నా బ్లాగు చదివే మిత్రులందరికి నమస్కారాలు
నలుదిక్కులనుండి నా బ్లాగు చదువుతున్నారని తెలుస్తూనేవుంది

ప్రకృతిలో వాన ఒకభాగం ఎప్పుడయ్యిందో తెలియదు కానీ, ప్రతి మనిషికి జీవితంలో బాల్యంనుంచి వృద్దాప్యం వరకు ఏదొక అనుబంధమో, అనుభవమో, అనుభూతో వుండే వుంటుంది. వానలో ఆటలు, తడవటాలు ఆ గొప్ప అనుభవం బాల్యానిదే.
అనుభవాలు ఆలొచనలు, అవగాహనల మధ్య యవ్వనంలో వానపై చిత్రం మారుతుంది.
ఇక బాధ్యతల జీవితం మొదలయ్యాక వాన యాంత్రికమై పోతుంది. చదువులతో అనుబంధం మొదలయ్యాక భూమికోణంనుంచి వానను చూడటమే కరువైపోతుంది. ఇక తీరాలవెంట వలసపోతున్న వారు వానను మర్చిపోజేసే వాతావరణంలోకి నెట్టబడుతుంటారు. ఒక్కోసారి వానకోసం రైతుమాత్రమే ఎదురుచూసే ప్రహసనంగా మారిపోతుంది
కొన్నిసార్లు :
చినుకులతో మొదలయ్యిన వాన కురి కురిసీ, తడిపీ తడిపీ చేదు జ్ఞాపాలను మొలకెత్తిస్తుంది. వాన ఉదృతమై తుఫానుగా మారి జీవితాలను మార్చేస్తుంది.
***
బాల్యంలో వానలో ఆడుకున్న ఆటలు
యవ్వనంలో మిత్రులతో కలిసి తడిసిన క్షణాలు
వానను ఆనందిస్తూనో, తిట్టుకుంటూనో కుచ్చిళ్ళు పైకి పట్టుకొని నడుస్తుంటే
కళ్ళతోటే చిత్రిస్తున్న వలపు చిత్రాలు
వెలిసిన వాన వరదౌతుంటే
అందించిన సహాయ సహకారాలు
నాకు తారసపడిన అక్షరాలు
నన్ను వెంటాడాయి
***
ఇప్పుడు నేను వానలొ తడవలేను అందుకే ఈ అక్షర ప్రయత్నం
***
ఇప్పటికి ఓ ముప్పైమంది స్పందించారు తమ అక్షరాలతో
మీరూ ఇందులో తడవాలనుకున్నా, మమ్మల్ని తడపాలనుకున్నా
ఇక ఎందుకాలస్యం
కొన్ని అక్షరాలను ఆలోచనా మబ్బుల్లోకి వెదజల్లండి
చినుకులో, తుంపర్లో
తప్పని సరిగా వర్షిస్తాయి
***
పేసుబుక్కో, బ్లాగో ఎక్కడో ఒకచోట పోస్టుచెయ్యండి
ఆవిషయం నాకు తెలియచెయ్యండి.
***
ఈ సంకలనం గురించి మీ మిత్రులకు తెలియచేయండి.
నిబంధనలంటూ ఏమీలేవు
***
అన్నీ కలిపి త్వరలో
" అంతర్జాలంలో వాన/వర్షం "
ఈ సంకలనం చేద్దాం
స్పందిస్తారు కదూ!
అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి
john000in@gmail.com