Showing posts with label ద్యానమాలిక. Show all posts
Showing posts with label ద్యానమాలిక. Show all posts

Monday, August 4, 2008

ప్రభాతగీతి

ద్యానమాలిక – 1

జలము ఆకాశము చుంబించడానికి వంగినప్పుడు, లేలేతకిరణాలతో మెరుస్తున్న సముద్రం కొత్త వేణుగనాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ తీరం వద్దనే నిలబడి ఉదయభానుడి వెలుగురేఖల్ని పట్టుకోవలనే గాఢమైన కొర్కెతో హృదయం ఉప్పొంగి గాన కెరటాలై ధ్వనిస్తోంది. ఎగసిపడుతున్న ధ్వని రాగాల కోర్కెతో అలై ఎగసిపడుతుంది. ఎగసిపడే ప్రతీ అల విరిగిపడుతుందా? విరిగిన ప్రతి అల ఉగసిపడుతుందా?

పక్షుల కువకువలు వినిపిస్తున్న ప్రభాత గీతిలో పాదాలను ముద్దాడుతున్న నురగలు నాయకునికి దారితొలగేందుకు ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూంది. విశ్వాస దేహాన్ని నీటీలలపై నడిపించేందుకు ఆహ్వానం పలుకుతుంది. అడుగు కదిపితే పాదంకింద నేలను కోస్తున్న కెరటాలు పాదాల్ని భయపెడుతూనే వుంటాయి. భయాల మద్య కొట్టుమిట్టాడుతున్న జీవితానికి మరో వుదయం, మరో వుదయం నిరంతరం సాగిపొతుంది. విరిగిపడే కెరటాలు ఇంకా భయాన్ని పెంచుతాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు యింకిపోతే దోసెడు నీళ్ళు దాహాన్ని తీర్చడానికి దొరకవు. జలాల్ని చీల్చడానికి వాడిన మోషే కర్రో, ఎలీషా దిప్పటో ఎక్కడో దాచబడివుంటుంది. ఆలలపై నడచివస్తున్న నీతి సూర్యుడు(యేసు) ఎన్నటికీ దప్పిగొనని జీవజలంతో ఇటే వస్తున్నాడు. మోస్తున్న పాత్రలో నింపుకోవలసిందే! పనికిరాని పాత్రలను పగులగొట్టాల్సిందే! సముద్ర జలాల్ని చీల్చుకొనో, నీటిపైనో ఒక్కడుగైనా నడవాల్సిందే. నడావాలంటే తడవాల్సిందే!

మరణం ఇరువైపులా దాడిచెయ్యాలని చూస్తున్నప్పుడు ఆరిన నేలను దర్శించడం నడచి సాగిపోవడం ఆశ్చర్యం. ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే! ఎదురయ్యే ప్రతి ఆనంద పరిమళం నాసికలకు తగులుతుంది.

సముద్రపు అలలుగా
సమస్యలు భయపెడుతున్నవేళ
సాగిపోవటానికి దారిలేదనుకున్నప్పుడు
ఎర్రసముద్రాన్ని రెండుగా చేల్చిన దుడ్డుకర్రవైపుచూస్తాను
నదిని పాయలుగాచేసిన దుప్పటికోసం వెతుకుతాను
నీటిపై మునిగే నా కోసం చాస్తున్న చేతిని అందుకుంటాను
ప్రవాహాలలో ఎదురీది సాగిపోతాను
అలలు అనుభవాలై నా గానంలో ఇమిడిపోతున్నాయి.

----
3580

Saturday, March 22, 2008

యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడుమాటలు


సాధారణంగా చనిపోవుచున్నవారు చివరిసారి పలికిన మాటలకు విలువ, ప్రాముఖ్యత, మరణవాగ్మూలము గా పరిగణిస్తారు.


యేసుక్రీస్తు అప్పగింపబడినప్పటినుండి పలికిన మాటలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ (బైబిలు) పరిశుద్ధ గ్రంధమందు ఒకేచోట రాయబడలేదు. రాయబడ్డ సమయాలు కూడా వేరు వేరుగా కనిపిస్తాయి.

ఇతరులను గూర్చిన లక్ష్యము ఈ మాటల్లో కనిపిస్తుంది

1. తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము (లుకా 23:34) - శత్రువుల కొరకు ప్రార్థన.

2. నేడు నాతోకూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను (లుకా 23: 43) - పశ్చాత్తాప పడిన వారికి వాగ్దానము.

3. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను, శిష్యునితో యిదిగో నీ తల్లి యని చెప్పెను (యోహాను 19: 26-27) - విశ్వాసముతో వెంబడించువారికి ఆదరణ, భాద్యతలను గుర్తు చేస్తుంది.
వేదనను తెలియచేసివిగా

4. "ఏలీ ఏలీ లామా సబక్తా" బిగ్గరగా కేకవేసెను (మత్తయి 27:46)
ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తా బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. (మార్కు 15: 34) - మనోవేదన మరియు దేవునికిని కుమారునికిని మద్య వున్న సంబధాలను గురించి చెపుతుంది

5. నేను దప్పిగొనుచున్నాననెను (యోహాను 19:28) - శారీరక వేదన - లేఖనములు, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు కనిపిస్తుంది
విజయము :

6. సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. (యోహాను 19:30) - ముగిసెనను తృప్తి.

7. తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. (లూకా 23:46) - ప్రాణాత్మలను గురించిన తృప్తి.

ఇవి ద్యానము చేయుటద్వారా యేసుక్రీస్తు ఈ లోకమునకు మన పాపములకు బలియాగముగా చనిపోయెనని విశ్వసించుటద్వారా రక్షణ, పరిశుద్ధత, నిరీక్షణ ఇవ్వబడతాయి.

సమసమయాలలో తప్పిపోతున్న పరిస్తితులను, చేస్తున్న పాపములను ఒప్పుకొని మరియొకసారి నిర్ణయించుకోడానికి (రి డెడికేట్), సరిచేసుకోవడానికి ఇది సమయము.

Wednesday, March 19, 2008

శుభ శుక్రవారము

నా ద్యానములోవున్నప్పుడు శుభశుక్రవారము గురించి బ్లాగాలనిపించింది. చాలా సార్లు నేను కొన్ని క్రైస్తవ మందిరములలో ఈ అంశాలను మాట్లాడినప్పటికీ బ్లాగు రాయటం కష్టంగానే అనిపిస్తుంది. అయినా చిన్న ప్రయత్నం.

ఇది యేసు క్రీస్తు సిలువ మరణము పొందిన దినము.

దీనికిముందు 40 రోజులు లెంట్ డేస్‌గా పాటిస్తారు. భస్మ బుధవారముతో మొదలయ్యే 40 రోజులలో పాటించేవి ఉపవాసము, బ్రహ్మచర్యము, మిత ఆహారము, ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఆచారబద్దంగా వున్నాయని క్రైస్తవ శాఖలలో కొన్ని శాఖలవారు పాటించటలేదు. క్యాధలిక్ వారు పాటిస్తునే వున్నారు. ఈ రోజులలో సిలువ ధ్యానాలు పేరిట ఇళ్ళను దర్శించడము, ప్రత్యేకమైన ప్రార్ధనలు జరిగించడము, సిలువలోని మర్మాలను గురించి ధ్యానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రస్తుత రోజుల్లో తక్కువగా హాజరౌతున్నారు.

ఈ శుక్రవారము సమావేశము అవటం ద్వారా క్రీస్తు సిలువ వేయబడుతున్న సమయంలోని సంగతులను ఉదయం 11 గంటలనుండి మద్యాహ్నం 3 గంటలవరకు ధ్యానిస్తారు. ముఖ్యంగా యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలను, తనుపొందిన ఏడు గాయములు, వాటి ఆంతర్యాలను మన జీవితాలకు అన్వయించుకోవలసిన అవసరాన్ని తెలియచేసేవిగా వుంటాయి. క్రైస్తవులనే వారు తప్పనిసరిగా ఈ సమావేసము(ఆరాధన)లో పాల్గొంటారు.

యేసుక్రీస్తుకు ఇలా జరుగుతాయని ఆయన పుట్టక మునుపే ప్రవక్తలు ప్రవచించినట్లుగా బైబిలు తెలియచేస్తుంది. యేసును నమ్మటంద్వారా పాపములు పరిహరింప బడతాయని, క్రొత్త జీవిత విధానములోకి మార్చ బడతామని, (యెవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి.) బైబిలు తెలియచేస్తుంది

క్రీస్తును సమాధిలోవుంచి సీలువేసి, సైన్యము కాపలావున్న తర్వాత ఆదివారము వుదయం యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేచి వచ్చాడు, దీనిని పునరుత్థానపు (ఈస్టరు)గా పండుగ జరుపుకుంటారు. మొదటి తరం ప్రొటస్టెంటులలోనూ, మిషనరీ ప్రాచుర్యము చేస్తున్న సమయంలో ఈస్టరును ప్రత్యేక రీతిలో జరుపుకునే పద్దతులు పాటించినప్పటికీ మారుతున్న కాల మాన పరిస్తితులకు అనుగుణంగా చాలా మార్పులు చోటుచేసుకోవడంవల్ల ప్రత్యేకంగా ఇలా జరుపుకుంటారు అని వివరించలేము ఇప్పుడు.

