Showing posts with label బ్లాగ్విషయం. Show all posts
Showing posts with label బ్లాగ్విషయం. Show all posts

Monday, December 10, 2007

బ్లాగ్విషయం - స్నేహం - 8

బ్లాగ్విషయం - స్నేహం - 8
ఇంటర్మీడియట్ లో రాంగోపాల్ మిత్రుడయ్యాడు.తర్వాత ఒకే బెంచి, ఇళ్ళుకూడా ఒకే వైపు. కలిసివెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చే వాళ్ళం.సినిమాలకు కలిసివెళ్ళే వాళ్ళం. వాడికి ఎన్.టి. రామారావు అంటే ఇష్టం, నాకు కృష్ణ, కృష్ణంరాజు అంటే ఇష్టం.వాడు సాఖాహారి, నేను మాంసాహారి.ఇద్దరం కలసి సరదాగా బీరు, బ్రాందీ, విస్కీ రుచి చూసాం.మా సిగిరెట్తు బ్రాండు పనమా కింగు సైజుహైదరాబాదు వచ్చాక కూడా చాలా సార్లు కలిసాం కాని ఎవో అవాంతరాల మద్య గత పది సంవత్సరాలలో ఎవరు ఎక్కడవున్నామో తెలియదు.సరదాగా రుచిచూసిన సిగిరెట్టు, మద్యపానం వదిలించుకోవడనికి చాలా అవస్థలు పడ్డాను.వాడు ఇంకా సిగిరెట్లు నిరవధికంగా కలుస్తూనే వున్నాడు.

Saturday, December 8, 2007

బ్లాగ్విషయం - స్నేహం - 7


బహుస అది 1979 అనుకుంట. ఎవేవో ఆశలతో హైదరాబాదులో వుంటునప్పుడు మాతోపాటువుంటున్న కమల వాళ్ళ వూరినుంచి హైదరాబాదుచూడడానికి కొందరువచ్చారు. అందులో సుజాత, సునీత, రాధాకృష్ణ నా వయస్సువాళ్ళు కావటంవల్ల సన్నిహితం పెరిగింది. సిటీ చూడటానికి అందరం బయలుదేరాము. మూజియం, చార్మినార్, జూ, ఒకరోజు. గోల్కొండ, గండిపేట ఒకరోజు వెళ్ళాము. మొదటిరోజు పెరిగిన చనువుతో రెండవరోజు ఉత్సాహంగా బయలుదేరాము. సునీత అప్పటికే నాట్యనేర్చుకున్నది, అదీకాక అప్పటి హిందీ సినీనటి రంజిత పోలికలు వున్నాయని అందరూ అంటుండేవారు. గండిపేటలో చాలసేపు కేరింతలతో ఆడాము. తెచ్చుకున్నది తిని మద్యాహ్నము గోల్కొండచేరాము. పైకి ఎక్కి నీడ చూసుకొని కూర్చొని అంత్యాక్షరి మొదలు పెట్టము. ఒక ప్రక్కనేను మరోప్రక్క సునీత గట్టి పోటీ. పాటలతర్వాత డాన్సుచేయాలని అందరూకోరే సరికి ఒకొక్కరు మొదలుపెట్టారు. సునీత బాగా డాన్స్ చేసింది. అంతకంటే బాగా చేయాలని అత్యుత్సాహంతో నేను మొదలు పెట్టాను అంతే హటాత్తుగా సర్రుమని శబ్దం వచ్చింది. ఆ వుత్సాహంలో ఎవరు విన్నారో తెలియదుకాని నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. వెంటనే సదురుకుని ముభావంగా మారిపోయాను. సుజాత, సునీతలు ఎదో అనటంవల్లే ముభావంగా మారిపోయాను అనుకున్నారు. మరుసటిరోజు వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు, ఎదో వెలితి వెలితిగానే మన్సులో వుందిపోయింది. అలాంటిది ఏమిలేదని నేను చెప్పినా వాళ్ళు వినలేదు. తరువాతి వారంలో నన్ను రాజమండ్రి రమ్మని ఉత్తరం వచ్చింది. రాజమండ్రి వెళ్ళాను. సునీతకు డాక్టరుతో పెళ్ళికుదిరింది, చాలా సరదాగా రోజులు గడచిపోయినా గోల్కొండ రహస్యం అదే నేను హటాత్తుగా ముభావంగా మారిపోవటం రహస్యంగానే మిగిలిపోయింది.
ఆ రహస్యం ఎవ్వరికీ చెప్పలేదు కానీ మీకు చెపుతున్నా.
అప్పటిలో ఎవ్వరికీ చెప్పని రహస్యం డాన్సు చేస్తున్నప్పుడు బిగుతుగావున్న నా పాంటు చిరిగిపోయింది.
ఎప్పుడైనా గొల్కొండకు వెళ్ళినప్పుడు అదే గుర్తుకు వస్తుంది.

