Showing posts with label గురువులను తలచుకోవడం భాగ్యమే. Show all posts
Showing posts with label గురువులను తలచుకోవడం భాగ్యమే. Show all posts

Saturday, October 19, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - శ్రీ రావూరి భరద్వాజ

మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా
టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి.
పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?
నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు తిరిగి ప్రయానిద్దాం ఇప్పుడు.
నేను అనుపమ ప్రింటర్స్‌లో(1986-88మధ్య)   కంపోజిటరుగా పనిచేస్తున్న రోజులు.   కాంతమ్మ జ్ఞాపకాలతో డైరీ అనుకుంట కంపోజింగు చేస్తున్నాము. అక్కడ ఇద్దరం పనిచేసేవారం. నేను లైన్లు మాత్రం కంపోజింగు చెయ్యాలి, పేజీసెట్టింగు, ప్రింటింగు మిషనుకు అనువుగా కావలసినవన్ని వేరే అతను చూసుకొనేవాడు.  సాయత్రం ఒక పెద్దాయన వచ్చి మేము చేసినవాటి ప్రూఫ్‌లను చూసి తప్పు ఒప్పులను చూసి వెళ్ళేవారు. మొదట్లో పెద్ద ఆశక్తి ఏమీ అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన మాటలకు చెవిపెట్టడం అలవాటయ్యింది. మొదట ఆయన గురించి తెలియదు, ఓ రోజు ఓపెన్ యూనివర్సిటీ గురించిన ప్రస్తావనలో, ఆయన రేడియోస్టేషనులోఉన్నప్పుడు విన్న వార్తకు స్పందిస్తూ, అప్పుడే పొందిన పారితోషికాన్ని మంత్రిగారికి పంపడం తదనంతర ప్రక్రియలవల్ల ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావం గురించి చెప్పారు. ఆ మాటలు నన్ను అబ్బురపరచాయి. అప్పుడు నేనూ ఇందులో చదవొచ్చుకదా అనే ఉత్సాహం కలిగింది. కొంతకాలంగా వదిలేసిన విద్యను మల్లీ కొనసాగించడానికి వీలు కలిగింది. తర్వాతికాలంలో నా వృత్తిని మార్చుకోవడానికి ఆసరా అయ్యింది
ఆయనే శ్రీ రావూరి భరద్వాజ

ఎందువల్లనో ఆయన్ని మళ్ళీ కలవలేకపోయాను
కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టాక 2003లో నా మొదటిపుస్తకం "హృదయాంజలి"  ఎదో సాహిత్యకార్యక్రమంలో కలిసినప్పుడు ఇవ్వడం జరిగింది. తరువాత ఓ రోజు ఫోనుచేసి అభినందించారు. అడపా దడపా  ఆయన్ని ఎదో కార్యక్రమంలో కలిసినా ఎందుకో నేనుగా ఆయన్ని కలవలేకపోయాను అనే బాధ కలుగుతుంది.
చాలాసార్లు కలవాలి  అనుకోవడం అది ఎదో కారణాలతో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం ఎందుకో అర్థంకాని విషయం.  ఆ వెలితి అలానే ఉండిపోతుంది.  

ఆయన ఇప్పుడు తన కాంతమ్మను కలవడానికి వెళ్ళాడు.  తను నడిన దారివెంబడి కొన్ని విత్తనాలను చల్లిపోయాడు. మొలకలెత్తిన విత్తనం చెట్టై ఎవరోఒకరికి నీడనిస్తుంది 

