Showing posts with label జ్వాలాముఖి. Show all posts
Showing posts with label జ్వాలాముఖి. Show all posts

Wednesday, December 14, 2011

జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే



జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే.
అవి నేను అప్పుడప్పుడే కలంపట్టిన రోజులు. తెలుగుయూనివర్సిటీ ఎన్.టి.ఆర్. అడిటోరియంలో కవిసమ్మేళనం జరుగుతుంది.
వేదిక అధ్యక్షులుగా శ్రీమతి  నాయని కృష్ణకుమారి, శ్రీ ఉత్పల సత్యనారయణ, శ్రీ కె. శివారెడ్డి, ఎస్.వి. సత్యనారాయణ, శ్రీ జ్వాలాముఖి ఇంకొందరు వేదికమీదున్నారు. చాలామంది ప్రముఖ కవులు, కవయత్రులు కవితలు చదివారు. నాకు చివరలో అవకాశం దొరికింది. అప్పటికే కవిత్వం చదినవారు ఏవేవో సాకులతో వెళ్ళిపోవడంతో సభ పల్చబడింది, ముగింపుకొచ్చేసరికి నా కవిత్వానికి ఎవరు స్పందించలేదే అనే దిగులు నన్ను కమ్మింది. వరండాలోకి వచ్చాక అటుగా వస్తున్న ఆయన దగ్గరకు పిలిచి భుజంమీద చెయ్యివేసి పోయం బాగుంది. కొత్తగా రాస్తున్నట్టులేదు రాస్తూవుండు అని భుజం తట్టారు. ఆయనే శ్రీ జ్వాలాముఖి. అదే మొదటి పరిచయం. ఆ సంతోషాన్ని వివరించడానికి మాటలు లేవు నాదగ్గర.

నా కవిత్వంని ఆస్వాదించి నన్ను పరిచయం చేసుకున్నవారు బహు కొద్దిమంది అందులో ఈయన ప్రధముడు. తర్వాత చాలా సార్లు చాలా సభలలో కలిసాము. ఆయనలో నాకు ఒక అంశం నచ్చింది. అది ఏమిటంటే అనర్గళంగా మాట్లాడగలగడం. నేను చర్చిల్లో మాట్లాడే అవకాశలను ఇంత అనర్గళంగా మాట్లాడగలనా అని ఓ రోజు ప్రశ్నించుకున్నా. ఆ టెక్నిక్‌ను పట్టుకోవడానికి ఆయన సభలకు తప్పకుండా వెళ్ళే వాణ్ణి.
అయన  కవిత్వంనుండి, వ్యాసాలనుండి, ఆయన జ్ఞాన సంపదనుండి ఏమీ పొదానో తెలియదు గాని, అర్గళంగా మాట్లాడం వెనుక వున్న కృషి, సాధన గమనించాను.  చాలా కష్టమైన ప్రక్రియే అయినా సాధన చేసాను.
నేనెప్పుడన్నా ప్రసంగిచాల్సి వచ్చినప్పుడు జ్వాలముఖిని గొంతు ద్వారం దగ్గర వుంచుకుంటాను.

కవిత్వం ఏమిచ్చింది అనే ప్రశ్న తరచూ వినబడుతుంటుంది. నేను చెప్పగలను అనర్గళతవైపు నన్ను నేను మలచుకోవడానికి ఒక సాధనం(టూల్) దొరికిందని.
శ్రీ జ్వాలముఖిని తలచుకొనే ఈ రోజు చంద్రునికో నూలుపోగులా నా జ్ఞాపకం ఇలా మీ ముందు పరిచాను. ఆయన జీవన, జీవిత స్థితిగతులు ఎలా వున్నా  ఒక సూచికగా నాకు నిలిచిన ఆయన మూర్తిమత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను. 
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ఓదార్పు కలగాలని సదా ప్రార్థిస్తాను.  

Monday, December 13, 2010

జ్వాలముఖి - నేను - కొన్ని జ్ఞాపకాలు


సమయం త్వరిత గతిన పరుగెడుతుందని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొంత స్పూర్తిని పొందిన నేను నిన్ననో, మొన్ననో ఆయనని కలిసాను అనిపిస్తుంది. ఆయన ప్రసంగించే తీరు, అనర్గళత  ఆయనకు సాహిత్యంపై వున్న పట్టును చెప్పకనే చెబుతుంది.   

