సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి)
some movements
Tuesday, January 24, 2012
Wednesday, December 14, 2011
జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే
జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే.
అవి నేను అప్పుడప్పుడే కలంపట్టిన రోజులు. తెలుగుయూనివర్సిటీ ఎన్.టి.ఆర్. అడిటోరియంలో కవిసమ్మేళనం జరుగుతుంది.
వేదిక అధ్యక్షులుగా శ్రీమతి నాయని కృష్ణకుమారి, శ్రీ ఉత్పల సత్యనారయణ, శ్రీ కె. శివారెడ్డి, ఎస్.వి. సత్యనారాయణ, శ్రీ జ్వాలాముఖి ఇంకొందరు వేదికమీదున్నారు. చాలామంది ప్రముఖ కవులు, కవయత్రులు కవితలు చదివారు. నాకు చివరలో అవకాశం దొరికింది. అప్పటికే కవిత్వం చదినవారు ఏవేవో సాకులతో వెళ్ళిపోవడంతో సభ పల్చబడింది, ముగింపుకొచ్చేసరికి నా కవిత్వానికి ఎవరు స్పందించలేదే అనే దిగులు నన్ను కమ్మింది. వరండాలోకి వచ్చాక అటుగా వస్తున్న ఆయన దగ్గరకు పిలిచి భుజంమీద చెయ్యివేసి పోయం బాగుంది. కొత్తగా రాస్తున్నట్టులేదు రాస్తూవుండు అని భుజం తట్టారు. ఆయనే శ్రీ జ్వాలాముఖి. అదే మొదటి పరిచయం. ఆ సంతోషాన్ని వివరించడానికి మాటలు లేవు నాదగ్గర.
నా కవిత్వంని ఆస్వాదించి నన్ను పరిచయం చేసుకున్నవారు బహు కొద్దిమంది అందులో ఈయన ప్రధముడు. తర్వాత చాలా సార్లు చాలా సభలలో కలిసాము. ఆయనలో నాకు ఒక అంశం నచ్చింది. అది ఏమిటంటే అనర్గళంగా మాట్లాడగలగడం. నేను చర్చిల్లో మాట్లాడే అవకాశలను ఇంత అనర్గళంగా మాట్లాడగలనా అని ఓ రోజు ప్రశ్నించుకున్నా. ఆ టెక్నిక్‌ను పట్టుకోవడానికి ఆయన సభలకు తప్పకుండా వెళ్ళే వాణ్ణి.
అయన కవిత్వంనుండి, వ్యాసాలనుండి, ఆయన జ్ఞాన సంపదనుండి ఏమీ పొదానో తెలియదు గాని, అర్గళంగా మాట్లాడం వెనుక వున్న కృషి, సాధన గమనించాను. చాలా కష్టమైన ప్రక్రియే అయినా సాధన చేసాను.
నేనెప్పుడన్నా ప్రసంగిచాల్సి వచ్చినప్పుడు జ్వాలముఖిని గొంతు ద్వారం దగ్గర వుంచుకుంటాను.
కవిత్వం ఏమిచ్చింది అనే ప్రశ్న తరచూ వినబడుతుంటుంది. నేను చెప్పగలను అనర్గళతవైపు నన్ను నేను మలచుకోవడానికి ఒక సాధనం(టూల్) దొరికిందని.
శ్రీ జ్వాలముఖిని తలచుకొనే ఈ రోజు చంద్రునికో నూలుపోగులా నా జ్ఞాపకం ఇలా మీ ముందు పరిచాను. ఆయన జీవన, జీవిత స్థితిగతులు ఎలా వున్నా ఒక సూచికగా నాకు నిలిచిన ఆయన మూర్తిమత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ఓదార్పు కలగాలని సదా ప్రార్థిస్తాను.
Friday, December 2, 2011
ఎయిడ్స్ ఓడిపోకతప్పదు కలసిపోరాడుదాం
జీవితమొక సుందరస్వప్నం
ఎయిడ్స్ ఓ దుశ్వప్నం
క్షణికంకోసం కానీయకు విషతుల్యం
క్షమించదు సమాజం
ఓ చిన్ని అ జాగ్రత్త
జీవితానికి మలుపు
మారణాయుదపు పిలుపు
తస్మాత్ జాగ్రత్త
ముందుజాగ్రత్త!
మురిపించే విజయానికి సగభాగం
మరి అజాగ్రతా!
ముంచుకొచ్చే చరమగీతం
క్షణికమైన ఆవేశంతో
అక్రమ సంబంధం
వేశ్యాసాంగత్య ద్వారబంధంలో
ఒక్కసారి అడుగేస్తే
జీవితాన్ని దహించే నిప్పురవ్వే
ఎదురుచూస్తోన్న మృత్యుకౌగిలే!
***
సూక్స్మంగా రక్తనాళాల్లో
ఇంకిపోయే ఎయిడ్స్
కరచాలనంలోకి
కనీసం ప్రవహించలేదీ ఎయిడ్స్
రోగుల్ని
శ్మశానంలో వదిలినంతమాత్రాన
రోగం వదలిపోదు
రోగ కారకాలను
ముసురుతున్న మౌఢ్యాలను
నిలదీసి విడదీసి చర్చించినప్పుడే
రోగాన్ని సమాజం పొలిమేరల్నుండి
తరిమేయగలం
మరణం దేనికి సంకేతం?
శరీరానికా! కుటుంబానికా! సమాజానికా!
మున్ముందు ఆహ్వానిస్తున్న లగ్నపత్రిక
ఎయిడ్స్ కాదా?
