Showing posts with label 4th June. Show all posts
Showing posts with label 4th June. Show all posts

Friday, June 6, 2014

4th June, 1984-2014 మధ్య జ్ఞాపకాలు


జ్ఞాపకాలను తాజా పరచుకుని దానిద్వారా దేవుడు చేసిన మేళ్ళనుబట్టి  స్తుతించడానికి దేవుడు సమయాలను ఇస్తుంటాడు. ఆ సమయాలలో ఎవరైతే ఉంటారో వారికే జ్ఞాపకానుభవం ఉంటుంది.


4.6.2014 at LIG, RC Puram, Hyderabad
గత సంవత్సరం మనమధ్య వున్న నాన్న ఈ రోజు లేరు, 
4.6.2013 at LIG, RC Puram, Hyderabad
అయినా ఇదే రోజు నాటి జ్ఞాపకం ఉంది.
 ***

1984 నాటి కొన్ని సంగతులను పిల్లలముందు పంచుకోవడానికి సమయమిచ్చినందుకు దేవునికి వందనాలు.
4.6.1984 at Nalgonda

1984 నాటికి నేను మధ్యప్రదేశ్, జబల్‌పూర్ వద్ద పనిచేస్తున్నాను. అక్కడనుంచి హైదరాబాదు వచ్చి, హైదరాబాదునుండి నేరుగా నల్గొండ పెళ్ళికి వెళ్ళడం జరిగింది. 
వెళ్ళగానే నాన్నను కలిసి రెండువేల రూపాయలను ఆయన చేతిలో పెట్టాను. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత వేరే సందర్భంలో కూడా తన ఆశ్చర్యాన్ని నాన్న నాతో పంచుకున్నారు.
జబల్పూర్ నుండి మళ్ళి జబల్పూర్ వెళ్ళే వరకు ఐదు రూపాయల కొత్త కట్టను కర్చు పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనిది.

ఇప్పటి ఉద్యోగారీత్యా నెలకు కొన్ని లక్షలను జీతాలుగా ఇస్తూవుంటాను, కానీ దానిలో ఎప్పుడూ ఆనంద ఆశ్చర్యాలు లేవు గాని ఆ అయిదు రూపాయాల కట్టను (రూ.500/-) ఖర్చు పెట్టడం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా గొప్ప అనుభవం అనిపిస్తుంది.
***
లింకన్ అన్నయ్య పక్షవాతంతో (Sept.2001) NIMSలో ఉన్నప్పుడు పరిచర్యకోసం ఎక్కువ సమయం నేను గడిపాను.  ఇంటికి వచ్చేవరకూ ప్రతినిముషం ఇదే చివరి నిముషం అనిపించేంత ఉత్కంఠ అనుభవం.
రెండు ప్రత్యేకమైన అనుభవాలు
ఒకరోజు మధ్యాహ్నం ఎక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. మొదట ఒక టానిక్ ఇచ్చారు తగ్గలేదు, ఇంజెక్షను చేసారు తగ్గలేదు. సాయంత్రం అయిదు ఆ ప్రాంతంలో నర్సు చెప్పింది ఫీజ్డ్ సెలైన్ తెమ్మాని. NIMS  బయటికి వచ్చి మూడు గంటలపాటు షాపులన్నీ తిరిగాను గని ఫ్రీజ్డ్ సెలైన్ దొరకలేదు.
వార్డులోకి వస్తుండగా చెప్పారు వార్డ్ మెడికల్ రూములో ఫ్రిజ్ వుందిగా అందులో పెడితే ఫ్రీజ్ అవుతుంది కదా అని. తీరా అక్కడికి వెళితే నర్సు తాళంవేసి ఎటో వెళ్ళిపోయింది. తాళం దొరికేసరికి రాత్రి 10:30 అయ్యింది. ఎంతగా శారీరకంగానూ, మానసికంగానూ ఆ సమయంలో అలిసిపోయాననిపించింది. ఇది చివరి సమయం అనిపించింది. దేవుడు విడిపించాడు.

ఎన్ని రోజులైనా మార్పు కనిపింకపోవడంతోనూ, బెడ్దులు కావల్సిన వత్తిడితోనూ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అలా చెయ్యవద్దని, కనీసం పైడ్ గదులకైనా మార్చమని అడిగాను. ఎవ్వరి దగ్గరకు వెళ్ళినా కాదు అనే జవాబే. విసుగు చెంది ఒక చోట కూర్చుండి పోయాను. ఎవ్వరో అటువెల్టూ ఆర్. ఎం.ఓ. మిమ్మల్ని పిలుస్తున్నారు అనిచెప్పారు. ఏమి వినాలో అనుకుంటూ వెళ్ళాను. ఎవరో ఫోను చేసారని, రూముకు మారుస్తున్నామని చెప్పారు. అప్పటికి సమయం రాత్రి 12:00 గంటలు ఆ ఫోను చేసింది ఎవ్వరో తెలియరాలేదు. నేనూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు గనుక.

ఆ NIMS అనుభవం నా జీవితంలోనూ, నా అధ్యాత్మికతలోనూ చాలా మార్పు తెచ్చింది. బైబిలును పరిశిలనగా చదవ నారంభించి, చాలా తీక్షణంగానే చదివాను అనిచెప్పాలి

***
అనుభవంలో వున్నప్పుడు అనుకూలంగా లేనివాటికి మనసు, పరిస్థితులు, పరిసరాలు ఇబ్బందిగా ఉన్నాయనిపిస్తుంది. వాటిలో నిలబడి ఉన్నప్పుడే దాటి రాగలిగినప్పుడే సాక్ష్యంగా మిగులుతుంది.

పరిస్థితులకు అననుకూలతలకు తలొగ్గినప్పుడు ఆ బాధల్లోనే కొట్టుమిట్టాడుతుంటాము.

***
1 తిమోతికి 6: 5-8 వచనాలలో
5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
7. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.

***
ఆయా సమయములలో అలా ఉన్నప్పుడు పౌలు మాటలు విశ్వాసానికి కొత్త బలానిస్తాయి.
**
కీర్తనలు 76:1
1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

ఈ వాక్యములో యూదాలో బదులు మనమున్న స్థలాన్ని
ఇశ్రాయేలులో  బదులు మన ఇంటిపేరును ఆయన నామము గొప్పది. అని చదివి చూడండి

అంటే
ఆర్.సి. పురంలో దేవుడు ప్రసిద్ధుడు
కనుమూరివారిలో ఆయన నామము గొప్పది.

ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా వున్న దేవుడు  ప్రసిద్దుడుగా వుండాలని
ప్రతి గృహములో ఆయన నామము గొప్పగా ఉండాలంటాడు.
మన ద్వారా ఆయన గొప్పదనాన్ని చాటడానికి ఒకొక్క సమయంలో ఒక్కోలాగా ఉంచుతాడు. మనకు ఇష్టమైనవి, ఇష్టమైవాళ్ళు లేకపోవడంవల్ల అంత బాగా లేదనిపిస్తుంది అయినా
"అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము"

ప్రతి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు