యవ్వనంలో లీపు సంవత్సరపు తేదీపై చాలా గొప్ప అంచనాలు వుండేవి. ఎందుకంటే ఆరోజు వివాహం చేసుకోవాలని ప్రత్యేకంగా వుంటుందని అనుకొనేవాణ్ణి. నాకు 24, 25 సంవత్సరాలు వచ్చాక ఎవరైనా పెళ్ళి ఎప్పుడూ అని అడిగితే 29.2.1988 అని టక్కున చెప్పేవాణ్ణి.
అన్నీ నేను అనుకున్నట్టే జరిగితే ఈ రోజు పోస్టు మరోలా రాసేవాడిని.
"తొందరిపడి ఒక కోకిల ముందే కూసింది" అన్న చందంగా కొన్ని అనివార్య కారణాలవల్ల అనుకున్న తేదీకంటే ముందుగానే పెళ్ళి చేసుకున్నాను. లీపు సంవత్సరపు తేదీ నాకు ప్రత్యేకత లేకుండా పోయింది.
వెనక్కు తిరిగి చూసుకొని బాధ పడలేదు, ఎందుకంటే తొదరపడి కూయటంలో మాట నిలుపుకుని నా ప్రక్కటెముకను పొందగలిగాననే తృప్తి చేజారిన ప్రత్యేక తేదీ దిగిలును మరిపించేస్తుంది.