ఉద్యమిద్దాం
కలసి పనిచేద్దాం
రోగాన్ని ద్వేషించు
రోగిని ప్రేమించు
వివరంగా చర్చించు
రోగిని స్పర్శించు
మానవత్వాన్ని బ్రతికించు
ఎదురుగా ఉన్నది రాబోయే తరం
ఎయిడ్స్ లేని సమాజం నీవిచ్చే వరం
***
కాలగమనంలో
మరణం ముఖం మార్చుకుంటుంది
ఓ కలరా, ఒక మసూచి, మరో కేన్సర్
ఓడిపోయిన చిహ్నాలే
మరో చిహ్నాన్ని నిలబెడదాం
మరో చిహ్నాన్ని నిలబెడదాం
ఇప్పుడు ఎయిడ్స్ ఓడిపోకతప్పదు
కలసిపోరాడుదాం
Tuesday, November 22, 2011
మూడు చక్రాల బండి - ఈ పుస్తకం
సాహితీ మిత్రులకు
శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు
రాసిన మూడు చక్రాల బండికి కొన్ని చిత్రాలు జోడించి ఈ పుస్తకంగా మీ ముందుకు వస్తోంది.
యాబై అరవై మద్దెగాల వయస్సులో వచ్చే ఇబ్బందుల మధ్య ఆత్రపడి కొనితెచ్చుకునే చిక్కులను ఇందులో పదచిత్రాలుగా రచించడం జరిగింది. ఇవి ఆమద్య గ్రూపులో రోజూ ఒకటి చొప్పున ఆయన పోస్టుచేసారు. మొడట కొన్ని చదివిన తరువాత “గంతనే
మూడు చక్రాల బండి “ అనే రెండుపాదాలను స్థిరంగా వుంచుతూ సంఘటనను చిత్రించడం అంత సునాయాసమైన పని కాదని నాకు అర్థమయ్యింది. బాగున్నాయని తెలిపిన చిన్న అభినందనను స్పూర్తిగా తీసుకొని శ్రీ నూతక్కి గారు ఇరువై ఐదు పదచిత్రాలను అల్లడం ఆశ్చర్యానికి గురిచేసింది
మీకూ నచ్చుతాయని ఆశిస్తున్నాను.
ఆయన సాహిత్య కృషిని మరోసారి అభినందిస్తున్నాను.
మీకు నచ్చినట్లయితే చిన్ని అభిప్రయాన్ని రాయండి.
http://www.scribd.com/fullscreen/73438374?access_key=key-20tqivkr2rbhce7hxal1
anuvulu
Saturday, November 19, 2011
నిషాకన్నుల ఈరేయి - గజల్
నిషాకన్నుల ఈరేయి తీయని గాయమేదో రేపుతున్నదోయి!
మునిపంట దాగిన మౌనమేదో ఫక్కున నవ్విపోతున్నదోయి!
ఇటునటు పరుగిడు ఆత్రాలనేత్రాలలో కరిమబ్బు కమ్ముకొస్తుంటే
కబురందేనో లేదోయని వేచివున్న చెలిమది కలతచెందుతున్నదోయి
అగరుపూల వాసనతో నిండి పరువమేదో మత్తిలుతుంటే
చిరుగాలి అలలపై ఆకులసవ్వడి నీ అడుగులై ధ్వనిస్తున్నదోయి
వేవేల దీపాలకాంతి నీవులేని వాకిట వెలవెలపోతుంటే
ఆశల ముంగిట ప్రమిదేదో వూగివూగి వెలుగుతున్నదోయి
జ్ఞాపకాలు ఒక్కుమ్మడిగా కాకరపూవత్తులై రాసులు పోస్తుంటే
"జాను" చూడు ఎటుదాగెనో నెలరేడు వెదకి వెదకి విసుగొస్తున్నదోయి!
గుర్తుందిలే - గజల్
ఈ ప్రశ్నే కదా నువ్వు నన్నడిగిందీ గుర్తుందిలే!
అదే కదా పదే పదే నే చెప్పిందీ గుర్తుందిలే!
సాయంత్రపు నీరెండలో జాజులను కోస్తూ
విసిరిన పాలనురగల నవ్వేదో గుర్తుందిలే!
ఎదురుపడాలని పెరటిలో తచ్చాడుతూ
మదిన వేసినవలపు మొవ్వేదో గుర్తుందిలే!
పరాకుగా నే నిదురించేవేళ అడుగులో అడుగేస్తూ
ఘల్లుమని సవ్వడి చేసిన కాలిమువ్వేదో గుర్తుందిలే
పులకరించిన పెనవేసి రెండూ దేహాలేకమౌతూ
మౌనంగా నలిగిన బిడియపుపువ్వేదో గుర్తుందిలే
నేనున్నానని సడిలేని అడుగులేస్తూ
బెదిరిబెదిరి అడుగుల సవ్వడేదో గుర్తుందిలే!