2003 సంవత్సరం  కవిత్వాన్ని రాస్తూ, తారసపడ్డవారికి వినిపిస్తూ కవిత్వ లోతుపాతుల్ని తెలుకుంటున్న సమయం. హైదరాబాదు తెలుగు యూనివర్సిటీ, ఆడిటోరియంలో ఉగాది కవిసమ్మేళనం జరిగింది. అందులో పాల్గొనాలని, నా కవిత చదవాలనే ఉత్సాహంతో  అందరికంటే ముందుగా చేరాను. ఆ కార్యక్రమానికి నాయని కృష్ణ కుమారి గారు అధ్యక్షత వహించారు, ఉత్పల సత్యనరాయణ గారు ప్రత్యేక అథిదిగా వేదికనలంకరించారు.

వేదికనలంకరించిన వారిలో జ్వాలాముఖి ఒకరు.    అవకాశం కల్పించాలని సభ నిర్వహిస్తున్నవారిని ముందుగానే పలుమార్లు కోరినప్పటికి ప్రముఖు   సభ ఆలస్యంగా ప్రారంభమై, ఎవరికి వారు పనివుందంటూ తమకవిత్వాన్ని చదివి వెళ్ళిపోతున్నారు.  జ్వాలాముఖి ముందస్తు ఎన్నికలపై కవిత చదివారు. చివరిగా కృష్ణకుమారి గారి విశ్లేషణ  పూర్తయ్యింది. ఎంతకీ అవకాశం రాకపోయేసరికి కొంచెం అసహనాన్ని సభికులమద్య  ప్రదర్శించే సరికి, ఎవరో కొద్దిగా చొరవతీసుకొని ముగ్గురికి సమయాన్ని ఇచ్చే ఏర్పాటు చేసారు. మొదటిసారి ఇలాంటి అవకాశం రావటం. భయం భయంగా, బెరుకు బెరుకుగానే "వసంతమా ఎప్పుడొచ్చావు నీవు" అనే కవిత చదివాను. ఎవరు ఎలా స్పందించారో కూడా తెలియలేదు. బయటకి వస్తున్నప్పుడు దగ్గరకు పిలిచి కొత్తగా రాస్తున్నట్లే లేదు. రాస్తూవుందు. బాగుంది కవిత అని భుజంపై చెయ్యివేసి మరీ అభినందించారు జ్వాలాముఖి. ఆ అభినందన నాకు చాలా స్పూర్తి నిచ్చింది.

తరువాత 2004లో విజయవాడలో, ఎక్స్ రే వారి ఆద్వర్యంలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. అప్పుడు కొంతమంది సీనియర్ కవులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కలిగింది. అందులో జ్వాలాముఖి ఒకరు.  కార్యక్రమం చివరలో నాకు ఇచ్చిన జ్ఞాపిక అనుకోకుండా ఆయన చేతులమీదుగానే తీసుకోవడం జరిగింది. అప్పుడే నేను రాసిన "హసీనా" దీర్ఘ కవితకు పరిచయ వాక్యాలు రాయమని వారిని కోరను. కొన్ని నెలలు గడిచినా ఆయన ఎందుకో రాయలేదు. చివరికి ఆయన మాటలు లేకుండానే ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఆయనతో నాలుగు మాటలు రాయించుకోవడం కోసమైనా కొంత రాయాలనిపించేది. ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది.  

ఆ తర్వాత చాలా సభల్లో కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా పలకరించేవారు నన్ను. ఆయన ప్రసంగించే తీరు నన్ను ప్రతిసారీ అబ్బురపరచేది.    క్రైస్తవ సమావేశాలలో నాకు మాట్లాడే అవకాశం కలిగినప్పుడు   ఆయన శైలి అనుకరించే ప్రయత్నం చేసాను. ఆ శైలి నన్ను ఇప్పటికీ ఉత్తేజపరుస్తూనే వుంటుంది.

నెలనెలా వెన్నెల (హైదరబాదు)లో ఆయన మగ్దూం గురించి పంచుకున్న విషయాలు సాహిత్యంపై నన్ను మరింత ఆశక్తిని కలిగే టట్లు చేసింది.