యేసు సిలువకు అప్పగింపబడిన సమయమునుండి పునరుత్థానుడైనంత వరకూ జరిగిన సంగతులను, విషయాలను, సంభాషణలను, రహస్యాలను, దీనివెనుకున్న వేదాంతాన్ని పరిశీలించినపుడు చాలా ఆశ్చర్యంగాను, అద్బుతంగాను అనిపిస్తాయి.

ప్రత్యేకమైన సమయాలను పాటిచడం కాదు, ప్రతిసమయాన్ని ప్రత్యేక సమయంగా మార్చు కోవాలి అనే వాదన వల్లకూడా కొన్ని మేలుకరమైన ఆచారాలు కూడా కనుమరుగౌతున్నాయని నా కనిపిస్తుంది.

యేది యేమైనా యేసు అన్నట్లు "నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే" యేసు పాపపరిహార్థముగా చనిపోయాడని నమ్మటం ముఖ్యం. మనం అనుభవించవసిన పాపపు శిక్షను యేసు సిలువకు కొట్టాడని, అయనను ఆశ్రయించడం ద్వారా పాపం నుండి మనం స్వతంత్రులమౌతామని బైబిలు తెలియచేస్తుంది.

ఈ శుభ శుక్రవారపు మరియు పునరుత్థానపు (ఈస్టర్) దీవెనలు మీ అందరికి కలుగును గాక!

Wednesday, December 26, 2007

క్రిస్మస్ అంటే

క్రిస్మస్ లోని కొన్ని విషయాలు
१।భయాలనుండి బయటకు వచ్చే సమయం
२. విశ్వాసాన్ని తాజా పరచుకొనే సమయం
३. క్షమాపణను విస్తరించే సమయం
४. నూతన నిర్మాణలకు నాంది పలకాల్సిన సమయం
५। నూతన నిర్ణయాలను గర్భం ధరించాల్సిన సమయం


ఇవి జరిగినప్పుడు ఇమ్మానుయేలు - "దేవుడు మనకు తోడు" నిజమైన క్రిస్మస్ జీవితాలలో, కుటుంబాలలో, సమాజంలో జరుగుతుంది

Monday, June 18, 2007

ద్యానమాలిక – 2

ద్యానమాలిక – 2
నాలుకకు పాచిపట్టడం జీవ లక్షణంపాచిని తీసుకోవడం జీవనలక్షణం, పాచిని తీసుకోవడానికి ఓ పరికరం కావాలి. అత్మీయ జీవిత జీవలక్షణాలకి అవసరమైన పరికరమే ధ్యానం. ఆలొచనలు జీవిత గమనంలో తేనెని కూర్చే తేనెటీగలుగా పనిచేస్తుంటాయి. లోకం పోకడలు తేనెకోసం ఈగలను కదుపుతుంటాయి. నిత్యం ఎదురౌతున్న లోకం పోకడలమద్య చిక్కుకొని బాధింపబడుతుంటాము. ఆనుదినం పుట్టుకొచ్చే ఆలోచనలను స్వీకరిస్తూ వ్యవహరిస్తూ ఆలోచనలు స్థిరపరచుకొని, పరిస్థితులను లక్ష్యాలను చేదించుకుంటూ విజేతలుగా మనల్ని మనం నిలబెట్టుకున్నపుడు మనల్ని అభినందించేవాళ్ళు, అనుసరినంచేవాళ్ళు వుంటారు. ఆలోచనలు స్థిర, అస్తిరథల నడుమ వూగిసలాడుతున్నప్పుడు అపజయాలపాలౌతము. ఆభినందించినవాళ్ళే, అనుసరించినవాళ్ళే ఓటమిలో దూరంగా జరుగుతారు. మనస్తత్వశాస్త్రవేత్తల లెక్కలప్రకారం ఒకరోజు ప్రతినిముశానికి 15 ఆలోచనలు చొప్పున మేల్కొనివుండే 16 గంటలలో 14,400 ఆలోచనలు, నిద్రలో రెండు గంటలలో 1,800 ఆలోచనలు మొత్తం 16,200 ఆలొచనలు కలిగివుంటాము. 50 శాతం పాజిటివ్ గా వుంటే విజయంవైపుగా వుంటాము. మనం ఒకరోజులో ఎన్ని ఆలోచనలను స్వీకరిస్తున్నామనేది మొదటి ప్రశ్న. దేనిపై నిలుపుటున్నామనేది రెండవ ప్రశ్న. రోజులు, వారాలు, సవత్సరాలు గడచిపోతునే వుంటాయి. మనం నిలిపే ఆలోచనలే మన ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాయి. ఫైపైకి ఎక్కడానికి ఎటువైపో చూస్తుంటాము. ఆలోచనను బట్టి నమ్మకముంటుంది. నమ్మకాన్నిబట్టి ఆసయాలు వుంటాయి. ఆసయాలనుబట్టి వైఖరి వుంటుంది. వైఖరినిబట్టి ప్రవర్తన వుంటుంది. ప్రవర్తననుబట్టి చేసేపనులు వుంటాయి. పనులనుబట్టి జీవితముంటుది. ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. ఏ ఒక్కదానిలో లోపం జరిగినా మొత్తం జీవితమ్మీద ప్రభావం కనిపిస్తుంది. మనకు మనకు కలిగే ఆలోచనలను అదుపుచేయాలి, పొదుపుచేయాలి, మదుపుచేయాలి.

“హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవావలన కలుగును. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును.” సామెతలు 16: 1, 9 “మనుష్యుడు ఏమివిత్తునో ఆ పటనే కోయును” గలతీ 6:7

నా నోట గీతమునిమ్ము
నూతనగీతమునిమ్ము
నీ మహిమలో గానముచేయ
నా హృదయ తలంపులు
నాకు కల్గిన ఆనందములో
నా కన్నీటి వేదనలలో
నేనొదిన బాధలలో
నా ఆశలన్నీ నీపైనే
ఈ జీవిత నావకు
ఈ ఆలోచనా ధారకు
దేవా! నీ కృపాతీరాలకు
నీవే నా ఆధారం
.

ద్యానమాలిక

ద్యానమాలిక – 1
జలము ఆకాశము చుంబించడానికి వంగినప్పుడు, లేలేతకిరణాలతో మెరుస్తున్న సముద్రం కొత్త వేణుగనాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ తీరం వద్దనే నిలబడి ఉదయభానుడి వెలుగురేఖల్ని పట్టుకోవలనే గాఢమైన కొర్కెతో హృదయం ఉప్పొంగి గాన కెరటాలై ధ్వనిస్తోంది. ఎగసిపడుతున్న ధ్వని రాగాల కోర్కెతో అలై ఎగసిపడుతుంది. ఎగసిపడే ప్రతీ అల విరిగిపడుతుందా? విరిగిన ప్రతి అల ఉగసిపడుతుందా?పక్షుల కువకువలు వినిపిస్తున్న ప్రభాత గీతిలో పాదాలను ముద్దాడుతున్న నురగలు నాయకునికి దారితొలగేందుకు ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూంది. విస్వాస దేహాన్ని నీటీలలపై నడిపించేందుకు ఆహ్వానం పలుకుతుంది. అడుగు కదిపితే పాదంకింద నేలను కోస్తున్న కెరటాలు పాదాల్ని భయపెడుతూనే వుంటాయి. భయాల మద్య కొట్టుమిట్టాడుతున్న జీవితానికి మరో వుదయం, మరో వుదయం నిరంతరం సాగిపొతుంది. విరిగిపడే కెరటాలు ఇంకా భయాన్ని పెంచుతాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు యింకిపోతే దోసెడు నీళ్ళు దాహాన్ని తీర్చడానికి దొరకవు. జలాల్ని చీల్చడానికి వాడిన మోషే కర్రో, ఎలీషా దిప్పటో ఎక్కడో దాచబడివుంటుంది. ఆలలపై నడచివస్తున్న నీతి సూర్యుడు ఎన్నటికీ దప్పిగొనని జీవజలతో ఎటే వస్తున్నాడు.మోస్తున్న పత్రలో నింపుకోవలసిందే! పనికిరాని పాత్రలను పగులగొట్టాల్సిందే! సముద్ర జలాల్ని చీల్చుకొనో, ఒక్కడుగైనా నీటిపైనో నడవాల్సిందే. నడావాలంటే తడవాల్సిందే!మరణం ఇరువైపులా దాడిచెయ్యాలని చూస్తున్నప్పుడు ఆరిన నేలను దర్శించడం నడచి సాగిపోవడం ఆశ్చర్యం. ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే! ఎదురయ్యే ప్రతి ఆనంద పరిమళం నాసికలకు తగులుతుంది.
సముద్రపు అలలుగా
సమస్యలు భయపెడుతున్నవేళ
సాగిపోవటానికి దారిలేదనుకున్నప్పుడు
ఎర్రసముద్రాన్ని రెండుగా చేల్చిన దుడ్డుకర్రవైపుచూస్తాను
నదిని పాయలుగాచేసిన దుప్పటికోసం వెతుకుతాను
నీటిపై మునిగే నా కోసం చాస్తున్న చేతిని అందుకుంటాను
ప్రవాహాలలో ఎదురీది సాగిపోతాను
అలలు అనుభవాలై నా గానంలో ఇమిడిపోతున్నాయి.