Showing posts with label ఇతరములు. Show all posts

Friday, June 17, 2011
Friday, December 3, 2010
నీలగిరి దృశ్యాలు
జీవిత దారుల్లో తన్మయ పరిచే కొన్ని అద్భుత దృశ్యాలు
వాటిని వెదుక్కుంటూ హత్తుకోవాలి
తటాకాలై మనల్ని మురిపిస్తాయి
Saturday, August 21, 2010
'ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యం
చాలా సంతోషమనిపించింది.
నేను బ్లాగు మొదలుపిట్టిన మొదట్లో రీసెర్చికి కావసినంత విషయం వుందని, జరగాలని ఆశించినవాడిలో నేను ఒకణ్ణి.
ఇప్పుడు అది నిజం కాబోతుంది.
హలో ఫ్రెండ్స్..
నేను 'ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యం ' అనే అంశం మీద పరిశోధన చేస్తున్నాను.అందుకోసం నేను మీ సహకారాన్ని కూడా కోరుతున్నాను.కింది ప్రశ్నలలో మీకు తెలిసిన సమాధానాలను విపులంగా నాకు తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నలే కాక మీకు ఇంటర్నెట్ లో వున్న ఏ తెలుగు సమాచారమయినా , తెలుగు పత్రికలు,వెబ్ సైట్లూ... ఇలా తెలుగు కి సంబంధించిన ఏ విషయమయినా దయతో తెలియజేయండి.ఈ ప్రశ్నావళి నీ మీకు తెలిసిన మిత్రులకి కూడా పంపి సహకరించండి.
- అభినందనల తో
హేమలత పుట్ల
వెబ్ లో తెలుగు సాహిత్యం
1 ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యం ఉందని మీకు తెలుసా?
2. తెలిస్తే ఎటువంటి సాహిత్యం ఉందని భావిస్తున్నారు?
3.మీరు ఎక్కువగా ఇంటర్నెట్ లో ఎటువంటి సాహిత్యాన్ని చదువుతున్నారు?
4. తెలుగు సాహిత్య మాసపత్రికలు, బ్లాగులు మీరు చూస్తుంటారా?
5.పై వాటిలో సాహిత్య విలువలున్న పత్రికలూ తెలిస్తే చెప్పండి?
6.మాసపత్రికలలోని శీర్షికలలో మీకు బాగా నచ్చినవి ఏవి?
7. ఉపయోగకరమైన తెలుగు బ్లాగులను మీరు గుర్తించారా?
8. మీకు వెబ్ సైట్ ఉందా?
9. ఇంటర్నెట్లో ఇప్పుడున్న సాహిత్యం మెరుగ్గా ఉందా?లేదా మార్పులు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా?
10. వెబ్ లో తెలుగు భాషకి ప్రాధాన్యం ఇస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి మీకు తెలిస్తే చెప్పండి?
11. గూగుల్ , యాహూ, ఒపేరా, యాపిల్ కంపెనీ లు తెలుగుకి ప్రాధాన్యత ఇస్తున్నాయా ?
12. తెలుగు బ్రౌజర్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలిస్తే చెప్పండి?
13. మీకు తెలిసిన, నచ్చిన తెలుగు వెబ్ సైట్ల గురించి,బ్లాగుల గురించి, ఆర్కుట్ కమ్యూనిటీల గురించి ఇంకా మాస పత్రికల గురించి వివరాలు ఉంటె తెలియచేయండి?
14. మీకు కంప్యూటర్ పరిచయం ఉందా?
15. ఇంటర్నెట్ లో అక్షరాల formats గురించి తెలుసా? తెలిస్తే వివరించండి.
16. unicode font గురించి చెప్పండి?
17. శ్రీలిపి,అను,ఐలీప్ తదితర ఫాంట్సు యూనికోడ్ గా మారే సాఫ్ట్ వేర్ల గురించి మీరేం గుర్తించారు?
18.ఇంటర్నెట్ సాహిత్యానికి ప్రింట్ సాహిత్యానికి మధ్యగల సౌలభ్యాని గురించి మీరేం గుర్తించారు?
19. ఇంటర్నెట్లో తెలుగు సాహిత్యాన్ని తెలుగుభాషలోనే చదువుతారా ?లేదా ఇతరభాషల్లో చదువుతారా?
*. తెలుగును తెలుగు లిపిలో చదవడం
*. తెలుగును ఇంగ్లీషు లిపిలో చదవడం
* తెలుగును ఇంగ్లీషు భాషలో చదవడం.
* తెలుగును ఇతర భాషల్లో చదవడం.
౨౦. తెలుగు సాఫ్ట్ వేర్ మొదట ఎప్పుడు ,ఎవరు కనుగొన్నారు?
21. తెలుగులో మొదటి బ్లాగర్ ఎవరు?
౨౨.తెలుగులో మొట్టమొదటి వెబ్ సాహిత్య పత్రిక ఏది?
౨౩. భవిష్యత్తులో తెలుగు సాహిత్యం ఇంటర్నెట్లో ఎంతగా అభివృద్ధి చెందబోతుంది. ప్రింట్ మీడియాకి,నెట్ సాహిత్యానికి ఎటువంటి పోటీ ఉండబోతుంది.?
౨౪. నెట్ వాడకందార్లు తెలుగుని ఎలా ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారు?
౨౫.స్తీలకోసం , పిల్లల కోసం ప్రత్యేకించిన పత్రికలు , లేదా మరేవైనా కొత్త పత్రికలు మీ దృష్టి కి వస్తే చెప్పండి.