Saturday, December 1, 2007

బ్లాగ్విషయం స్నేహం - 6

బ్లాగ్విషయం స్నేహం - 6
నెట్టు స్నేహితులు


మద్యపానాన్ని మానడానికి చాలా ప్రయత్నాలు చెస్తున్న సమయంలో నెట్ చాటింగ్, మెయిల్స్ ద్వారా కొంతమంది పరిచయ మయ్యారు. వారిద్వారా చాలవిషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగింది. అందులో ఇద్దరు, ముగ్గురు వల్ల నేను కవిత్వాన్ని రాయడం మొదలు పెట్టాను. నేను కవిత్వానికి దగ్గరగా అవటం వెనుక వారిప్రోత్సాహం ఎంతైనా వుంది. వాళ్ళకు కృతజ్ఞతలు నా మొదటిపుస్తకంలొ చెప్పాను.ఒకరు ఇటలీనుంచి, ఒకరు హాంకాగ్ నుంచి, ఒకరు ఇంగ్లాండు నుంచి ఇంకా కొనసాగుతునేవున్నారు.

Tuesday, November 27, 2007

బ్లాగ్విషయం - స్నేహం5

నేను - నా కలం స్నేహితులు

ఉత్తరాలు రాయటం చాలా ఇష్టమైన ప్రక్రియ నాకు. అందులోంచి కలంస్నేహం చేయడం అలవాటయ్యింది. ఒక అద్భుత అజ్ఞాత స్నేహాన్ని మీముందుంచుతానికి చిన్న ప్రయత్నం. బహుశ ఇది 1979-1982 ల మద్య.
ఉద్యోగాలవేటలో హైదరాబాదు వస్తున్న కాలం. అలా వచ్చిన కొందరికి సంజీవరెడ్డి నగర్ లోని ఎ.రావుగారి ఇల్లు చిరునామా కేంద్రం. అక్కడికి మావూరు చుట్టుప్రక్కల లేదా కలిసిచదువుకున్న వారు అక్కడికి చేరేవాళ్ళం. శనివారం సాయంకాలం, ఆదివారం మద్యాహ్నం తరువాత అక్కడికి చేరటం అలవాటయ్యింది. అక్కడే కమల, లలిత, వాణి, రాణి పరిచయమయ్యారు.

నేను అప్పుడు ప్రసన్నకుమారి పేరుతో కలంస్నేహపు ఉత్తరాలు రాసేవాణ్ణి. ఆ విషయమే వారితో చెప్పాను. వాళ్ళుకూడా ఉత్సాహంగా వివరాలు తెలుసుకొనేవారు. అలా పరిచయాల్లో మద్రాసులో ఇంజనీరింగు చదువుతున్న హనీఫ్ అనే కుర్రాడితో ఉత్తరాలు దాదాపు రెండు సంవత్సరాలు నడిచాయి. నన్ను అమ్మాయి అనుకోవడం వల్ల ఉత్తరాల విషయంలో కమల, లలిత, వాణి, రాణి కొంచెం ఉత్సాహం చూపేవారు. వాళ్ళ సలహాలతో రాయటంవల్ల నేను అమ్మాయిని కాదే విషయం తెలియకుండానే రాయటం కుదిరింది.

