Showing posts with label జమున - సత్యభామ - తాజ్ మహల్. Show all posts
Showing posts with label జమున - సత్యభామ - తాజ్ మహల్. Show all posts

Thursday, August 30, 2012

జమున - సత్యభామ - తాజ్ మహల్


జమున - సత్యభామ - తాజ్ మహల్

* * *

ఈ రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఎఫ్.ఎం వినడం జరిగింది, అందులో విన్న విషయం ఈ రోజు జమున పుట్తిన రోజని.
కొన్ని జ్ఞాపకాలు వెంటాడాయి. ప్రొద్దున్నే నాల్గు మాటలు రాదామనుకున్నా, కాని విద్యుత్తు కోత తర్వాతి పనులతో అది కాస్తా ఇప్పటికి కుదిరింది.

తెలుగు సినీ జగత్తును ప్రేక్షకులను అందంతో, అభినయంతో కట్టి పడేసిన సత్యభామ.

1979లో ఒక సారి ఏలూరునుండి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లొ హైదరాబాదు వెళుతున్నాను. అప్పట్లో రాత్రి ప్రయాణానికి గోదావరి ఒక్కటే ట్రైన్. బస్సులు కూడాలేవప్పుడు. నాకు క్రింది బర్త్ రిజర్వేషన్ దొరికింది. విజయవాడ వచ్చేసరికి స్ట్రేషనులో ఒకటే హడావిడి. జమున వచ్చిందని ఈ ట్రైన్ ఎక్కుతుందని. నేనూ చూద్దామని ఫ్లాట్ ఫారం అంతా వెదికాను కాని కనబడలేదు. ఉస్సూరు మంటూ నా సీటులో కూలబడ్డాను. అప్పుడు ఓకరెవరో వచ్చి కొంచెం పై బర్తుకు సదురుకుంటారా అని అడిగారు. వెంటనే కాదని చెప్పాను. తర్వాత కొద్దిసేపటికే తెలిసింది ఆ బర్త్ జమునకోసం అడిగారని. తెలిసినవెంటనే ఎగిరి గంతేసి ఒప్పుకుని... పలకరించి, ఆటోగ్రాఫ కోసం ఏదైనా వెదికాను బ్యగులో ఏమి దొరకలేదు. వెంటనే తెలుపు గళ్ళ కొత్త లుంఘి వుందని గుర్తుకు వచ్చి దానిపై ఆటోగ్రాఫ్ తీసుకున్నా. చాలా రోజులు దాన్ని వాడలేదు.
ఎంతమందికి అపురూపంగా చూపించానో.
తర్వాత ఎప్పుడు ఎలా వాడానో గుర్తులేదు మళ్ళీ ఇప్పుడు గుర్తుకు వచ్చింది.

***
1990, 1992 రండు సార్లు ఆగ్రా వెళ్ళాను. తాజ మహల్‌ను చూసివచ్చాను.



1999, 2000లలో "మూడ్స్ ఇన్ లవ్" కొన్ని ఫొటోలకు తెలుగు క్యాప్‌షన్స్ రాసాను. జియోసిటీలో పెట్టాను  కానీ ఇప్పుడు ఆ సైటు లేదు. అవి రాస్తున్న సమయంలో సత్యభామను గురించి చదివాను. మళ్ళీ సత్యభామనగానే జమున గుర్తుకు వచ్చేది.

తాజ్‌మహల్‌లోని విశిష్టత సమయాలను బట్టి వేర్వేరు రంగుల్లో కనబడుతుంది. నాట్యంలోవున్న అష్టవిధ నాయికలు తమ తమ అభివ్యక్తిని చూపించడానికి నేర్పే భంగిమల్లాగా తాజ్‌మహల్ అనిపించింది. అలాంటి లక్షణాలను ఎక్కువ సత్యభామలోనే కన్పించాయి. మళ్ళి అక్కడా జమునే ప్రత్యక్షం.


* * *


జ్ఞాపకాలను ప్రోది చేసుకుంటూ శుభాకాంక్షలు. అధుత నమస్కారాలు, అద్భుత అభినయానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.