Monday, February 15, 2010
Wednesday, December 23, 2009
క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ గురించి చాలా రాద్దామని చాలారోజులముందే ప్రయత్నాన్ని ప్రారంభించాను. తీరా ఈ రోజు 23వ తారీఖు. ఇక రాయడం కుదరుదుకాని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపగలను.
మళ్ళీ అంతర్జాలానికి ఎప్పుడు వస్తానో కూడా తెలియదు.
క్రీస్తు జయంతి
విశ్వమానవాళికీ
శాంతి, సౌభాగ్యాల నెలవు కావాలని
ఓ క్రొత్త తార వెలుగు
ఓ క్రొత్త దూతల పిలుపు
హృదయాలలో
గృహాలాలో వెలుగొందాలని
క్రిస్మస్ శుభాకాంక్షలు
Tuesday, September 9, 2008
నా బ్లాగుకు సెలవులు ... కొన్నిరోజులు
Monday, May 12, 2008
మనమూ మన అలవాట్లు
మా కంపెనికీ గతవారంలో విదేశీ అథిదులు మూడు ధఫాలుగా వచ్చారు. వారిని తోడ్కనిరావటానికి విమానాశ్రయానికి నేను వెళ్ళటం జరిగింది. నాతోపాటు ఒక విదేశీ అథిది కూడా వున్నారు. మాకు కలిగిన రెండు అనుభవాలు మీ ముందుంచాలని ఈ ప్రయత్నం.
9.5.2008న రాత్రి 10.30 గంటల సమయం, స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాదు.
ఇద్దరు విదేశీ అథిదులతో రెండవ ప్లోరులో నిలబడి వున్నాము. ఇద్దరూ సిగరెట్టువెలిగించి ఎదో మట్లాడుకుంటున్నారు. ఒక కుర్రాడు మాదగ్గరికి వచ్చి ఒక సిగరెట్టు ఇస్తారా ప్లీజ్.. అంటూ అడగటం మొదలెట్టాడు. వారికి ఏమి అనాలో అర్థం కాక నా వైపు తిరిగి చూసారు. సిగెరెట్టు అడుగుతున్నాడనిచెప్పాను. అంతలో కుర్రాడే చెప్పడం మొదలు పెట్టాడు. సార్ గటనుంది సిగరెట్టుదుకాణం(షాప్) కోసం వెదకుతున్నాను, ఎక్కడా కనబడలేదు, నాలుక పీకేస్తుంది అందుకనే అడిగాను అన్నాడు.
వాళ్ళు( అథిదులు అతనికి సిగరెట్టు ఇచ్చారు.)
11.5.2008 ఆదివారము రాత్రి : 11 గంటల సమయం స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
కౌలాలంపూర్ నుంచి రావలసిన విమానానికి ఇంకా సమయం వుండటంతో అథిది సిగరెట్టు కాలుస్తూ బయట తిరుగుతున్నాము. అంతలో 35-40 సంవత్సరాల మద్య వయస్సున్న వ్యక్తి వచ్చి అగ్గిపెట్టెవుందా అని అడిగాడు. జేబులోంచి తీసి ఇస్తూ అదోలా నావంక చూసాడు. నాకేమీ అర్థం కాలేదు. అగ్గిపెట్టి ఆదిగిన తను తన సిగరెట్టు వెలిగించుకొని, అగ్గిపెట్తె ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగాడు.
సిగరెట్టు కాల్చే అలవాటు అవసరం తెలిసినప్పుడు దగ్గర పెట్టుకోవాలని తెలియదా?
విచారమైన వింతమొఖం పెట్టి విదేసీయులను అడగాలని ఎలా అనిపిస్తుంది ... అని నన్ను అడిగాడు.
నిజానికి నాదగ్గర ఏ జవాబు దొరకలేదు.
అలావాట్లను నియంత్రించుకోలేమా అని నాకు అనుమానం కలిగింది
----
2916