అనురాగం ప్రతిరూపమై లాలించి మురిపిస్తూ
కొసరికొసరి తినిపించిన పాలబువ్వేదో గుర్తుందిలే
నిర్దయగా చేజారిన క్షణములన్నీ లెక్కిస్తూ
హాయిగా ఎగిరిన ఆశల గువ్వేదో గుర్తుందిలే
(జీవిత తొలినాళ్ళ జ్ఞాపకాల నుంచి )
Wednesday, November 16, 2011
అమ్మమనసు - గజల్
నిద్రపట్టిని ఓరాత్రి
నెట్టు అందుబాటులేనప్పుడు
ఏదో చదువుతుంటే
ఒక లైనుతో ప్రారంబమై ఇలా వచ్చింది
ఇందులో ఫేసుబుక్కు గ్రూపులలో తరచూ కలిసేవారి పేర్లు ఇమడటం యాదృశ్చికం
* * *
పండువెన్నెల కన్నా చల్లనిది అమ్మమనసు
గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన
మురిపాల మీగడ పాల బువ్వైనదీ అమ్మమనసు
బుడిబుడి అడుగులకు చూపుడు వ్రేలునిచ్చి
వడివడిగా పథాలలోకి నడిపినదీ అమ్మమనసు
భాను కిరణాలతో ఉదయరాగ మాలపించి
ధాత్రికే సహనం నేర్పినదీ అమ్మమనసు
జగతిని మమతల నెలవుల కాంతులలో
జ్యోతియై కరిగికరిగి వెలుగునిచ్చినదీ అమ్మమనసు
అనుబంధాలు పెనవేసే జాడల జాతరలో
సువాసనల గంధమై పరిమళించినదీ అమ్మమనసు
పద్మాలు వికసించే శరత్ చంద్రకాంతిలో
స్వాతి ముత్యమై మెరిసినదీ అమ్మమనసు
ప్రేమనెరిగిన శ్యామాక్షరాల యింటిలో
సిరులనిచ్చే శ్రీ నివాసమైనదీ అమ్మమనసు
విజయ పథాన నేను నడువగా
లోకాన ప్రవీణతలో నడిపినదీ అమ్మమనసు
నేర్చిన జ్ఞానంతో పయనించే మార్గంలో
వెలలేని అపరంజి అయినదీ అమ్మమనసు
తీపితీపి జ్ఞాపకాలు జగమంతా తెలిపే
యెదను పలికే సుధలు నింపినదీ అమ్మమనసు
కనిపెంచిన పిల్లలు తనయెదుటే ఎదిగి
వృక్షాలై నీడనిస్తుంటే సంతశించేదీ అమ్మమనసు
శృతిచేసిన రాగం ప్రీతిమీర ఆలపించే
"జాను''తెలుపు నాల్గుమాటలలో ఇమడనిదీ అమ్మమనసు
Monday, November 14, 2011
ఫేసుబుక్కు ఆరు నెలల ప్రయాణం – సింహావలోకనం
ఏప్రిల్, మే, జూన్ నెలలలో మెడికల్ శెలవులో వున్నప్పుడు మే నెలలో ఇంటిలో నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అంతర్జాలము నాకేమి కొత్త కాదు. నేను బ్లాగు మొదలు పెట్టిన తొలినాళ్ళలో సుమారు 200 బ్లాగర్లు మాత్రమే వుండేవారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బ్లాగులు రాసిన రోజులవి. అప్పట్లో మదర్స్ డే సందర్భంగా రాసిన పోస్టులతో అమ్మ అనే ఈ సంకలనం చేయడం జరిగింది. తెలుగులో వచ్చిన మొదటి ఈ సంకలనము. రెండవ ఈ పుస్తకము,
అంతర్జాల పోస్టులతో నాన్న సంకలనం చేయాలని ఎప్పటిదో కొందరిమిత్రుల కోరిక. ఫాదర్స్ డే రోజునుంచి కొంతమంది స్పందించారు. వారిలింకులనుండి పోస్టులను సేకరించాను. పేజి సెట్టింగులు చేసి కొంత పనిచేసాను కంప్యూటరులో వైరస్ రావడం, బ్యాకప్ తీసుకొనే అవకాశం చిక్కకుండా ఫార్మేట్ అవ్వడంతో ఆ కోరిక సగంలోనే అసంపూర్ణంగా మిగిలిపోయింది. శరీరం అనుకూలిస్తే అది పూర్తి చెయ్యాలి. ఇంతకుముందు స్పందించిన మిత్రులు ఇది చదువుతున్నట్లయితే మీ లింకులు పంపండి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను.
సేకరించిన డాటా కోల్పోవడం చాలా బాదాకరం అనిపించింది.
అప్పుడే శ్రీమతి శైలజామిత్ర ఫేస్ బుక్కును పరిచయంచేసారు. ప్రతీరోజు గాయాలకు డ్రెస్సింగు అయ్యాక భోజన సమయంలోపు గ్రూపులోనివి చదవడం అలవాటయ్యింది.. వివిధ మిత్రులద్వారా కొన్ని గ్రూపులు పరిచయమయ్యాయి. నిద్ర పట్టని రాత్రులను ఫేసుబుక్కు కవిత్వంలో గడిపాను.
సాహిత్య మిత్రులు, సాహిత్యనిధి, స్వేచ్చ, తెలుగు సాహితీ వలయం, మొజాయిక్, ప్రేమ ప్రేమకై.. ప్రేమించు, నానోలు ...ఇలా గ్రూపులు పరిచయమయ్యాయి.
శైలజా మిత్ర సాహితినిధి, సాహితిమిత్రులు గ్రూపును పరిచయం చేసారు
జ్యోతిర్మయి తెలుగు సాహితీవలయం గ్రూపును పరిచయంచేసారు
ఈగ హనుమాన్ నానోలు గ్రూపును పరిచయంచేసారు
మురళీధర్ నామాల స్వేచ్చ గ్రూపును పరిచయం చేసారు
జగతి జద్దాత్రి మొజాయిక్ గ్రూపును పరిచయంచేసారు
శ్రీనివాస్ వాసుదేవ్ ప్రేమ ...ఒరేమకై ప్రేమించు... గ్రూపును పరిచయం చేసారు
ఇంతకుమునుపే సాహిత్యంలో పరిచయమున్నవారు ఫేసుబుక్కులో కొద్దిమంది మాత్రమే వున్నా నేను వున్న శారీరక పరిస్థితిని బట్టి ఆన్ని చదివినా నచ్చినవాటిని మాత్రమే అభిప్రాయాలు రాయటం మొదలుపెట్టాను.
