Tuesday, February 5, 2008

నేను నా బ్లాగ్ రచన

నేను నా బ్లాగ్ రచన
1997లో మద్యపాన వ్యసనాన్ని మానేయాలని ప్రయత్నాలు ప్రారంబించాను. అప్పుడే కంప్యూటరు నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. రెండు, మూడు చోట్ల చేరాను. కాని నా ఫీజు వాపసు ఇచ్చిమరీ నన్ను బయటకు తోసేసారు. ఎందుకంటే నేను క్లాలో వయసులో పెద్దవాణ్ణి కావటం. నాకు కలిగే సందేహాలవల్ల క్లాసుకు ఇబ్బంది కలుగుతుందని. ఇక నేర్చుకోవాలనే ప్రయత్నం ఇంటరునెట్టుమీద పడ్డాను. తాజ్మహల్ ఫోటోలు ఆల్బం గా పెట్టాడం మొదలు పెట్టాను. అలా అలా పేజిలి పేజిలుగా జియోసిటిలో పెట్టడం జరిగింది. తెలుగు పెట్టాలని తెలుగులో రాయాలని చాలా ప్రయ్నం చేసాను కాని 2003 నాటికి ఆ ప్రయత్నాలు సఫలం కాకపోయేసరికి కొంత నిరుత్సాహం కలిగింది. డిటిపి చేయించి వాటిని ఇమేజ్‌లుగా పెట్టడం జరిగింది, కాని ఖర్చుతో కూడుకున్న పని అవటంవల్ల కుంటు పడింది.
మళ్ళీ ఇప్పుడు ఇలా బ్లాగులు ఎదురయ్యాయి.
వయసు మీదపడుతుంది నాకు ఎందుకు అనుకున్నప్పుడు పద్మనాభంగారిని చూసి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాను.
బ్లాగుల్లో సాహిత్యం దొరుకుతుందా అని సందేహపడుతున్నప్పుడు రాధికగారి బ్లాగు(స్నేహమా) నన్ను కంప్యూటరుకు కట్టి పడేసింది.
నా బ్లాగులో అనామక వాఖ్యానాలను చూసి మానేద్దం అనుకున్నప్పుడు విస్త్రుతంగా బ్లాగులు రాస్తున్న జ్యోతిగారి బ్లాగుచూసి ఆశ్చర్యానికి లోనయ్యి, మనసును మళ్ళీ బ్లాగులవైపు మళ్ళించాను.
సమయం దొరకడంలేదు ఎలా అనుకుంటున్నప్పుడు
ఈనాడు వ్యాసం సరికొత్త అవసరాన్ని గుర్తు చేసింది.

1 comment:

జ్యోతి said...

వెరీ గుడ్ జాన్ గారు,

అనామకుల వ్యాఖ్యలు బెదిరిపోతే ఎలాగండి. మనల్ని అనడానికి, వెలేత్తి చూపుతున్నారే వాళ్ళకి తమ పేర్లు చెప్పుకునే ధైర్యం కూడా లేదు. మీరెందుకు బాధపడడం. మీ బ్లాగింటికి పట్టీన బూజు అనుకుని దులిపేసి, మీ పని మీరు చేసుకోండి...