Sunday, May 4, 2008
నేనెందుకు బ్లాగాలి???

బ్లాగుల్లో ఎందుకు రాయాలి?
బ్లాగుల నిర్దిష్ట లక్యం ఏమిటి?
బ్లాగుల్ని ఎవరు చదువుతారు?
చదివేవారు రాసేవారి భావజాలానికి, ఆలోచనకీ సమీపంగా వుంటారా??
బ్లాగులు రాయటం స్వలాభమా? సాంకేతిక లాభమా?? తెలుగుకు లాభమా???
బ్లాగులు కాలక్షేప రచనలా?
బ్లాగులు సమచార భాండాగారాలా???
బ్లాగులు సాహిత్య నిలయాలా???
అయినా రాస్తున్న బ్లాగ్‌రాతలను అభినందించే వాళ్ళాకోసం ఎదురుచూపులమద్య హటాత్తుగా దుమ్మురేపుకుంటూ దూసుకువచ్చి అభిప్రాయ భాణాలను వదిలే పేరే చెప్పలేని వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి?
ఒక్కోసారి మన ప్రక్కనవున్నవారే మన రాతాల సౌరభాన్ని ఆస్వాదిస్తున్నారో లేదోనని సందిగ్దాలనడుము ఏమి రాయాలి అనే మీమాంస.
మరోసారి అదేపనిగా పొంగుకొచ్చేభావాలను రాతల్లోకి మార్చి బ్లాగులు నింపితే విసుగుచెంది ఇటువైపే చూడని బ్లాగ్వీక్షకులు.
ఎప్పుడైనా పదుగురు కూడి మాట్లాడుకొనేటప్పుడు మాటవరసకైనా ఎవరిని గురించి మాట్లాడితే ఏమౌతుందొనని భయం.
నాలుగక్షారలు పేర్చి నలుగురుకూ కనపడేచోట అతికించాలంటే నావాళ్ళే గుర్తుకొస్తారు.
ఇలా ఎన్నో ఆలోచనలు మనసును తొలుస్తూనే వున్నాయి.
అయినా ఏదో నా మనసుకు నచ్చింది రాస్తూనే వుంటాను.
Tuesday, April 22, 2008
చిరునామా చెప్పని మరణం
పనిచేసున్నప్పుడు జరిగిన చిన్న ప్రమాదంలో ఒక పని వానికి దెబ్బలు తగిలితే ఈ రోజు అనుకోకుండా ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. అతన్ని డాక్టరు పరిక్శిస్తున్నారు నేను ఇంకొంతమంది బయట నిరీక్షిస్తున్నాము. ఇంతలో ప్రవేశద్వారం వద్ద కలకలం మొదలయ్యింది. ఏమా అనిచూస్తే ఓ పెద్దావిడకు ప్రమాదం జరిగింది. డాక్టర్లు, నర్సులు పరుగెత్తారు ఆక్సిజన్ పెట్టారు, సెలైను పెట్టారు. కానీ ఆవిడ ఎవరో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. వస్త్రధారణను బట్టి చూస్తే ముస్లిం మహిళగా కనిపిస్తుంది. చేతులకు రెండేసి చొప్పున బంగారు గాజులు, చెవులకు రాళ్ళ దిద్దులు, మెడలో గుళ్ళ(బంగారం) దండవున్నాయి. చేతిలో వున్న చిన్న గుడ్డ సంచిలో కొత డబ్బు, కొన్ని పాన్ మసాలాలు వున్నాయి. ఎంతవెతికినా చిరునామా ఎవరిది దొరకలేదు. డాక్టర్ల కొంత ప్రయత్నం తరువాత కొద్దిగా కళ్ళు తెరిచి ఎదో చెప్పాలని ప్రయత్నించి, ప్రయత్నించి మళ్ళీ కళ్ళు మూసేసింది. అదే చివరి చూపని తరువాత తెలిసింది.
ఎదురుగా వున్న పోలీసు స్టేషునునుండి వచ్చిన కానిస్టేబులు పంచనామాలు రాసుకుంటున్నాడు. అప్పటివరకూ ఆత్రంగా గుమికూడిన వాళ్ళంతా ఒకొక్కరుగా ఆ ప్రదేశాన్ని ఖాళీచేసారు. అప్పుడక్కడ నిశ్శబ్దం మెల్లగా పరచుకోవడం మొదలయ్యింది.
ఎవరో ఓ తెల్లని వస్త్రాన్ని(కఫన్) ముఖంమీదుగా కప్పారు.
నాలో ఏదో ఆలోచన సుడులు తిరగటం మొదలయ్యింది. ఎక్కడెక్కడో మాటల హుకుంనామాను జారీచేసిన దేహం ఇప్పుడు నిశ్శబ్దంగా, నిరాశ్రయంగా పడివుంది.
చిరునామాని తనలోనే దాచుకొని ఎటో వెళ్ళిపోయింది ప్రాణం

Friday, April 4, 2008
బత్తి బంద్ - విద్యుత్ ఆదాచేయండి
ఈ మద్య ఆదివారం వరంగల్ వెళ్ళాను. ఉదయమే సికింద్రాబాదునుండి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను.ఖాజీపేట సుమారు 9.30 గంటలకుచేరింది.
ఫ్లాట్‌ఫారం మీదవున్న ఏదో రైల్వే వారి ఆఫీసు గోడపై ఒక నినాదం కనిపించింది.ఫోటో తీద్దామని బాగ్ తెరిచోలోపు త్రైను కదిలిపోయిందిఎవరైనా కెమేరా వున్నవాళ్ళు, ఖాజీపేట్ దగ్గరవారు ఆ నినాదాన్ని ఫోటో తీసి పెడతారా?? (ఇంకా వేరే స్టేషనులో వుందేమో తెలియదు)
నినాదం :
విద్యుత్తు ఒక యూనిట్ ఆదాచీస్తీ

ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తిచేసినట్టే.
బత్తి బంద్ వివరాలు మరికొన్ని చదవండి
http://battibandh.wordpress.com/
Monday, March 17, 2008
కవితా వార్షిక 2007
కవితా వార్షిక ౨౦౦౭లో చోటుచేసుకున్న కవులకు శుభాభినందనలు
ఆవిష్కరణ ౩౦.౩.౨౦౦౮ ఆదివారము వరంగల్లులో
ఆవిష్కర్త శ్రీ శివారెడ్డి
అందరికి ఆహ్వానం అని తెలియ చేస్తున్నారు సృజనలోకం, వరగల్లు వారు

Monday, February 25, 2008
మనసంతా ఎదోలా అయిపోయింది
వరుసగా రెండు ఎలిజీలు రాయాల్సిన అవసరం కలిగేసరికి మనసంతా ఎదోలా అయిపోయింది
జీవితం ఎంత చిన్నది?
జీవం ఎంతలో ఎగిరిపోతుంది?
జీవనంలో ఏమి మిగిల్చిపోతున్నాము? అనే ప్రశ్నలు
ఉన్నంతలో ఏదో ఒకటి చేయాలన్న ఆశ
కొత్త ఆలోచనల్ని చిగురింపచేస్తుంది.