శైలజా మిత్ర సాహితినిధి, సాహితిమిత్రులు గ్రూపును పరిచయం చేసారు
జ్యోతిర్మయి తెలుగు సాహితీవలయం గ్రూపును పరిచయంచేసారు
ఈగ హనుమాన్ నానోలు గ్రూపును పరిచయంచేసారు
మురళీధర్ నామాల స్వేచ్చ గ్రూపును పరిచయం చేసారు
జగతి జద్దాత్రి మొజాయిక్ గ్రూపును పరిచయంచేసారు
శ్రీనివాస్ వాసుదేవ్ ప్రేమ ...ఒరేమకై ప్రేమించు... గ్రూపును పరిచయం చేసారు
ఇంతకుమునుపే సాహిత్యంలో పరిచయమున్నవారు ఫేసుబుక్కులో కొద్దిమంది మాత్రమే వున్నా నేను వున్న శారీరక పరిస్థితిని బట్టి ఆన్ని చదివినా నచ్చినవాటిని మాత్రమే అభిప్రాయాలు రాయటం మొదలుపెట్టాను.
వాదులాటలు, కీచులాటలు అభిప్రాయభేదాలు ఏ గ్రూపుల్లో కూడా తలెత్తినప్పుడు వాటినుండి దూరంగానే వున్నాను.
కొందరికి నేను చేసిన సూచనలు నచ్చాయి, నచ్చినవారు అమలుచేయడం కనిపించింది. కొందరు వారిదోరణిలో(మొనాటనీ) వారు వెళుతున్నట్టే కన్పించారు. అటువంటివారి పోస్టులు పెద్దగా పట్టించుకోవడం మానేసాను.
ఆసుపత్రి అనుభవాలను అక్షరీకరిద్దామనే బలీయమైన కోరిక వుండేది, మొదలుపెట్టి కొన్ని పోస్టులు రాసాను. అవి చూసి వీడేంటి ఇలా రాస్తున్నాడు అనుకున్నవారు వుండేవుంటారు. రెండు మూడు నెలల తర్వాత ఆ పోస్తులను అన్నీ ఒకచోట పెడదాము అనుకుని ప్రయత్నం చేసా కానీ ఫేసు బుక్కులో రాసిన పోస్టులు శాశ్వతంగా (బాక్ అప్) ఉండవని అప్పుడే తెలిసింది. వాటిని కోల్పోయాను. మళ్ళీ అలాగే రాయలేను.
ఒకొక్కరిగా పరిచయాలవుతున్న నేపద్యంలో కొందరి మాటలు స్వాంతనను, కొత్త స్పూర్తిని నింపితే కొందరి మాటలు, పనితీరులు కొంత నొప్పించాయి. అప్పుడే గ్రూపులో ఏమి జరుగుతుంది అని చూడటం కంటే నాకు ఏది అవసరం అనే విషయంపైనే శ్రద్ద పెట్టాలి అని నిర్ణయించుకున్నాను.
పరిచయాలలో :
మురళీధర్ నామాల
బ్లాగులలో పరిచయం. తూర్పు పడమరల సమయ తేడాలవల్ల నిత్యం ఆన్‌లైనులో తోచినదేదో మాట్లాడినవాడు.
స్వేచ్చగ్రూపుకు మార్గం చూపాడు. ఇంచుమించు నా అన్ని రాతలను చదివిన వాడు.
మురళీధర్ నామాల
బ్లాగులలో పరిచయం. తూర్పు పడమరల సమయ తేడాలవల్ల నిత్యం ఆన్‌లైనులో తోచినదేదో మాట్లాడినవాడు.
స్వేచ్చగ్రూపుకు మార్గం చూపాడు. ఇంచుమించు నా అన్ని రాతలను చదివిన వాడు.
ఈగ హనుమాన్ ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. చాలా సందర్భాలలో కలిసిన, తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం. నానోలలోని రసాస్వాదనను నాకు ఎక్కించాడు.
ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.
జగతి జగద్దాత్రి - ఫేసు బుక్కుకంటే ముందుగానే తెలిసినా, ఫేసు బుక్కు సాహితీ సాన్నిహిత్యాన్ని పెంచింది. చాట్ చేస్తూ చేస్తూ మాట్లాడిన పదాలలోంచి పాటలుగా అల్లడం జరిగింది. ఆ ధోరణి(ఫీవర్) కొన్నిరోజులు సాగి సుమారు 12 పాటలు రాయడం జరిగింది. నా బ్లాగులో చూడవచ్చు. విశాఖకు వస్తే మొజాయిక్ ఆహ్వానం అనడంతో అక్టోబరు నెలలో (10.10.2011) మండే మొజాయిక్ లో పాల్గొనడం జరిగింది. దాని వివరాలు బ్లాగులో చదవొచ్చు.
నూతక్కి రాఘవేంద్ర రావు :
ఈయన “మూడుచక్రాల బండి” అనే కిరీటంతో రాసినవి నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, మరింత సన్నిహితం చేసాయి. పెద్దవయసులోకూడా ఆయన కవిత్వాన్ని గురించి చూపించే ఆసక్తి నన్ను అబ్బుర పరుస్తూనేవుంది. నన్ను ఉత్తేజపరుస్తూనేవుంది.
బహుముఖ ప్రజ్ఞలు ఈమె కలిగి వుండటం ఆశ్చర్యపరచిన సందర్భంలో నన్ను గజల్ రాయమని సూచించడం జరిగింది. నేను మొజాయిక్‌లో పాల్గొన్నప్పుడు నేను రాసిన పాటను పాడివినిపించి మరింత ఆశ్చర్యానికి లోను చేసారు. కొన్ని గజల్స్ ప్రయత్నించడం జరిగింది.