ఒకరోజు హైదరాబాదు సెంట్రల్ లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణ జరుగుతుంది. నేను కూర్చున్న వెనుకనే ఆయన కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత సాహిత్యప్రస్థానం  చేతికిచ్చి చూసావా అని అడిగారు. ఎందుకు అలా అన్నారా అని అనుకుంటూనే పేజీలు తిరగేస్తుంటే అయనే .. కవిత బాగుంది అన్నారు. ఆ సంచికలో నా కవిత వుండటమే కాకుండా ఆయన వ్యాసం తర్వాత వుండటం విశేషం. ఇప్పటికీ నమ్మలేనిదే అనిపిస్తుంది.

(డిశెంబరు 14న ఆయన వర్థంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు   )

Friday, January 9, 2009

వెంటాడుతున్న జ్ఞాపకాలనుండి...జ్వాలాముఖి

అది ఉగాది సాయత్రం(2003) పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణములోని ఎన్.టి.ఆర్. ఆడిటోరియంలో కవి సమ్మేళనం జరిగింది. అద్యక్షులుగా శ్రీమతి నాయని కృష్ణకుమారి, ప్రత్యేక అతిథిగా శ్రీ ఉత్పల సత్యనారాయణ ఆసీనులైన వేదికపై వేదిక శీమతి శరత్ జోత్సనా రాణి ఆహ్వాన పలుకులతో ప్రారంభమైన సభలో జ్వాలాముఖి, ఎస్వీ సత్యనారయణ, అందెశ్రీ, కె. ప్రభాకర్, ఒబ్బిని, శివారెడ్డి, శిఖామని, ఘంటసాల నిర్మల, ఇలా ప్రముఖులెందరో ఆ రోజు కవిత్వాన్ని చదివారు. ఇంకా కొందరి పేర్లు గుర్తుకు రావటంలేదు.
అప్పటికి నేను అప్పుడప్పుడే రాస్తున్నాను.
కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభమవటంవల్ల కార్యక్రమము ఎవరికి వారే ఆలస్యం అవుతుందంటూ త్వరపడసాగారు. చివరిగా ముగ్గిరికి అవకాశం ఇవ్వబడింది. అందులో నేను ఒకణ్ణి . ఇప్పుడిప్పుడే రాస్తున్నా నని నన్ను నేను పరిచయం చేసుకొని " వసంతమా ఎపుడొచ్చావు" అనే కవితను చదివాను.

వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??

అప్పటిదాకా భయపెట్టిన చలి
దుప్పటి దులిపి పారిపోతున్న వేళ
చికురాకుల వగరు తిన్న కోయిల
కుహు కుహు రాగాలాపన చేస్తున్న వేళ
చేదునింపుకున్న వేప తేనెలొలుకు పూలై విరబూస్తున్న వేళ
వచ్చిందంట వసంతం
దాని వర్ణన కవులకే సొంతం
అనుభూతి ఓ అనంతం

యంత్రాలవలె కదలికలతో వాహనాలరొదలలో
క్షణం కోసం అనుక్షణం పోరాడుతూ
కాలంవెనుక వడివడిగా పరిగెడుతున్న వేళలో
గ్లోబునంతా జేబులొ పెట్టాలని
సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ అంటూ
కొత్తవేళ్ళూనుతున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

వెండితెర తారల తళుకు బెళుకులతో
నెట్‌లోని బ్రౌసింగు రూములలో చాటింగులతో
పబ్‌లలో హంగుల పొంగులతో
హోరెత్తించే బీటులోని నోటులతో
నూతన విరామాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్న సమయయంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

సస్యశ్యమలమనిపించే సీమలో
కాలే కడుపుతో బక్కచిక్కిన రైతు
నీవు వస్తావని సిరులెన్నో తెస్తావని
ఎదురుచూస్తున్న సమయంలో
పుట్లునింపాలని పట్టెడాశతో
పుస్తెలనమ్మి ఎరువేస్తే
వరదొచ్చి పురుగొచ్చి కరువొచ్చి
వెన్నుపై వెన్ను విరిచిన వేళ
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

నిన్నెరిగిన వారు నీకై స్పందించినవారు
నిన్నాశ్వాదించిన వారు
నీతో నడవలేక నవతరంతో ఇమడలేక
మమతల కరువై వెతల బ్రతుకై
కాలం పొరలమాటున దాగిన జ్ఞాపకాలను
నెమరేసుకుంటున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