Tuesday, February 5, 2008
నేను నా బ్లాగ్ రచన
నేను నా బ్లాగ్ రచన
1997లో మద్యపాన వ్యసనాన్ని మానేయాలని ప్రయత్నాలు ప్రారంబించాను. అప్పుడే కంప్యూటరు నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. రెండు, మూడు చోట్ల చేరాను. కాని నా ఫీజు వాపసు ఇచ్చిమరీ నన్ను బయటకు తోసేసారు. ఎందుకంటే నేను క్లాలో వయసులో పెద్దవాణ్ణి కావటం. నాకు కలిగే సందేహాలవల్ల క్లాసుకు ఇబ్బంది కలుగుతుందని. ఇక నేర్చుకోవాలనే ప్రయత్నం ఇంటరునెట్టుమీద పడ్డాను. తాజ్మహల్ ఫోటోలు ఆల్బం గా పెట్టాడం మొదలు పెట్టాను. అలా అలా పేజిలి పేజిలుగా జియోసిటిలో పెట్టడం జరిగింది. తెలుగు పెట్టాలని తెలుగులో రాయాలని చాలా ప్రయ్నం చేసాను కాని 2003 నాటికి ఆ ప్రయత్నాలు సఫలం కాకపోయేసరికి కొంత నిరుత్సాహం కలిగింది. డిటిపి చేయించి వాటిని ఇమేజ్‌లుగా పెట్టడం జరిగింది, కాని ఖర్చుతో కూడుకున్న పని అవటంవల్ల కుంటు పడింది.
మళ్ళీ ఇప్పుడు ఇలా బ్లాగులు ఎదురయ్యాయి.
వయసు మీదపడుతుంది నాకు ఎందుకు అనుకున్నప్పుడు పద్మనాభంగారిని చూసి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాను.
బ్లాగుల్లో సాహిత్యం దొరుకుతుందా అని సందేహపడుతున్నప్పుడు రాధికగారి బ్లాగు(స్నేహమా) నన్ను కంప్యూటరుకు కట్టి పడేసింది.
నా బ్లాగులో అనామక వాఖ్యానాలను చూసి మానేద్దం అనుకున్నప్పుడు విస్త్రుతంగా బ్లాగులు రాస్తున్న జ్యోతిగారి బ్లాగుచూసి ఆశ్చర్యానికి లోనయ్యి, మనసును మళ్ళీ బ్లాగులవైపు మళ్ళించాను.
సమయం దొరకడంలేదు ఎలా అనుకుంటున్నప్పుడు
ఈనాడు వ్యాసం సరికొత్త అవసరాన్ని గుర్తు చేసింది.

Friday, January 25, 2008
నా బ్లాగ్వీక్షకులకు వినతి
నా బ్లాగునుండి మీరు యేమి ఆశించవద్దు.నేను ఏమి పంచుకోవాలనుకుంటున్నానో, దాన్ని చూడండి.పత్రికల్లో రాయలేనివి, పత్రికల్లో ప్రచురణ కానివి ఇక్కడ టపాలుగా పెడుతున్నా.బ్లాగులవెనుకున్న రహస్యాలు, సాంకేతికాలు, ఇతర విషయాలు కూడా గమనించగలరు.రుచులకు, అభిరుచులకు బ్లాగులలో పూర్తి స్వేచ్చవున్నది, ఆస్వాదించండి. ప్రోత్సాహించండి.ప్రస్తుతం బ్లాగర్లు 1000+ మంది మాత్రమే. గమనించండి ప్రోత్సహించండి. ప్రోత్సహించాల్సిన అవసరం గుర్తించండి.
Thursday, January 24, 2008
నెలనెలా వెన్నెల
మీరు ఈ ఆదివారము హైదరాబాదులోవుంటే
నెలనెలా వెన్నెల
సాహితీమిత్రుల కలయిక
ప్రతీ నెలా ఆఖరి అదివారము జరుగుతుంది.
ఈ నెలలో २७.१.२००८ సాయంకాలము 5 గంటలనుండి
చిరునమా
శ్రీ సి.వి. కృష్ణా రావు, సంహిత కాలేజీ దగ్గర, ఆశ్‌మాన్ ఘడ్,దిల్‌షుక్‌నగర్,(టివి టవర్ సమీపంలో)
దూరవాణి : 040-24069599
-------------------
జాన్ హైడ్ కనుమూరి 9912159531