జగన్నాద్ వడిమెల్ల
కవికిరీటి మీకు నేను ఏకలవ్య శిష్యుడను అంటూ ఉక్కిరిబిక్కిరిచేసే సోదరుడయ్యారు.
తను రాసిన వీరి వీరి గుమ్మడిపండులో నన్నూ చేర్చడంద్వారా చేరువయ్యి నేను విశాఖ వెళ్ళినప్పుడు నా కవిత్వం గురించి సభలో పరిచయంచేసారు.
రసవత్తరంగా రాసే కవిత్వంతో పాటు అంతే రసవత్తరంగా ఆయన అభిప్రాయలు వెలిబుచ్చడం నన్ను సన్మోహనపరచాయి. గ్రూపులో బైబిలు వాక్యాలను పోస్టు చేయమని ఉదయమే చదవడం చాలా బాగుంటుదని అని బాధ్యతనిచ్చారు.
శ్యామిలి నయబిల్లి
పోస్టు చేయగానే లైకు పెట్టదానికి ముందువుంటుంది. ఎప్పుడు ఆన్‌లైనులోనే కనిపిస్తుంది. ఎప్పుడు నిద్రపోతుందా అనేది నా అనుమానం
పోస్టు చేయగానే లైకు పెట్టదానికి ముందువుంటుంది. ఎప్పుడు ఆన్‌లైనులోనే కనిపిస్తుంది. ఎప్పుడు నిద్రపోతుందా అనేది నా అనుమానం
తమదైన గొంతులతో కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ నాకెందుకో వీరి కవిత్వాన్ని చదవాలనే ఆసక్తిని కలిగించారు
కల్లూరి శైలబాల
తక్కువ పరిచయం ఎక్కువ ఇంపాక్ట్ /అనుభవం
ఓరోజు మీ కవితా నేపద్యం రాయండి అని ఒక పోస్టువేసారామె. దానికి స్పందిస్తూ నేను కొన్ని పోస్టులు రాసాను. రెండుమూడు పోస్టుల మినహా మిగతావి అమె చూసినట్టు నాకు అనిపించలేదు. ఎవరికి వారు అక్షరాల వెనుక, అక్షరాల మధ్య చదువుకునేది కవిత్వం. నేపద్యం పాఠకుడికి చెప్పడంవల్ల అక్షరాల ముందు వెనుక, మధ్య అనే పరిధికి పరిమితులు గీసినట్టు అవుతుంది. అదే విషయం మిత్రులు చెప్పారు, ఇది కోరినది శైలబాల అయినా నన్ను నేను పునః పరిశీలించుకోవడానికి దోహదపడుతుందని రాసాను.
అవి ఒక డాక్యుమెంటుగా పొందు పరచాను. మరోసారి పోస్టుచేస్తాను.
కొన్నిరోజులతర్వాత మళ్ళి గ్రూపులో కనబడి ఎదో అడిగారు ఆమె. ఇలా అడుగుతారు మళ్ళీ కనబడరు అనేసరికి కోపమొచ్చినట్టువుంది. ఆ పోస్టును డిలీట్ చేసారు మళ్ళీ నాకు గ్రూపుల్లో తారస పడలేదు.
* * *
మూడునెలల శెలవుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆఫీసు అవసరాల దృష్ట్యా ఎప్పుడూ ఆన్‌లైను ఉండటం వల్ల ఫేసుబుక్కులోకి తొంగిచూసే అవకాశం చిక్కింది.
మెల్ల మెల్లగా పనిభారం పెరుగుతూ వచ్చింది. అలా రావటంవల్ల చదివిన వాటికి అభిప్రాయాలు రాసే సమయం తగ్గిపోయింది.
సెప్టెంబరు 5న చాలారోజుల తర్వాత వురకలేసిన నా కలం - అనే కవిత రాసాను. అది చాలారోజుల తర్వాత రాసిన కవిత అది. దాని తర్వాత రాయటం తరుముకొచ్చింది.
------------------
ఈ మద్యలోనే చేసిన ఇతర పనులు
ఎప్పుడో రాసిన ప్రేమాంతరంగం - కావ్యాన్ని బ్లాగులో పోస్టుచేసాను.
తెలుగు ఇంగ్లీసులలో వచనం వంబడి వచనంగా బైబిలులోని అధ్యాయాలు తెలుగు బైబిలు బ్లాగులో పోస్టుచేసాను.
--------------
ఎక్కువసమయం ఆ ఫేసుబుక్కులోనే గడుపుతున్నావు అని నా ప్రక్కటెముక హెచ్చరిస్తుంది
అందుకే కొన్నిరోజులు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాను.
నా అభిప్రాయాలు రాస్తే బాగుంటుందని ఎదురుచూసి ఎవరైనా నిరుత్సాహం చెందితే మన్నించండి.