రెండేళ్ళ తర్వాత అతని ఇంజనీరింగ్ పూర్తి అవుతుందని మద్రాసు విడిచి మళ్ళీ ఉద్యోగ వేటలో హైదరాబాదు వస్తున్ననని రాసాడు. అప్పటి వరకూ సలహాలిచ్చిన వాళ్ళు ఒకొక్కరుగా వారి జీవితాల్లో, ఉద్యోగాల్లొకి వెళ్ళిపోవటంవల్ల నేను అప్పటివరకూ దాచిన నిజాన్ని చెప్పేసాను. ఉత్తరాలద్వారా చాలానేర్చుకున్నానని, అయితే అమ్మాయి అని దాచటం ఇప్పుడు చెప్పడం బాధ కలిగించిందని రాసాడు. ఎప్పుడూ కనీసం రాసేది ఆడపిల్ల, మగపిల్లాడా అని అనుమానమే రాకుండా రాయటం ఆశ్చర్యానికి గురిచేసిందని రాసాడు. ఉత్తరాలంద్యలో కొన్ని ఫోటోలు కూడా పంపాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత నేను జబల్ పూర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు విజవాడకు చెందిన ఒకాతను నా రూములో కొన్నిరోజులు వున్నాడు. ఏదో సందర్బంలో నా అల్బం చూసి హనీఫ్ విజయవాడలో వున్నాడని చెప్పాడు. కాని మళ్ళీ ఉత్తరాలను రాయలేదు.

లలిత, రాణి, వాణి ఎక్కడున్నారొ కూడా తెలియదు. కమల దగ్గరలో ఉంటున్నా కలిసిన సందర్బాలే లేవు.
చిత్రమైన జ్ఞాపకం, అనుభవాలు, ఉత్తరాలు చాలాకాలం దాచాను కాని అద్దె ఇళ్ళతో కష్టమై ఎక్కడో జారిపొయాయి.

Monday, November 26, 2007

బ్లాగ్విషయం - స్నేహం4

బ్లాగ్విషయం - స్నేహం4



స్నేహితులు, మిత్రులు, సావాసగాళ్ళు, సహవాసగాళ్ళు, చెలులు ఇలా ఎలా పిలిచినా అనుబంధం శాశ్వతమేనా? జీవిత గమనంలో పెరిగేవయస్సు, అర్థిక సామాజిక స్థితిగతులు నిరంతరంగా కదిలిపోతున్నప్పుడు స్నేహం స్థిరమైనదేనా నా సందేహం?? మిగిలేది జ్ఞాపకాలు మాత్రమేనేమో!
బాల్యం, యవ్వనం, వయస్సు, ఉద్యోగాలు, వ్యాపారం ఇంకా ...... నిరంతరం ఎవరోవొకరు పరిచయమౌతూ, ఎవరోవొకరు విడిపోతుంటారు. "అవసరం కొత్తది సృష్టించడానికి తల్లిలాంటిది" అనేది ప్రస్తుతం స్నేహంలోకి చేరిపొయిందేమో? అరమరికలులేని మాటలు డబ్బు నేపద్యంలో తెరమరుగౌతూ కొత్త సంస్కృతికి తెరతీస్తూనే వున్నాయి. రైలు ప్రయాణంలాంటి జీవితంలో ప్రతి మజలీలో పరిచయమై సాన్నిహిత్యాన్ని పెంచుతూ తమతమ ప్రయాణం ముగియగానే దిగిపోయే ప్రయాణికుల్లా అంతర్థానమౌతారు. మళ్ళీ కలుస్తారోలేదో!
అవసరాలలో ఆదుకున్నవాడే అసలయిన స్నేహితుడు" అనే సూక్తి నిజమనిపిస్తున్నా, ఏది అవసరం? అనేది మళ్ళీ ప్రశ్నగానే మిగిలిపోతుంతుందేమో !
వర్గాలుగా విడిఫోతున్న వారు
బాల్యం
యవ్వనం
స్కూలు
కాలేజీలు
అక్కడక్కడ తారసపడేవారు
ప్రేరేపించేవారు
కలం
కులం
పరిసరాలలో కలిసుండేవారు
ఆఫీసు సహచరులు
కుటుంబ సన్నిహితులు
వ్యాపార సన్నిహితులు
సాహితీ వనాలు
బ్లాగులు
... ఇలా నిరంతరం లోనికివస్తూ బయటికిపోతూ జీవితంలో ఓ గొప్ప అనుభవాల్ని, అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని మిగిల్చిపోతారు.

