Showing posts with label కొన్నిరోజుల విరామమం. Show all posts
Showing posts with label కొన్నిరోజుల విరామమం. Show all posts

Wednesday, August 8, 2012

కొన్నిరోజుల విరామమం

కొన్నిరోజుల విరామమం
దేహాన్ని కొంచెం కొంచెంగా తినాలని
వైరెస్ ఒకటి విఫలయత్నం చేసింది
ఇక పోరాటం నాకూ నాదేహానికి

క్షతగాత్రులు నా కుటుంబ సభ్యులు
చిల్లులు పడ్డ నా జేబులు

నా పోరాటానికి సహాయసహకారాల్నిస్తూ
డాక్టర్లు, నర్సులు

అంతిమ విజయం నాదే కదా!

నాతో వుండినవాడు నమ్మదగినవాడు
తన రక్షణ వస్త్రాన్ని నా కిచ్చాడు.


(వైరల్ జ్వరం, లంగ్స్ ఇన్‌పెక్షన్‌తో కొన్ని రోజులు ఆసుపత్రి లో వుండి ఇప్పుడే ఇంటికి వచ్చాను)