Tuesday, September 10, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 3


గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం 

కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు సర్టిఫికేట్టు వుంటే ఐ.టి.ఐ. పరీక్ష రాయవొచ్చని. అందుకోసం జేవియర్స్ ఐ.టి.ఐ. వర్కు షాపులో బీరువాలు తయారీలో నానీ అనే ఒకాయ వుండేవారు ఆయన దగ్గర పనికి చేరాను. నాతోపాటు మరో ఇద్దరు ఆయన చేతిక్రింద పనిచేసేవారు. అప్పటివరకు ఆఫీసు పనులు చేసిన నేను ఆ పని కష్టమనిపించేది. బీరువా కోసం షీట్ ను  ముందుగా తగిన కొలతలతో చుక్కలు పెట్టుకొని వాటి ప్రకారం వులితో కట్ చెయ్యడం, అవసరమైన వంపులు కొన్ని మిషను సహాయంతో మరికొన్ని సుత్తిని వుపయోగిస్తూ చాకచక్యంగా వంచడం కత్తిమీద సాములా అనిపించేది. మొదటి వారంలో సుత్తెదెబ్బవేయడంలో మెళకువలు తెలియక  వేళ్ళు నలగ్గొట్టుకున్న సందర్భాలు వున్నాయి. షీట్‌ను డిజైన్ చెయ్యడం అనేది అన్నిటిలో కీలకమైన పని. దాన్ని సులువుగా నేర్చుకున్నానని ఆయన నా స్నేహితులతో అనడం తటస్థించింది. డ్రిల్లింగు, రివిటింగు, షీట్‌లో చొట్టలను కనిపెట్టి సరిచెయ్యడం, విదివిడిగా బెండింగు చేసుకున్న వాటిని ఒక్కచోట చేర్చి రివిటింగు చేసి, తలుపులు అమర్చడం, తలుపులకు, లోపలి అరలకు తాళాలు తయారు చేసుకుని బిగించడం. చివరిగా కొలతలను చూసుకొని   టింకరింగు   ఛేయించడం.  

తర్వాతి సంగతి పెయింటరు చూసుకునేవాడు. చలా కాలం పెయింటింగు సెక్షనుకు నేను వెళ్ళలేదు. ఒకరోజు వెళితో అంతకుముందు రోజు మేము పూర్తిచేసిన బీరువాకు గ్రీన్‌మెటాలిక్ రంగు వేస్తున్నారు. వావ్... మేమేనా చేసింది ఈ బీరువాను అనిపించింది.
 
నేను రాయలనున్న ఐ.టి.ఐ. పరీష కాస్థ అప్పటికే 25 దాటిన వయస్సువల్ల అవకాశం పోయింది. దానితో అక్కడ పనిచేయడంలో ఉత్సాహం ఎక్కువరోజులు మిగలలేదు.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ సంవత్సరం నానీ మేస్త్రీ (ఆయన్ని అలానే పిలిచేవారు, ఆయన అసలుపేరు తెలియదు) వినకచవితి పూజను మొత్తం నాచేత చేయించారు. అంతకుముందే కొన్ని సందర్భాలలో నేను పంచె, లాల్చీ ధరించేవాణ్ణి. అది తెలిసిన ఆయన నా చేత పంచె కట్టించి, తను కూడా పంచె కట్టుకుని పూజా విధానం పుస్తకం తెప్పించి ఆరోజు పూజను నాచేత చేయించారు. పూజ తర్వాత లేవబోతుంటే వాళ్ళ ఆవిడ ప్రక్కన ఇళ్ళలోని వారిని పిలిచి కూర్చోబెట్టి కథను చదవమన్నారు. పంచే కూర్చుంటానికి అనుకూలమైనా, ఆ వయసులో అంతసేపు కూర్చోవడం గొప్ప విషయమే.  ఎలాగో కథ పూర్తి చేసాను. నేను అంతకుముందు తెలియని కొందరు ఆడవాళ్ళు కుర్రపంతులు గారు కథ బాగా చదువుతున్నారు, మాయింటిలోనూ కథ చెప్పించుకుంటాము వస్తాడంటారా! ఎంత తీసుకుంటారు అని అడగటం నా చెవిన పడనే పడింది. :) 
 
అప్పటికి గురువు (నానీ మేస్త్రీ) ఏదో తాంబూల ఇచ్చారు అది గుర్తు లేదు కానీ, చాలా కాలం తర్వాత చవితి నాటి కథను బాగ వినిపించావయ్యా! అని మెచ్చుకోవడం గుర్తుంది.
 
అప్పుడు పూజను మనస్సుపూర్తిగా చేసానో, పైపైనే చేసానో గానీ, వినాయకచవితి పూజలో కూర్చోవడం అదే తొలి మరియు తుది. 

తర్వాతి కాలంలో హైదరాబాదు వచ్చేయడంతో  మళ్ళీ ఆయన్ను కలవలేదు. కలవాలనే ప్రయత్నంచేసినప్పుడు ఆయన ఇక లేరు అనే విషయం తెలిసింది.  