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
Friday, November 11, 2011
గోదారి అనుబందం -3
తూర్పు కనుమల కొండల్లో
ఉదయసంధ్యారాగాల నడుమ
ధ్వనించే గుండె చప్పుడు
అది గోదారి అలల రాగం

దూరాన కొండ ఎంతచిన్నదో
ఎక్కేకొద్దీ తరగనిది
జలకమాడిన గోదారి
సాగిపోతున్నది అనంతమై
ఎక్కేకొద్దీ తరగనిది
జలకమాడిన గోదారి
సాగిపోతున్నది అనంతమై
* * *
తీరాలవెంబడి అడుగులు
పడిలేచిన మడుగులు
బ్రతుకున చూపినవవి
లోకంలోని తీరుతెన్నులు
పడిలేచిన మడుగులు
బ్రతుకున చూపినవవి
లోకంలోని తీరుతెన్నులు
పడవెక్కిన బాల్యం
ఇంగ్లాండు బ్రిడ్జిని తాకినట్టు
కలలు కన్న కనులు
అలలవెంబడి తళుకులు
* * *
అలలపై తేలి అలావెళుతుంటేను
పాడకుండా మానేనా మనసు
"కొండగాలి తిరిగింది
గుండె వుసులాడింది" అని
---------------------------
Thanks to Jyothi Rao Photos from
http://www.facebook.com/media/set/?set=a.286548298035590.73571.100000412657874&type=1¬if_t=photo_album_reply
ఇంగ్లాండు బ్రిడ్జిని తాకినట్టు
కలలు కన్న కనులు
అలలవెంబడి తళుకులు
* * *
అలలపై తేలి అలావెళుతుంటేను
పాడకుండా మానేనా మనసు
"కొండగాలి తిరిగింది
గుండె వుసులాడింది" అని
---------------------------
Thanks to Jyothi Rao Photos from
http://www.facebook.com/media/set/?set=a.286548298035590.73571.100000412657874&type=1¬if_t=photo_album_reply
Thursday, November 3, 2011
10.10.2011 న విశాఖ మండే మొజాయిక్ - కొన్ని చిత్రాలు
అక్క, బావల నూతన గృహప్రవేసానికి విశాఖ వెళ్ళాను.
పనిలో పనిగా మండే మొజాయిక్ ఆహ్వానం అందింది.
10.10.2011 ఉదయం కాళీగా ఉండలేక అలా ఆర్కె బీచ్, కైలాసగిరి తిరిగేసారికి కొంచెం అలసిపోయినట్టు అయింది. కైలాసగిరిలో రోప్, కొండపై రైలు మంచి అనుభూతి నిచ్చాయి.
విశాకను సముద్రాన్ని కొండపైనుంచి చూడటం కొత్త అనుభూతే.
ఇక మండే మొజాయిక్ గురించి
శ్రీ ఎల్.ఆర్. స్వామి గారు అధ్యక్షత వహించారు, జగతి గారు అథిదిగా నన్ను ఆహ్వనించారు.
మండే మొజాయిక్ సంవత్సర కాలం కార్యక్రమాలపై బాబు మాట్లాడారు.
ఈ మద్య కాలంలో నేను రాసిన ఊయలలూగే మనసు
మనసా ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ
మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల
పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల
గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ
మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల
పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల
గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఎదురుచూపుల దూరాలు
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
మరి మరి తలచి ఊగవే ఉయ్యాల
శ్రీమతి జ్యోతిర్మయి స్వరపరచి వినిపించడం నాకు కొంచెం ఉత్కంటే అయ్యింది.
విశాఖలో సాహిత్య కార్యక్రమంలో పాల్గనడం ఇదేమీ కొత్త కాదు. ఇది మూడవసారి. మొదటిసారి 26, 27 ఫిబ్రవరి 2005 లో 25 గంటల కవి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. అక్కడ నాకు కొందరు సాహిత్య మిత్రులు ఏర్పడి ఇప్పటికి మిత్రులుగా కొనసాగుతున్నారు వారిలో ముఖ్యులు శ్రీ అంగళకుర్తి విద్యాసాగర్, అప్పట్లో ఆయన గిరిజనాభివృద్ది సంస్థలో ఉన్నారు. ఈ సారి ఎవరిని కలుపుతుందో ఈ సమావేశం.
గత పదిహేను సంవత్సరాల క్రితం నాకున్న మద్యపాన వ్యసనాన్ని మానటం కోసం చేసిన అనేక ప్రయత్నాలలో కవిత్వం నన్ను పట్టుకుంది. చదువుతూ చదువుతూ నా వ్యసనం ఏమయ్యిందో తెలియదు.
నా కవిత్వాని విశ్లేషిస్తూ నారాయణరెడ్డిని, శివారెడ్డిని ఉదహరించారు. నేను కవిత్వం రాయాలనుజున్న తొలినాళ్ళలో శివారెడ్డి చెప్పే ఒక మాట. “ఒక కవితని విభిన్న రీతులలో రాసి చూసుకోవడం వల్ల దానిలోని లోతు పాతులు, పొరపాట్లు తెలుస్తాయని, బాగున్న దాన్ని ఎవరికి వారే ఎంచుకోవచ్చు”. ఈ మాటలు నాకు చాలా నచ్చడంవల్ల పాటించాను కూడా. అందువల్ల శివారెడ్డి ప్రభావం నా కవిత్వంపై ఉండవచ్చు.
బాబు మాట్లాడిన దానికి జోడింపుగా ఒక మాట కవిత్వం రాయడానికి /సృజన చేయడానికి మొదడులోని ఒక భాగపై వత్తిడి వుంటుంది. అదే అంతర్జాలంలో కవిత్వాన్ని రాయలంటే మెదడులోని రెండు భాగలపై వత్తిడి పడుతుంది. ఒకటి సృజన, రెండవది సాకేతికం. దీనిని కొత్తతరం అందిబుచ్చుకుంటుంది, కాని పాత తరం అందుకోవడానికి అవస్థ పడుతుంది.
నేను అంతర్జాలంలో బ్లాగు మొదలుపెట్టినప్పుడు సుమారు 200 మంది మాత్రమే బ్లాగర్లు వుండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది
కవిత్వాన్ని నా బ్లాగుల్లో చదవ వచ్చు.
