Showing posts with label బాల్యం. Show all posts
Showing posts with label బాల్యం. Show all posts

Saturday, September 17, 2011

గోదారి అనుబందం

బాల్యంలో ఈ పచ్చదనాన్ని
నాకెవరో నలుగు పెట్టారు
ఇప్పుడది
గుండెల్లోకి ఇంకింది

**

బాల్యానెవరో చెక్కారు
ఆ బడిలోనో ప్రక్కనున్న గూడిలోనో
ఇప్పుడది
జ్ఞానపు కొమ్మల్లో వూగుతుంది

****
 

ఈతలు నేర్పారెవరో
ఈ నీళ్ళలోనే
ఇప్పుడు
నగరాన్ని ఈదగలుగుతున్నా

**


(అంతర్వేదికి, గోదారికి, కొండవీటి సత్యవతి గారికి, సుజాత గారికి)

Tuesday, December 22, 2009

బాల్యం

 
Posted by Picasa


కొంచెం చిలిపిగా
కొంచెం ఆశక్తిగా
కొంచెం ఆకతాయిగా
కొంచెం ఆశ్చర్యంగా
కొంచెం అమాయకంగా
వెరసి బాల్యంగా