Wednesday, January 23, 2008
పుస్తకావిష్కరణ
కవనమార్గం
...ధింసా
వ్యాసాల సంపుటి
ఆవిష్కర్త : దేవిప్రియ
సభాధ్యక్షులు : కె. శివారెడ్డి
పుస్తకపరిచయం : ఎన్. వేణుగోపాల్
స్థలము : ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్, హైదరాబాద్.
తేది : 22.01.2008, సాయంకాలము 6 గంటలు
36 వ్యాసాలున్నాయి,
వెల : రూ. 125/- $20
దొరకుచోటు : విశాలాంద్ర, దిశ, నవోదయ పుస్తక శాలల్లో
మరియు

Monday, January 21, 2008
అయ్యలారా! అమ్మలారా!
అయ్యలారా! అమ్మలారా!
గురువులారా! శిష్యులారా!అభిమానులారా! విమర్శకులారా!
చిన్న విన్నపము
నేను మృదులాంతరముతో పనిచేస్తున్నవాణ్ణి కాదు.
నేను పనిచేస్తున్న చోటులో అప్పుడప్పుడూ టపాలను చూసే బాద్యత వుండటం వలన మృదులాంతరము వాడవలసిన అవసరం ఏర్పడింది.
ఇక నా చదువు గురించో మాట.పదవతరగతిలో తెలుగు బోధకునికి భయపడి తరగతులు చాలా ఎగ్గొట్టిన సందర్భాలు వున్నాయి. ఆభయమే ఇంటర్మీడియెట్‌లో రెండవ భాషగా తెలుగుకు బదులు హిందీ తీసుకొనేటట్టు చేసింది. అదీ పూర్తిగా వంటబట్టిందని నమ్మకంలేదు. కాలేజీలో పూర్తిచెయ్యని డిగ్రీ సార్వత్రిక విద్యద్వారా పూర్తిచేసి, తర్వాత 'లా'లో దాఖలా అయ్యాను.
మద్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగపూర్ దగ్గర చింద్వాడ ఇలా అనేక చోటులలో వివిధ రకాల పనులుచేసాను. వీటన్నింటి మద్య తెలుగు సాహిత్యం మీద, అందులోనూ కవిత్వం మీద ఎందుకు మక్కువ ఏర్పడిందో నాకే అర్థం కావటంలేదు.కాకపోతే నా జీవిత, జీవన సమస్యల మద్య తగులుకున్న మద్యపాన వ్యసనాన్ని వదిలివేయడనికి కవిత్వం మంచి ఆసరానిచ్చింది.అప్పటినుండే రాయటం మొదలయ్యింది.
సాహిత్యంలొ వున్న పరిస్తితులను చూసి ఎందుకు రాస్తున్నాను నేను రాయటం అవసరమా అని మానేద్దాం అనుకునే సమయంలో ఏదో ఒక సంఘటన మళ్ళీ రాసేటట్టు చేస్తుంది।అలాంటి ఒకానొక సమయంలోనే ఈ బ్లాగులు పరిచయమయ్యాయి। గత కొన్ని మాసాలుగా ఏ పత్రికలకి నా రచనలు పంపలేదు।చిందరవందరగా పడివున్న నా అక్షరాల గీతలను నాకోసం మృదులాంతరం చేస్తున్నాను. ఎప్పుడైనా చదువుకోవచ్చని. మీకు నచ్చితే చిన్నగా భుజం తట్టండి. అంతే గాని ఇందులోకి ఎందుకు వచ్చాను అనుకునేలా చెయ్యకండి.

Friday, December 28, 2007
ఒక్కో సంఘటన ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో?