కొన్ని క్రైస్తవ ఆలోచనలు కోసం నడక
తెలుగు ఇంగ్లీషులలో బైబిలు తెలుగుబైబిలు
నేను చదివిన కొన్ని కవితలలో కొన్ని ఇక్కడ
రెండు గదుల స్వేచ్చ
తెలుగు ఇంగ్లీషులలో బైబిలు తెలుగుబైబిలు
నేను చదివిన కొన్ని కవితలలో కొన్ని ఇక్కడ
రెండు గదుల స్వేచ్చ
రెండు గదుల్లోకి
జీవితాన్ని సర్దుకున్నప్పుడే
సగం స్వేచ్చకు సంకేళ్ళు వేయబడ్డాయి
అప్పుడప్పుడూ
అతిథులై పలుకరించే అవసరాలలో
మౌనంగా ముడుచుకుంటుంది
అటూ ఇటూ తిరిగే పిల్లలమధ్య
కళ్ళుతెరిచేలోగా
తృప్తి అసంతృప్తుల మధ్య
తెల్లవెంట్రుకలేవో పొడుచుకొస్తాయి
గొంతులో అల్లలాడిన పలుకులు
గుటకలై మిగిలిన స్వేచ్చ
జ్ఞాపకాలుగా
వంటగదిలో వేళ్ళాడే చిత్రపటాలౌతాయి
అలుపెరుగని దేహం
వోవర్ హాలింగు కోరుకుంటుంది
కుంటుతున్న ఆర్థిక ద్వారం
తుప్పట్టిన మడతబందుల మధ్య యిరుక్కొని
తెరుచుకోనంటుంది
శిశిరం అకాలంగా ముసిరితే
రాలుతున్న ఆకుల్లోచి తెగిపడ్డ స్వేచ్చ
తన సంకెళ్ళను తానే విప్పుకొని
మరో రెండుగదుల జీవితాన్ని వెదుక్కుంటుంది.
****
****
చివరిగా స్వామి గారు పోస్టాఫీసు(Translation of Ravindranath Tagoore) , కథా కేరళం పుస్తకాలనిచ్చారు.
పుస్పగుచ్చాన్నిచి సత్కరించారు
నేను నా ప్రక్కటెముక విజయ గ్రేస్
********
Thursday, September 29, 2011
ప్రవాహమెటు?
ఇక్కడ
నదులన్నీ
గొట్టపు బావులుగా మారి
గోట్టాల్లో ప్రవహిస్తున్నాయి
నీవు చెప్పే లెక్కలేవీ తప్పుకావు
ప్రవాహ కొనగోటి కోసం
అడవిదారిలొ అహల్య
పరిమళాల అత్తరు పగులగొట్టి
పాదాలకు రాయాలని ఒ మరియ
కొత్తచిగురును తొడగాలని
ప్రసవ వేదన పడుతున్న
ఎన్నొ కొమ్మలు
చల్లని సాయంకాలాల
స్నానమాడాలని
పక్షులు, జంతువులు
ఎదురుచూపంతా
ప్రవాహం కోసం
Tuesday, September 20, 2011
గోదారి అనుబందం -2
పడవనెక్కిన బాల్యం
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
* * * *
( ఫోటో : కొండవీటి సత్యవతి )
విభాగాలు :
కవితలు,
గోదారి అనుబందం -2,
జ్ఞాపకాలు
Saturday, September 17, 2011
Saturday, September 3, 2011
అమ్మ మనసున సంతసం
సంతసం అహఁ హఁ సంతసం
నా హృదయముప్పొంగుచున్నది
నీ వొసంగిన మేలులకై
ఆశీర్వాదపు జల్లులతో తడిపి
అనురాగపు పరిమళములతో నింపి
నీ బహుమానముల నొసగినందున
సంతసం అహఁ హఁ సంతసం
విజ్ఞానపు వినువీధులలో
మా జ్ఞానపు లోతులకతీతమై
నా గర్భమున ఫలము నొసంగినందున
సంతసం అహఁ హఁ సంతసం
ధాత్రిలో ప్రతి ప్రసవం వేదన చేసి
ధృతినిచ్చి రోదన బాధలు దీర్చి
ప్రతినిత్యం కృపలతో నింపుచున్నందున
సంతసం అహఁ హఁ సంతసం
నీవిచ్చిన స్వాస్థ్యములభిమానముతో
నీ దయలో పెద్దల దీవెనలతో పెంచే
బుద్ది కుశలతకై ప్రార్థించ గలిగినందున
సంతసం అహఁ హఁ సంతసం
----------------------------------------------------
ప్రతి తల్లి మనసులో పొంగే భావానికి చిన్న ప్రయత్నం
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న
అగష్టస్ - లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి
గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె షైనీ లిడియా
గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె షైనీ లిడియా
అభినందనలతో
విభాగాలు :
అమ్మ,
అమ్మ మనసున సంతసం,
కవితలు,
పాట,
సాహిత్యం
Sunday, August 28, 2011
మదిలో మెదిలే అపురూప రూపం
నీ రూపం అది అపురూపం
లీలగా మందార మాలగా
మకరంద ధారగా
నాలో నిలచి, నాలో నింపి
నిన్నే వలపింప చేస్తుంది
నన్నే మరిపింప చేస్తుంది
ఒంటరివేళ తుంటరిగా దరిచేరి
మురిపించి మైమరపించి
ఎదగిల్లి మదినల్లి
కవ్వింతల కలవరింతలతో
కళ్ళలో మెదిలేను
కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి
గిలిగింతల పలవరింతలతో
తలపుల్లో తడిమేను
కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
లీలగా మందార మాలగా
మకరంద ధారగా
నాలో నిలచి, నాలో నింపి
నిన్నే వలపింప చేస్తుంది
నన్నే మరిపింప చేస్తుంది
ఒంటరివేళ తుంటరిగా దరిచేరి
మురిపించి మైమరపించి