అప్పుడప్పుడు
భర్తకు భార్య, భార్యకు భర్త స్నేహితుల పాత్రను పోషిస్తూవుంటారు.
బాల్యమొక్కటే గొప్ప స్నేహసమయం అనిపిస్తుంది నాకు.
నిరంతర క్రమానుగత పరిణామ చలనంలో విలువలు, నిర్వచనాలు, అవసరాలు మారుతూనే వుంటాయి.
స్నేహంకూడా !

Saturday, November 24, 2007

బ్లాగ్విషయం - స్నేహం3

బ్లాగ్విషయం - స్నేహం3

సత్యనారాయణ అని తాహసిల్దారుగా పనిచేసేవారు.

నా చిన్నప్పుడు నా ప్రక్క ఇంటిలో వుండేవారు.
కొంతకాలం తర్వాత ఏలూరు వచ్చాము ఆయనకూడా అక్కడికి వచ్చారు. అప్పటికి నేను 9వ తరగతిలో వున్నాను. అప్పుడప్పుడు కలిసేవాణ్ణి. నా దస్తూరీ బాగుంతుందని తన కొన్ని ప్రతులను నా చేత రాయించుకొనేవారు. మా పరిచయము 6 - 7 సంవత్సరాలు నడిచింది. కొన్ని వివాహ సందర్బాలలోను, వారి అమ్మాయి ప్రసవ సందర్భాలలోను నేను చూపించిన కొంచెం శ్రద్ద వారికి నచ్చాయి. వారి సాంగత్యంలో తాపీ ధర్మారావు పుస్తకాలు చదివాను, సాహిత్యం చదవటం అక్కడే ప్రారంభమయ్యిందని ఇప్పుడనిపిస్తుంది. ఆయనతో కూర్చొని మాట్లాడటం సమయం తెలిసేది కాదు. అది నేను చదువుమాని సమయం వృధా చేస్తున్నానని కొందరు అంటూ వుండే వారు. మా మద్య సినిమాలగురించి, సాహిత్యం గురించి తరచూ చర్చ జరిగేది. ఆ రోజుల్లోనే వచ్చిన "గోరంతదీపం" ఒక మంచిసినిమా ఎందుకు, ఎలా అని నేను చెప్పిన విశ్లేషణను చాలామందితో చెప్పి ఆనందించే వారు. (ఇప్పుడా విశ్లేషణ గుర్తు లేదండోయ్! ఇప్పుడు నేను సినిమాలు చూడటంలేదు) సినిమాల్లోకి నేను వెళితే రాణిస్తానని చెప్పేవారు. (నా కంటే చిన్నవాడయిన వాళ్ళ అబ్బాయి సినిమా హీరో అయ్యాడు. మేమిద్దరం ఒక సంవత్సరం ఒకే మాష్టరి దగ్గర లెక్కలకు ట్యూషనుకు వెళ్ళాము, అది వేరే సంగతి)