ఉన్నత విద్యా సాధనలో
సుదూరతీరాలకు నిచ్చనవేసే ఆరాటంలో
భాషా సౌదర్యాన్ని గాలికి వదిలేసి
సబ్జెక్టులతో సెట్తులకై కుస్తీ పడుతూ
నిరంతరం అవిశ్రాంతంగా పోటీపడే
తాపత్రయంలో నిమగ్నమైపోతుంటే
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

మానవత్వాలు మరచి
బంధాలు పొడి బారిపోతున్న వేళ
వలస బ్రతుకుల మధ్య మనిషి
వ్యాపార వస్తువైపోతూ
వర్గవర్గాలుగా విడివడిపోతున్న వేళలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
----
ఎవరికి వారే త్వరగా వెళ్లిపోవాలనే ఆత్రంలో ఎవరు విన్నారో అని నాకు కొచెం అనుమానంగానే వుంది మనసులో. సభ అయ్యి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరో నన్ను పిలిచారు ఆశ్చర్యానికి లోనై వెనుతిరిగి చూసాను. తెల్లటి చొక్కా కుడి బుజంనుంచి వేల్లాడుతున్న చంచితో కంపించే జ్వాలముఖి. కొద్ది ఆగితే ఆయన నాలుగు అడుగులు వేసి నన్ను కలిసి భుజంపై చెయ్యివేసి హాట్స్ ఆఫ్ టు యువర్ పోయం అని భుజం తట్టారు. కొచెం ఆశ్చర్యం, కొచెం ఆనందం వుక్కిరిబిక్కిరిచేస్తుండగా కొత్తగా రాస్తున్నట్టులేదు, మంచి వరవడివుంది రాస్తూవుండు అని భుజం తట్తారు జ్వాలాముఖి. ఆయనిచ్చిన ఆ స్పూర్తితో నేనూ రాయగలను అనే నమ్మకం కుదిరింది. రాస్తూ పోయాను.
విజయవాడలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది అందులో పాల్గ్నటానికి రాష్ట్రం నలుమూలనుంచి వాచ్చిన కవులను కలుసుకోవటానికి నేను వెళ్లాను. అక్కడ చాలామందిని కలిసాను అప్పుడే నాకు స్ఫూర్తినిచ్చిన జ్వాలాముఖితో చాలా సమయం గడపటం జరిగింది. అప్పటికి నేను రాసిన "హసీనా" దీర్ఘ కవిత ముద్రించాలనే ప్రయత్నంలో వుండి జ్వాలాముఖిని ముందుమాట రాయమని కోరాను. బాగున్నదని అన్నారుకాని ఎందుకో పరిచయవాక్యలు రాయలేదు. ఆయన అభిప్రాయం లేకుండానే హసినా పుస్తకరూపం దాల్చింది.

జ్వాలముఖి ప్రసింగించే తీరు, అనర్ఘలం ఎంతైనా అనుకరించాలని మనసులో కోరికకలుగుతూనే వుంది ఇప్పటికీ.

ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణకు వెళ్ళాను. అక్కడ వెనుకగా వచ్చి భుజంతట్టి అభినందనలు తెలియచేసారు. ఎందుకని అడిగాను ఓ పుస్తకచేతికిచ్చి చూడమన్నారు. అది సాహిత్య ప్రస్థానం. అందులో ఆయన రాసిన వ్యాసంవుంది తర్వాత చదివిచెపుతాను అని చెప్పాను. అయితే నేను చూడమన్నది అది కాదు అని పేజీలు తిప్పమన్నారు. అందులో నేను రాసిన ఒక కవిత ముద్రింపబడింది. చాలా ఆశ్చర్యం.

Tuesday, December 16, 2008

జ్వాలాముఖి ఇక లేరు


ఎన్నడూ గర్వించాల్సిందీ లేదు
ఎన్నడూ కృంగి పోవలసిందీ లేదు
చదరంగం ఆట అయిపోయిన తర్వాత
రాజు, భటులు చేరేది ఒకే పెట్టెలోకే కదా!

ఆటలోని మెళకువలు, తీరుతెన్నులు మార్గదర్శకాలౌతూనే వుంటాయి