 

Sunday, September 8, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 2

1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్ 
Chunduri Srinivasa Gupta   
ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం

ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. అందుకే అన్నీ గ్రూపులను (ఎం.పి.సి., బై.పిసి., సి.యిసి., ఎం.ఇ.సి., హెచ్.ఇ.సి.) ఒక్కచోట ఆరుబయట మైదానంలో కూర్చోబెట్టి, మైకు పెట్టి పొయెట్రీ పాటాలు చెప్పేవారు. ఈయన నాన్నకు స్నేహితులు అవ్వడంవల్లనే ఇక్కడ నన్ను చేర్పించారని రెండు సంవత్సరాలు పూర్తయ్యాక తెలిసింది. మా కాలేజి ప్రక్కనే రెవెన్యూ ఆఫీసుల సమూహం ( తాలూకాఫీసు, ట్రజరీ, తాలూకా కోర్టు ఇంకా కొన్ని.) వుండేవి.  ఇద్దరు ఎప్పుడైనా కల్సే సందర్భం ఏర్పడినప్పుడు ఇంగ్లీషు సాహిత్యం గురించే మాట్లాడుకునేవారంట. 

నాకు తెలియకుండానే నన్ను కవిత్వంవైపు నడిపించారని ఇన్నేళ్ళ తర్వాత ఇలా గుర్తుచేసుకోవడంలో బయటపడింది.
ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు
1. బ్రూక్ -
THE BROOK
by: Alfred Tennyson (1809-1892)
COME from haunts of coot and hern,
I make a sudden sally,
And sparkle out among the fern,
To bicker down a valley.
 
By thirty hills I hurry down,
Or slip between the ridges,
By twenty thorps, a little town,
And half a hundred bridges.
 
Till last by Philip's farm I flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I chatter over stony ways,
In little sharps and trebles,
I bubble into eddying bays,
I babble on the pebbles.
 
With many a curve my banks I fret
by many a field and fallow,
And many a fairy foreland set
With willow-weed and mallow.
 
I chatter, chatter, as I flow
To join the brimming river,
For men may comeand men may go,
But I go on forever.
 
I wind about, and in and out,
with here a blossom sailing,
And here and there a lusty trout,
And here and there a grayling,
 
And here and there a foamy flake
Upon me, as I travel
With many a silver water-break
Above the golden gravel,
 
And draw them all along, and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I steal by lawns and grassy plots,
I slide by hazel covers;
I move the sweet forget-me-nots
That grow for happy lovers.
 
I slip, I slide, I gloom, I glance,
Among my skimming swallows;
I make the netted sunbeam dance
Against my sandy shallows.
 
I murmur under moon and stars
In brambly wildernesses;
I linger by my shingly bars;
I loiter round my cresses;
 
And out again I curve and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever
ఈ పాఠం గుర్తు రాగానే గోదావరి నది మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ పాఠం విన్నరోజుల్లోనే కోస్తా /కోనసీమ ఏరియాలో ఒకపెళ్ళికి వెళ్ళాడం, ఒక గ్రామంనుండి అమలాపురంవరకు కొంతమంది పడవలో వెళ్ళాము.  ఆనుభవమే గుర్తుకొస్తుంది. తర్వాతి రోజుల్లో గోదావరి, మరికొన్ని నదుల పుట్టుక ప్రదేశాలను సందర్శించినప్పుడు నాకు ఈ బ్రూక్ పాఠం, జనార్దన్ రావు గారు చెబుతున్న స్వరం వినబడుతుంది.


2. సోలిటరీ రీపర్ -
The Solitary Reaper -William Wordsworth

Behold her, single in the field,
Yon solitary Highland Lass!
Reaping and singing by herself;
Stop here, or gently pass!
Alone she cuts and binds the grain,
And sings a melancholy strain;
O listen! for the Vale profound
Is overflowing with the sound.

No Nightingale did ever chaunt
More welcome notes to weary bands
Of travellers in some shady haunt,
Among Arabian sands:
A voice so thrilling ne'er was heard
In spring-time from the Cuckoo-bird,
Breaking the silence of the seas
Among the farthest Hebrides.

Will no one tell me what she sings?--
Perhaps the plaintive numbers flow
For old, unhappy, far-off things,
And battles long ago:
Or is it some more humble lay,
Familiar matter of to-day?
Some natural sorrow, loss, or pain,
That has been, and may be again?