వాళ్ళా అమ్మాయి నాకు 6వ తరగతి నుండి సమాంతరంగా చదివాము. అమ్మాయి పెళ్ళి ఒక వెటర్నరీ డాక్టరుతో రిజిష్టరు ఆఫీసులో ఏ ఆడంబరాలు లేకుండా జరిగింది. డాక్టరుతో కొంతకాలం పరిచయం, సంబాషణలు నాలో కొన్ని ఆదర్శాలవైపు బీజాలు నాటాయనిపిస్తుందిప్పుడు.
నేను పెళ్ళిచేసుకొన్న కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఏలూరులో ఒక పెళ్ళిలో కలిసాము. నా కుటుంబాన్ని పరిచయంఛేసాను చాలా సంతోషించారు. బహుశ అడే చివరిసారి చూడటం.
కుటుంబ విషయాలు మరి కొన్న్ని పరిస్థితులవల్ల వారితో పరిచయం తెగిపోయింది. చివరికి వారిని ఆఖరిగా కూడా చూడలేకపోయాను. వారి కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడూ కలవలేకపోయాను.

ఇప్పటి నా వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలకు నాకు తెలియకుండానే పునాదివేసిన నా స్నేహితుడయాన.

Friday, November 23, 2007

బ్లాగ్విషయం - స్నేహం2

బహుశ 1984 అనుకుంటాను
స్నేహితుల వల్ల రెండు రాత్రులు, రెండు పగళ్ళు పోలీసు స్టేషనులో వున్నాను.కొంతకాలం కలిసితిరిగాం, కలిసి సినిమాలు చూసాం, కలిసి పార్టీలు చేసుకున్నాం, ప్రేమ పెళ్ళిళ్ళు చేసాం, విడిపోయాం మళ్ళీ కలిసిన జ్ఞాపకాలు లేవు. వీరిని స్నేహితులు అనాలా, మిత్రులు అనాలా? సందేహం. కాని అనుభవాలు మిగిలిపోయాయి.
ఒక సెంటరులో సైకిలు రెపేరు షాపు రాజు, టీ బడ్డీ సుందర్రావు, మంగలి షాపు విష్ణు, ఉండేవాళ్ళు.అక్కడికి చాలామందిమి చేరి టైము పాస్ చేసే వాళ్ళము. జార్జి అనే వాడి తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాళ్ల కాలేజీలో గొడవలతో కొట్టుకున్నారు, అది జార్జికి తెలిసి వాళ్ళను కొట్టివచ్చాడు. వాళ్ళు ఓక గ్రూపుగా ఏర్పడి మళ్ళీ జార్జిని, వాడి తమ్ముణ్ణి కొట్టాలని బయలుదేరారు. కొచెం చీకటిగా వున్న మలుపులో గుంపుగా తూముపై కూర్చొన్నరు. ఇంతలో అటుగా పోతున్న సి. ఐ. చూసి అనుమానం వచ్చి వారిని సోదా చేస్తే వారిదగ్గర రెండు సైకిలు చైనులు, ఒక చిన్న కత్తి, చినన్న ఇనుపరాడ్ దొరికాయి. వెంటనే వాళ్ళను జీపులో ఎక్కించి స్టేషనుకు తీసుకు వెళ్ళాడు. వాళ్ళలో అందరూ ఉన్నత ఉద్యోగుల పిల్లలే వున్నారు.గొడవతెలుసుకున్న సి.ఐ. జార్జిని పిలిపించి లోపల వుంచారు. మీ బాచ్ ఎవరు అని జార్జి నిలదీసే సరికి కొతమంది పేర్లు చెప్పాడు. ఈ గొడవతో నాకు సంబందం లేకపోయినా అప్పుడప్పుడూ కలిసి తిరగటంవల్ల నాపేరుకూడా అందులో వచ్చి, నన్నుకూడా స్టేషనుకు తీసుకు వెళ్ళారు. అందరిని ప్రశ్నించి, ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఒకరోజు గడిచిపోయింది. కేసు రాసి మరసటిరోజు ఆదివారం కావటం వల్ల మరింత ఆలస్యమయ్యింది. నాకు తెలిసిన ఒక ఆయన ఆదివారం సాయంకాలం ష్టేషనుకు ఎందుకో పనిమీద వచ్చాడు నన్ను చూసి జరిగింది తెలుసుకొని, సి.ఐ.తో మాట్లాడి నన్ను తీసుకు వెళ్ళాడు.
అలా నాకు సంబందంలేని దానిలో ఇరుక్కున్నాను.
ఆ రెండు రోజుల పోలీసు స్టేషను అనుభవం వివరించలేనిది.

