Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Tuesday, March 8, 2011
Thursday, December 9, 2010
Monday, March 8, 2010
మహిళా దినోత్సవ సందర్భంగా- కొన్ని జ్ఞాపకాలు
ఈరోజు చాలా విషయాలతో టపా రాయాలని వుదయమే అనిపించింది. కొన్ని ఆలోచనలు మనసున తొలిచాయికూడా. ఆఫీసుకు వెళుతూ కొన్ని మననం చేసుకున్నాను. ఆఫీసులో అడుగు పెట్టాక దాని సంగతే మరిచిపోయా. ఇదిగో ఇప్పుడు(సాయత్రం 7.50గంటలకు) మళ్ళీ గుర్తుకువచ్చింది.
మననం చేసుకున్న విషయాలు ఒక్కటికూడా గుర్తు రావటంలేదు.అయినా చిన్న ప్రయత్నం
-- 0 --
అమ్మనుగురించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే వుంటాయి.
క్రైస్తవనమ్మకం ప్రకారం బంగారువీధులున్న పట్టణానికి అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.తను మోకరించిన వేకువ జాములు, తొలివెలుగుల పక్షుల కిలకిల రావాలతో గొంతుకలిపి ఆలపించిన స్తుతిగీతాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి.
నిద్రలో మరో కల
అడుగులు నేర్వనిబుడుగు పాదాలను కడిగిన వేళ
జారుడు వూగిసలాటలో
మెరిసిన బిందువుగా
ముద్దుల వర్షంలో ఆవిరయ్యాయి
పదంనేర్చి పథం ప్రాకులాటలో
పొరలమాటున దాగిన
ఈ వన్నె దేహాన్నంటి
జారుతున్న బిందువులపై
ప్రసరించి మెరిసిన కిరణపు వెలుగు
తళుకు కాంతులైనప్పుడు
నీ ఆశల కిరణాలుగా చుటుముట్టాయి
నాకోసం పరిశమించిన పాదాలను ముద్దాడలనివుంది
నేనందుకోలేని దూరంలో నీ పాదాలు
ని రెప్పలు నిద్రలో మరోకల కంటున్నాయి
నా కోసం
--0--
ఊహ తెలిసినప్పుడు నాతో నడిచి, నాకు ఎన్నో నేర్పించి దిశా నిర్దేసాల ఆలోచనా గమనం.
తను డాక్టరైతే నేను కాంపౌడర్ని, తను ఓ కొట్టుపెడితే నేను సామను అందిచే కూలివాణ్ణి ఇలా ఎన్నో ఆటలలో, వయసులో తనే నాముందున్నా భోజనం దగ్గర మాత్రం నేదే ముందు.యువతగా వున్నప్పుడు తను చదివిన పుస్తకాలను నాకు చెబుతున్నప్పుడు నాకు తలనొప్పి తెస్తుందనుకున్నా, ఇప్పుడిప్పుడే సాహిత్యాన్ని అద్యయనం చేస్తున్నప్పుడు ఆమే నా ఎదురుగా ఎవో వివరిస్తున్నట్లే అనిపిస్తుంది అమె నా అక్క. నా ఆలోచనా ధారకు అంబులపొది.
జ్ఞాపకాల వాకిటముందు ప్రణమిల్లుతున్నాను
--0--
ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి (పాతవే అయినా) ఈ నాలుగుమాటలు

దృశ్యం-1
మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.
దృశ్యం-2
ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి
సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది
నేనే చెలమగా చూస్తుండిపోయా!
మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.
దృశ్యం-2
ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి
సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది
నేనే చెలమగా చూస్తుండిపోయా!
--
అందుకే ప్రేమిస్తున్నానని కాకుండా ఇంకా ప్రేమిస్తున్నానని చెబుతున్నా.
-- 0--
వసంతగానం ఎప్పుడూ మదురంగానే వుంటుంది.