Whate'er the theme, the Maiden sang
As if her song could have no ending;
I saw her singing at her work,
And o'er the sickle bending;--
I listened, motionless and still;
And, as I mounted up the hill,
The music in my heart I bore,
Long after it was heard no more.


 ఈ పాఠం చెబుతున్నప్పుడు ప్రకృతిని గురించి, పని పాటలు సంస్కృతిలో భాగం. జానపథాన్ని వివరిస్తూ, బహుశ ఆమె "ఎన్నియెల్లో, ఎన్నియ్యాల్లో హుయ్ ..."   అని పాడిందేమోనని అప్పటికి కొద్దిరోజులముందే విడుదలయ్యిన భక్తకన్నప్ప సినిమాలోని పాట :
సాహిత్యం: ఆరుద్ర , గానం: రామకృష్ణ, పి.సుశీల

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా

దక్కించుకోరా .. దక్కించుకోరా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా

మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా

ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా

కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని

దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
...............................................................పాటను డాన్సు చేస్తూ మరీ చెప్పారు.
పాఠంలోని పదాలు, పాదాలు అలాగే గుర్తులేదుగాని ఆయన చెప్పిన తీరు మాత్రం బాగా గుర్తుండిపోయింది.

3. అ సీన్ ఫ్రం   జూలియెస్ సీజర్
అంథోనీ స్పీచ్‌లోని ద్వైదీభావాన్ని,  దానిలోని హావ భావాలను నటించి, అభినయించిన వివరించిన తీరు ఇంకా కళ్ళముందు మెదులుతూనేవుంది   నారికేళ పాకమని చెప్పబడే షేక్‌స్పియర్‌ను   చదవడం సులువనిపించింది.  అప్పుడు చదవలేకపోయినా  గానీ తర్వాతి కాలంలో చదవడానికి గురువుగారు ఉపకరించారు అని చెప్పాలి.

*** గురువుగారు జనార్దన రావు గారు ఎక్కడవున్నా వారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.

Friday, September 6, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే


గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు.

9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, బెర్నడ్ షా గురించో చెబుతుండేవారు. అలాంటి సమయంలో నేను లెక్కల పుస్తకాల్లోకి దూరేవాణ్ణి. ఆయనకు లెక్కలంటే భయం అదీ సంగతి.   అయితే ఇప్పుడర్థమవ్వుతుంది నాకు పరోక్షంగా కవిత్వంపై మక్కువ నాన్న కల్పించారని.

గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు  చేసుకోవాలి.
శ్రీ సైమన్ - తెలుగు
శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు
శ్రీ జార్జి - లెక్కలు ... మాష్టార్లు. (జేవియర్స్ హైస్కూలు, ఏలూరు) వారు నేర్పినవే నాల్గక్షరాలు నాల్కలపై ఇంకా నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అదేమి చిత్రమోగాని 10వ తరగతిలో  తెలుగుమాష్టారు ఎప్పుడూ కోపంగావుండేవారు.  పాఠాలుకూడా చాలా సీరియెస్‌గా   చెప్పడంవల్ల తెలుగంటే భయపట్టుకుంది. ఆ భయం కాస్తా ఇంటర్మీడియేట్‌లో హిందీ చదివేటట్టుచేసింది. హిందీ చెప్పిన మేడం పేరు  గుర్తులేకపోవడమే నాకు ఎప్పటికీ అర్థంకాని విషయం.  కానీ ఇన్నేళ్ళతర్వాత కూడా ఆమె చెప్పిన హిందీ సాహిత్యం గుర్తుకొస్తుంది. అలా పరోక్షంగా ఇప్పటి నా సాహిత్యాభిరుచికి ఆమె పునాదివేసింది అనిపిస్తుందిప్పుడు.