Wednesday, November 21, 2007

బ్లాగ్విషయం - స్నేహం-1

బ్లాగ్విషయం - స్నేహం

ఇందులోనుండి నేను నా స్నేహితులు అని కొన్ని జ్ఞాపకాలను రాస్తున్నాను.

ఎలిమెంటరీ స్కూలు మిత్రులు ఎవ్వరూ గుర్తు రావడంలేదుబహుశ 1వ తరగతిలో(1965) అనుకుంట బిక్కి(అసలు పేరు గుర్తురావటంలేదు) అనే అమ్మాయి ఉండేది. 7వ తరగతి తర్వాత ఆ అమ్మాయిని చూసిన గుర్తు కూడా లేదు.
6వ తరగతిలో అనుకుంటా హనుమతరావు పరిచయం అయ్యాడు ఒకే కాలనీ కావటం వల్ల. 7వ తరగతిలో వెంకటెశ్వరరావు నేను ఒకే బల్లపై కూర్చోవడవంవల్ల స్నేహం ఎక్కువ అయ్యింది. హనుమంతరావుకు అది కోపం వచ్చి స్నేహితుల్ని జట్టుగా ఛెసుకొని కొట్టుకునేదాకా వచ్చింది. అది ఇంట్లో పెద్దవాల్లకు తెలిసి(1971) 7వ తరగతిమొట్టమొదటి పబ్లిక్ పరీక్ష దృష్టితో చదువుమీద పెద్దలనిఘా పెరిగింది. దానితో స్నేహం కంటే చదుపై శ్రద్ద ఎక్కువయ్యింది. తర్వాత వెంకటెశ్వరరావు వాళ్ళ వూరికి(అమరావతి) వెళ్ళి పోవటం, 8వ తరగతిలో నేను హనుమంతరావు ఒకే తరగతి సెక్షను కావటంతో మళ్ళీ స్నేహం మొదలయ్యింది. (1972) జై ఆంద్ర గొడవలతో స్నేహితులూ లేరు, చదువూలేకుండా సవత్సరం గడచిపోయింది. ఐతే ఈ కాలంలో రామచంద్ర, ఇంకొకడు(పేరు గుర్తులేదు) లైబ్రేరీ పేరుతో డిటెక్ టివ్ నవలలు చదవటం, నాటకాలు రిహార్సిల్సు అంటూ తిరగటం, బషాతొ కల్సి బొమ్మలజూదం అలవాటయ్యింది.
లాభంలేదని ఆవూరునుండి ఏలూరుకు అందులోనో బాలుర ప్రతేక స్కూలులో 9వ తరగతికి చేర్చారు. హనుమంతరావుకూడా అనుకో కుండా అక్కడచేరాడు.కొన్నిరోజులు బుద్దిగానే వున్నాము. ఓరోజు "రాధమ్మపెళ్ళి" సినిమాకు మద్యాహ్న స్కూలు ఎగ్గొట్టి వెళ్ళాము. అది మా తరగతి మాష్టారుకు తెలిసి పెద్దలను పిలిపించి, తిట్టి మాయిద్దరిమద్య నిఘా నియమించారు. మళ్ళీ మేము 10వ తరగతి అయ్యే వరకూ మాట్లాడుకోలేదు.