్తితుల దృష్ట్యా 2 గ. 40ని.లుగా నడుస్తున్నాయి.
అంతే కాకుండా మెట్రోలో ఎక్కువ చార్జి వసూలుచేస్తున్నప్పటికి సౌకర్యాలు మాత్రం రోజు రోజుకు అద్వాన్నంగా మారుతున్నాయి.
సీట్లు మరియు ఇతర సౌకర్యాలు నా మాత్రమైపోయాయి.
దీనికితోడు నగర రోడ్ల పరిస్తితులు ప్రయాణాన్ని నరక ప్రాయం చేస్తున్నాయి.

నేను హైదరాబదుకు వచ్చినప్పతినుంది ఇప్పటికి అనేక కొత్త మార్గాలు(రూట్స్)లలో బస్సులు నడుస్తునేవున్నయి
నగరం అభి వృద్ది అవుతుందని ఆనంద పడాలో లేక
సౌకర్యాలు ఇవ్వలేని రవాణా సంస్థ(ప్రభుత్వము) తలచుకొని బాధ పడాలో అర్థం కావటంలేదు
ఇంకో విషయం : ప్రస్తుత రోడ్ల విస్తరణ వల్ల బస్సు షేల్టర్లు లేని బస్సు స్టాపుల వల్ల ఇబ్బంది రోజూ ప్రాయాణిస్తున్నావారికి అనుభవమే.

సం "గతులు"

ఇందు ములముగా యావన్మందికి తెలియజేయునదేమనగా
జాన్ హైడ్ కనుమూరి పేరుతో బ్లాగుతున్న నేను
ఇకనుంచి
సం "గతులు"
బ్లాగ్నామముతో బ్లాగాబోతున్నాను
గమనించ గలరు