http://aparanjifinearts.blogspot.com/2007/11/blog-post_15.html
చెరువులు చేపలు
క్రతువులు ఋతువులు
మట్టిలో జీవం
పొగలా అల్లుకొనే మంచు
లేత కిరణానికి వంగుతున్న కిరణపు రంగులు
వర్షా కాలమోశరత్ కాలమో
ఎగిరే చేపపిల్ల చురుకు
వడిసి పట్టుకోవడం
బాల్యమైనా జీవితానికి సన్నని జ్ఞాపకాలు
తీరం తెలియని దారుల్లో
వెతికేది పిల్లచేపో పెద్దచెపో
కూర కొస్తుందో రాదో
అయినా కవ్వించే జ్ఞాపకాలకోసం
కాలమంత నిరీక్షణ
చేతిగేలమో విసురు గేలమేసినా
పిత్తపరిగల చీర వలలోరొయ్యవలలో
ఏదీ దొరకనివేళ మిగిలిన కవ్వింత
గాలి సవ్వడి
జ్ఞాపకం కావలంటే అనుభవం కావలసిందే!
అద్భుత కాల సమ్మేళనాల గిలిగింత
జ్ఞాపకమోక పులకింత
No comments:
Post a Comment