ఎదగిల్లి మదినల్లి
కవ్వింతల కలవరింతలతో
కళ్ళలో మెదిలేను
కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి
గిలిగింతల పలవరింతలతో
తలపుల్లో తడిమేను
కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
నా జీవితపు వేదమై కదిలేను
Friday, August 26, 2011
రంగు రంగుల పరిమళం
కొమ్మల నడిగా
రెమ్మల నడిగా
నీలో సొగసు ఎక్కడిదని
పూవులనడిగా
రేకలనడిగా
నీలో పరిమళం ఎక్కడిదని
నీ అపురూపవడిలో
నీ ప్రేమజడిలో
మొలచి తడిసి
వడివడిగా నడయాడగా
నీవిచ్చినదే ఈ సొగసు
నీవిచ్చినదే ఈ పరిమళం
చిలుకలనడిగా
సీతాకోక చిలుకలనడిగా
నీ మేనిలోని వర్ణమెక్కడిదని
రెమ్మల నడిగా
నీలో సొగసు ఎక్కడిదని
పూవులనడిగా
రేకలనడిగా
నీలో పరిమళం ఎక్కడిదని
నీ అపురూపవడిలో
నీ ప్రేమజడిలో
మొలచి తడిసి
వడివడిగా నడయాడగా
నీవిచ్చినదే ఈ సొగసు
నీవిచ్చినదే ఈ పరిమళం
చిలుకలనడిగా
సీతాకోక చిలుకలనడిగా
నీ మేనిలోని వర్ణమెక్కడిదని
నీ సహచర్యంలో
నా దినచర్యలలో
కలిపి పులిమి
నీ చెలిమి నా బలిమి కలిమిగా
నీ విచ్చినదే ఆ వర్ణం
వర్ణానికే పేరిచ్చిన చందం
నా దినచర్యలలో
కలిపి పులిమి
నీ చెలిమి నా బలిమి కలిమిగా
నీ విచ్చినదే ఆ వర్ణం
వర్ణానికే పేరిచ్చిన చందం
--------------------------------------------
తొలి సంకలనం హృదయాంజలి (మార్చి 2004) లోనిది Thursday, August 25, 2011
నీ కోసం నా మది
హద్దులు చెరిపేస్తా నీ కోసం
సరిహద్దులు మార్చేస్తా నీ కోసం
కొండలు దాటి కోనలుదాటి
ఎల్లలులేని కల్లలులేని
నవలోకం నిర్మిస్తా నీ కోసం
వినీలాకాశంలో రంగుల హరివిల్లు తేలేను నీ కోసం
తెరచివుంచిన రంగులమదినే పరిచేస్తా నీ కోసం
గగనంలో మెరిసే తారను తెంపలేను నీ కోసం
రెక్కలువిప్పిన సౌధాలకై ప్రక్కనుండగలనునీ కోసం
విరిసిన వెన్నెల చల్లదనం పట్టలేను నీ కోసం
గుండెలనిండిన అనురాగాన్ని ఆరబోయగలను నీ కోసం
లలిత పదజాలంతో కవితలల్లలేను నీ కోసం
మమతనెరిగిన ఓ మాట పలుకగలను నీ కోసం
సరిహద్దులు మార్చేస్తా నీ కోసం
కొండలు దాటి కోనలుదాటి
ఎల్లలులేని కల్లలులేని
నవలోకం నిర్మిస్తా నీ కోసం
వినీలాకాశంలో రంగుల హరివిల్లు తేలేను నీ కోసం
తెరచివుంచిన రంగులమదినే పరిచేస్తా నీ కోసం
గగనంలో మెరిసే తారను తెంపలేను నీ కోసం
రెక్కలువిప్పిన సౌధాలకై ప్రక్కనుండగలనునీ కోసం
విరిసిన వెన్నెల చల్లదనం పట్టలేను నీ కోసం
గుండెలనిండిన అనురాగాన్ని ఆరబోయగలను నీ కోసం
లలిత పదజాలంతో కవితలల్లలేను నీ కోసం
మమతనెరిగిన ఓ మాట పలుకగలను నీ కోసం
Wednesday, August 24, 2011
ఊగిసలాడే మనసు ఊసులు
చిగురాకుల మాటున దాగిన
ఆకుల కొమ్మల మాటున రెమ్మలదాగిన
కొత్తచిగురల వగరులతో
ఒదిగి ఎదగాలని
ఊగిసలాడుతోంది మనసు
సొగసులొలుకు పూరేకులతో
పూరెమ్మల పరిమళాలలో
చిరుగాలి అలలతోచేరి
కొమ్మకొమ్మను రెమ్మ రెమ్మను తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
కూనిరాగాల తుమ్మెదల చేరి
పువ్వు పువ్వున మకరందాన్ని గ్రోలి
తనువంతా మధురంచేసే
ఓ కొత్త రాగమాలపించాలని
ఊగిసలాడుతోంది మనసు
కిలకిలరావల పక్షులతోచేరి
కొమ్మరెమ్మల ఊయలూగి
భాషకందని భావాలతేలి
కోకిలగానాల వగరు పొగరుతో
ఉత్సాహపు చిటారుకొమ్మలు తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
--------------------------------------------
తొలినాళ్ళ మనసు ఊగిసలాట
Friday, August 19, 2011
నీవు నిండిన మనసు
నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో
కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..
ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..
పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో
కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..
ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..
పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..
Subscribe to:
Posts (Atom)
