నిన్న ఇంటికిచేరేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది. పిల్లలు విద్యాపోరాటాల్లోచి ఇంకా గూటికి చేరలేదు. నా శ్రీమతికి బాగోలేదంటే కొంచెం టీ వేడిచేసి నా ఆవిడకిచ్చి, ఏదైనా కూరచేద్దామని ఉల్లిపాయలు కోస్తున్నా. అలవాటులేకపోవటంవల్ల కళ్ళవెంబడి నీళ్ళు (ఏడుస్తున్నట్టు) కారుతున్నాయి. నా ఆవిడ టి.వి. పెట్టి ఛానల్సు మారుస్తుంది. ఏదో న్యూస్ చానల్ వద్ద నా దృష్టి పడింది ఆపమని అరిచాను. ఆశ్చర్యం, నోటమాట రాలేదు. నేను కళ్ళు తుడుచుకోవడం నా ఆవిడచూసి వార్తచూసి ఏడుస్తున్నా అనుకుంది.
"అది బేనజీర్ భుట్టో మరణవార్త"
---
బరువెక్కిన మనస్సుతో చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎప్పటిదో (బహుశ 1982లొ జరిగిందనుకుంట) సంఘటన జ్ఞాపక మొచ్చింది.
నా పెద్దవదిన నేను ఒకే వయస్సువాళ్ళం కావటంవల్ల 6 వ తరగతినుండీ స్నేహితుల్లా వుండే వాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే వుండే వాళ్ళం. ఉద్యోగవేటలో జబల్పూర్ వద్ద పనిచేస్తున్నప్పుడు అన్నయ్య, వదిన ముగ్గురు పిల్లలు నేను కలిసి వుండే వాళ్లము. చాలా స్నేహితుల్లాగే వుండే వాళ్ళము.
అప్పుడె ఒకానొక సంఘటాన జరిగింది. నాపై లేనిపోని అపవాదుతో దుష్ ప్రచారము జరిగింది. అవతలివారి పక్షాన నా వదిన మాట్లాడటంతో అప్పుటి వరకూ స్నేహగావున్న మా అనుబధం ఒక్కసారిగా తెగిపోయింది. మా మద్య అగాధం ఏర్పడింది. సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఆ అగాధం మరింత పెరిగిపోయింది. ఈ సంఘటన దాదాపు మరిచిపోయినా, దుష్ ప్రచారాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోయినా ఆ సంఘటన చేసిన అగాధం గాయంగా మిగిలిపోయింది.
చిన్న సంఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి మంచిస్నేహితురాల్ని పోగొట్టుకున్నాను. అప్పుడప్పుదూ ఎదురుపడుతున్నా ఏదో వెలితివెలితిగానే సంభాషణ సాగిపోతున్నయి.

చిన్న సంఘటనే జీవితంలో ఇంతప్రభావాన్ని చూపితే "భీభత్స మరణాల" సంఘటనలు దేశనికి, పొరుగు దేశాలకు, ప్రపంచానికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో కదా???
Saturday, November 17, 2007
కళాసౌందర్య విలువలు గల చిత్రం - చర్చించండి

http://aparanjifinearts.blogspot.com/2007/11/blog-post_15.html

చెరువులు చేపలు
క్రతువులు ఋతువులు
మట్టిలో జీవం
పొగలా అల్లుకొనే మంచు
లేత కిరణానికి వంగుతున్న కిరణపు రంగులు
వర్షా కాలమోశరత్ కాలమో
ఎగిరే చేపపిల్ల చురుకు
వడిసి పట్టుకోవడం
బాల్యమైనా జీవితానికి సన్నని జ్ఞాపకాలు
తీరం తెలియని దారుల్లో
వెతికేది పిల్లచేపో పెద్దచెపో
కూర కొస్తుందో రాదో
అయినా కవ్వించే జ్ఞాపకాలకోసం
కాలమంత నిరీక్షణ
చేతిగేలమో విసురు గేలమేసినా
పిత్తపరిగల చీర వలలోరొయ్యవలలో
ఏదీ దొరకనివేళ మిగిలిన కవ్వింత
గాలి సవ్వడి
జ్ఞాపకం కావలంటే అనుభవం కావలసిందే!
అద్భుత కాల సమ్మేళనాల గిలిగింత
జ్ఞాపకమోక పులకింత
పరివ్యాప్త కవితా సంకలనం

పరివ్యాప్త కవితా సంకలనం
సంపాదకురాలు : జ్వలిత
ఆవిష్కర్త : రామాచంద్రమౌలి
కాలాన్ని జయిస్తూ నేను - కవిత్వం - జ్వలిత
ఆవిష్కర్త : శ్రీమతి దుర్గారాశి లక్ష్మి
అద్యక్షులు : మండవ సుబ్బారావు
పాల్గొన్నవారు :
ప్రజాకవి జయరాజు, మద్దెల శివకుమార్, కోవెల సుప్రసన్నాచార్య, సాధనాల వెంకటస్వామినాయుడు,
జాన్ హైడ్ కనుమూరి
స్థలం : కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
Subscribe to:
Posts (Atom)