నన్ను కన్న అమ్మను ఎన్ని సార్లు అమ్మా అని పిలిచానో గుర్తులేదుకాని, నాచిన్ని తల్లులు ఎదపై ఆడుకున్న బుల్లి పాదాల ముద్రలు నన్ను నిత్యం పరవసింప చేస్తూనేవుంటాయి. అమ్మా అనిపిలవటం కన్నా ఏమి చెయ్యగలను.
--0--
మొన్నీ మద్యే ఎదో సందర్భంలో మహిళ పదానికి నిగంటువు వెదికాను. భూమినుంచి వచ్చినది అనే స్పురణ కలిగింది. ఆ ఓర్పు, సహనం, ప్రేమ, కరుణ, ధీరత కలిగిన మహిళలందరికి శుభాకాంక్షలు.
--0--
జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతాయి? జరిగిపోయినది ఎదో కళ్ళెదుటలేనప్పుడే కదా! బహుశ మీరు భౌతికంగా ఇక్కడలేని అమ్మను మాట్లాడుతున్నారా??
బంగారు వీధులున్న పట్టణానికి వెళ్ళిన అమ్మ దగ్గరకు నేనూ వెళతాను చెప్పటానికి మీరు చేసింది సాహమే అనిపిస్తుంది నాకు. మీకు జ్ఞాపకమొస్తున్న శబ్దరాగాలు కొంచెం హృదయపు చెవినిపెడితే మాకూ లీలగా వినబడుతున్నాయి.
అవును నిజమే!
అమ్మ ఎప్పుడూ మనకోసమే కలకంటూ వుంటుంది
అది బాల్యంలో లాలపోసి తడిసిన దేహాన్ని ముద్దులతో ఆవిరిచెయ్యాడం వెనుక
ఆమెలోదాగిన ప్రేమ ఎంతఘాడంగా వుంటుందో కదా!
శ్రమకు కారే బిందువుల్లోంచి సాధిస్తున్నవి విజయాలైనా అమ్మకు వెలుగుచిమ్మే నవ్వులకన్నా సహచర్యమెంతో గొప్పగా పలవరిస్తుంది.
అన్నిటిని గుర్తించిన అక్షరాలు అభినందనీయమైనవి. స్నేహితులుగా, బాల్యమిత్రులుగా అక్కా తమ్ముళ్ళు, అనా చెల్లెళ్ళుగా వుండటం ఒక మధురమైన అనుభూతే అయినా దాన్ని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడం నిజంగా ప్రశంసనీయం.
----
"ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి" ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా ఎదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటా కొత్తదనం అనేది అర్థం కావటంలేదు.
ఇక రెందుదృశ్యాలను చూస్తూ చదువుతున్నప్పుడు ఎప్పుడో చూసిన క్లియోపాత్రా సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఎవ్వరికి తలవంచని సీజర్ (రోమా చక్రవర్తి) ఐ బవ్ అని మోకాళ్ళపై అమె ముందు నిలబడతాడు.
అలా మీరు కనిపిస్తున్నారు.
--- పిల్లలను అమ్మా అని పిలిచి అమ్మను గౌరవిస్తున్నారో
అమ్మను గుర్తు చేసుకుంటూ పిల్లలను ప్రేమిస్తున్నారో
ఇద్దరూ జెండరు ప్రకారం స్త్రీలే కావటం కాకతాళీయమా! ??
నాకూ ఎవేవో రాయల్నిపిస్తునాదండోయ్ మీ టపా చదివాక
అభినందనలు
అపూర్వ
Wednesday, December 23, 2009
క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ గురించి చాలా రాద్దామని చాలారోజులముందే ప్రయత్నాన్ని ప్రారంభించాను. తీరా ఈ రోజు 23వ తారీఖు. ఇక రాయడం కుదరుదుకాని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపగలను.
మళ్ళీ అంతర్జాలానికి ఎప్పుడు వస్తానో కూడా తెలియదు.
క్రీస్తు జయంతి
విశ్వమానవాళికీ
శాంతి, సౌభాగ్యాల నెలవు కావాలని
ఓ క్రొత్త తార వెలుగు
ఓ క్రొత్త దూతల పిలుపు
హృదయాలలో
గృహాలాలో వెలుగొందాలని
క్రిస్మస్ శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)
