నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు.
గత సంవత్సరం మార్చి నెలలో గుండె ఆపరేషన్ అయ్యింది. మళ్ళీ తొమ్మిదినెలల తర్వాత పిరియాడికల్ చెకింగ్స్ కోసం వెళ్ళినప్పుడు, మరో చోటులో బ్లాకు వుందని దాని నిర్దారణకు ఆండియోగ్రాం చెయ్యాలని అన్నారు. ఆండియోగ్రాం పట్టుమని పదినిముషాలు కూడా వుండదు, కానీ దానికోసం సిద్దంచేయడం, అయిన తర్వాత వచ్చే నీరసం, ఒడిదుడుకులను దృష్టిలోపెట్టుకొని దాదాపు ఓ 24 గంటలు పట్టవచ్చు. అయితే రాత్రి పగలు లెక్కలు, డక్టర్ల అందుబాటులు, శరీర పరిస్థితిని బట్టి ఆ 24 గంటలు రెండురోజులగా మారవచ్చు.(సగం ఒకరోజు, సగం ఒకరోజు రావటంవల్ల). అలా డిశెంబరు 27, 2001న రెండురోజుల ప్రణాళికతో ఆసుపత్రిలో చేరాను. అయితే పరీక్ష జరుగుతున్న సమయంలో దగ్గురావట దానితో తలెత్తిన సమస్యల కారణంగా ఊపిరితిత్తులలోనికి నీరు చేరటం అది కాస్తా విషమించడంతో అత్యవసర వార్డుకు తరలించారు. గుండె పరిస్థి మరియు ఊపిరితిత్తుల పరిథితులతో అందులో రెండురోజులు, మెడికల్ వార్డులో నాలుగురోజులు వెరసి 9 రోజుల పాటు ఆసుపత్రిలోనే వుండవలసి వచ్చింది. ఇంటికి వచ్చక మూడు వారాలపాటు పూర్తిగా మంచం మీదనే విశ్రాంతి. శరీరం కోలుకున్న తర్వాత స్టంటు వేయాలని కార్డియాలజీ డాక్టరు సూచన. ఇంతకుమును శత్రచికిత్స చేసిన సర్జను మరో కొన్ని స్కానింగులు సూచించి వాటి ఆధారంగా స్టంటు అవసరంలేదని మందులు వాడితే సరిపోతుందని నిర్దారించారు.
డిశెంబరు 20, 2011 ప్రథమిక పరీక్షలనుంచి(ఇ.సి.జి.) ప్రారంభమైన ఉత్కంఠకు ఫిబ్రవరి 1, 2012న తెరపడింది. 42 రోజుల ప్రయాణం చాలా విషయాలు, అనుభవాలు, అనుభూతులు, రకరకాల సలహాలు, ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు. నా ప్రక్కటెముక సపర్యలు, తాను నలిగిన వత్తిడి, పిల్లలు సహకారాలు ఇవన్ని కలిపి నన్ను త్వరగా కోలుకునేటట్టు చేసాయి.
నిద్రపట్టని సమయాలలో ఎవేవో రాయాలని అనిపించేవి. అలాచేయటానికి అనుమతించనందువల్ల ఒక్క వాక్యాన్ని కూడా రాయలేకపోయాను.
చాలా జాగ్రత్తతోనూ, ఆరోగ్య నియమాలు పాటిస్తున్నా మళ్ళీ ఎందుకని ఇలా జరిగింది అనేది బోధపడటంలేదు.
ఏది ఏమైనా దేవుడు నాయెడాల అద్భుతము చేసాడన్నది నిజం.
జాన్ హైడ్ కనుమూరి