ఆమె పేరు శ్రీమతి వరలక్ష్మి (అప్పటికి ఇంకా శ్రీమతి కాలేదని గుర్తు) అని ఇప్పుడే ఆన్‌లైన్లోకివచ్చిన మిత్రుడు చెప్పాడు.
దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు  ఇప్పుడే  తరగతి గదిలో  వున్నట్టే అనిపిస్తుంది నాకు.
నవల ఒకటి నాండిటేల్ వుండేది  నవలపేరు గుర్తులేదు కాని నవలలోని ముఖ్యఘట్టాలు ఇంకా గుర్తున్నాయి. 
హిందీ క్లాసుకు కొసమెరుపు ఏమిటంటే వరలక్ష్మి గారు అందంగా వుండటమే కాకుండా మధురంగా పాఠం చెప్పడం, అన్ని గ్రూపులలో వున్న విద్యార్ధిని , విద్యార్థులు ఒక్కచోటకు చేరటం. అంతే కాక మగపిల్లకంటే, అమ్మయిలే ఎక్కువగా వుండటంవల్ల క్లాసు అందంగాను, రంగురంగులగాను వుండటంవల్ల ఒక్క క్లాసుకూడా మిస్సు కాలేదని గుర్తు.  
తర్వాత కాలంలో డిగ్రీలో పెద్దగా ప్రభావితంచేసినవాళ్ళు లేకపోవడంవల్ల ఎవ్వరూ గుర్తు  లేరు.
* * *

కవిత్వాన్ని ఆశ్రయంగా పొందాక మొదటి గురువు శ్రీ సి.వి. కృష్ణారావు  గారు.

మొదట పరిచయం అయినప్పుడు "నెలనెలా వెన్నెలకు" వస్తూవస్తూ ఓ రెండు కవితలు పట్టుకు రావడం మరిచిపోకండి అని పోనుచేసి చెప్పేవారు. నెలంతా రెండు కవితలు రాయాలి అనే అలోచన మనసులో కదులుతూ వుండటంవల్ల కొన్ని సార్లు నెలంతటిలో ఒక్కటీ రాయలేకపోవడం, ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ రాయడం  అనుభవం.  బహుశ ఈయన ప్రభావంవలననే కవిత్వం నిత్యకృత్యమైయ్యింది.  
ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.  కొత్తవేమిరాసారు అని మొదటిది. కొత్త పుస్తకాలు ఎమి సంపాదించారు అని రెండవది.
ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్టివచ్చినట్టే వుండెది. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది


***


కవిత్వాన్ని రాయడం ప్రారంభించాక కొందరి కవిత్వం నన్ను ఆకర్షించింది. వారిని గురువులుగానే స్వీకరిస్తాను
శివారెడ్డి - ఈయన కవిత్వాన్ని  చదివినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు ఏమనిపించిందో గమనించలేదు గానీ గుండె ఆపరేషను అయ్యి పడకమీదవున్నప్పుడు ఆయన కవిత్వాన్ని వల్లెవేయడం నాకు నాకే ఆశ్చర్యమనిపించిన విషయం.

జ్వాలాముఖి - అనర్గళమైన ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు దాని వెనుకవున్న ఆయన కృషి, సాధన కన్పించాయి. ఆయనలా అనర్గళంగా మాట్లాడంటే చేయాల్సిన కృషి ఎప్పుడూ గుర్తుకువచ్చేది.



కె. శివారెడ్డి, కె.యెస్. రమణ, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, నాళేశ్వరం శంకరం,   వాడ్రేవు చినవీరభద్రుడు,    వీరి కవిత్వం చదివినప్పుడు నేనూ వీరిలా రాయగలగాలి అని స్ఫూర్తినిచ్చారు. వీరి కవిత్వాన్ని స్పూర్తిపొంది రాసిన కవితా సందర్భాలున్నాయి.

***

ఈ మధ్య ఎం.ఎ. తెలుగు దూరవిద్యలో చదవడం మొదలుపెట్టాను
అక్కడ బయట పరిచయముండీ  . శ్రీ కె.యస్. రమణ,   శ్రీ సుధామ, ప్రత్యక్ష గురువులైనవారు
శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ తిరునగరి శ్రీనివాస్, శ్రీమతి రజని, శ్రీ పాల్ రత్నాకర్ గార్లు కొత్తగా గురువులయ్యారు.

ఇక్కడ సహ విద్యార్దులుకూడా  శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉష ఉపాద్యాయులుండటం గమనార్హం.


గురువులను గుర్తు చేసుకోవడం కొత్త వుత్తేజాన్ని ఇచ్చింది.
***

అక్క శ్రీమతి మేరీ సలోమి ఉపాద్యాయినిగా వుండటం అభినందనీయం