జ్ఞాపకాలను తాజా పరచుకుని దానిద్వారా
దేవుడు చేసిన మేళ్ళనుబట్టి స్తుతించడానికి
దేవుడు సమయాలను ఇస్తుంటాడు. ఆ సమయాలలో ఎవరైతే ఉంటారో వారికే జ్ఞాపకానుభవం ఉంటుంది.
4.6.2014 at LIG, RC Puram, Hyderabad
గత సంవత్సరం మనమధ్య వున్న నాన్న ఈ రోజు
లేరు,
4.6.2013 at LIG, RC Puram, Hyderabad
అయినా ఇదే రోజు నాటి జ్ఞాపకం ఉంది.
1984 నాటి కొన్ని సంగతులను పిల్లలముందు
పంచుకోవడానికి సమయమిచ్చినందుకు దేవునికి వందనాలు.
1984 నాటికి నేను మధ్యప్రదేశ్, జబల్పూర్
వద్ద పనిచేస్తున్నాను. అక్కడనుంచి హైదరాబాదు వచ్చి, హైదరాబాదునుండి నేరుగా నల్గొండ
పెళ్ళికి వెళ్ళడం జరిగింది.
వెళ్ళగానే నాన్నను కలిసి రెండువేల రూపాయలను
ఆయన చేతిలో పెట్టాను. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత వేరే సందర్భంలో కూడా తన ఆశ్చర్యాన్ని
నాన్న నాతో పంచుకున్నారు.
జబల్పూర్ నుండి మళ్ళి జబల్పూర్ వెళ్ళే
వరకు ఐదు రూపాయల కొత్త కట్టను కర్చు పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనిది.
ఇప్పటి ఉద్యోగారీత్యా నెలకు కొన్ని లక్షలను
జీతాలుగా ఇస్తూవుంటాను, కానీ దానిలో ఎప్పుడూ ఆనంద ఆశ్చర్యాలు లేవు గాని ఆ అయిదు రూపాయాల
కట్టను (రూ.500/-) ఖర్చు పెట్టడం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా గొప్ప అనుభవం అనిపిస్తుంది.
***
లింకన్ అన్నయ్య పక్షవాతంతో
(Sept.2001) NIMSలో ఉన్నప్పుడు పరిచర్యకోసం ఎక్కువ సమయం నేను గడిపాను. ఇంటికి వచ్చేవరకూ ప్రతినిముషం ఇదే చివరి నిముషం అనిపించేంత
ఉత్కంఠ అనుభవం.
రెండు ప్రత్యేకమైన అనుభవాలు
ఒకరోజు మధ్యాహ్నం ఎక్కిళ్ళు ప్రారంభమయ్యాయి.
మొదట ఒక టానిక్ ఇచ్చారు తగ్గలేదు, ఇంజెక్షను చేసారు తగ్గలేదు. సాయంత్రం అయిదు ఆ ప్రాంతంలో
నర్సు చెప్పింది ఫీజ్డ్ సెలైన్ తెమ్మాని. NIMS బయటికి వచ్చి మూడు గంటలపాటు షాపులన్నీ తిరిగాను గని
ఫ్రీజ్డ్ సెలైన్ దొరకలేదు.
వార్డులోకి వస్తుండగా చెప్పారు వార్డ్
మెడికల్ రూములో ఫ్రిజ్ వుందిగా అందులో పెడితే ఫ్రీజ్ అవుతుంది కదా అని. తీరా అక్కడికి
వెళితే నర్సు తాళంవేసి ఎటో వెళ్ళిపోయింది. తాళం దొరికేసరికి రాత్రి 10:30 అయ్యింది.
ఎంతగా శారీరకంగానూ, మానసికంగానూ ఆ సమయంలో అలిసిపోయాననిపించింది. ఇది చివరి సమయం అనిపించింది.
దేవుడు విడిపించాడు.
ఎన్ని రోజులైనా మార్పు కనిపింకపోవడంతోనూ,
బెడ్దులు కావల్సిన వత్తిడితోనూ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అలా చెయ్యవద్దని, కనీసం
పైడ్ గదులకైనా మార్చమని అడిగాను. ఎవ్వరి దగ్గరకు వెళ్ళినా కాదు అనే జవాబే. విసుగు చెంది
ఒక చోట కూర్చుండి పోయాను. ఎవ్వరో అటువెల్టూ ఆర్. ఎం.ఓ. మిమ్మల్ని పిలుస్తున్నారు అనిచెప్పారు.
ఏమి వినాలో అనుకుంటూ వెళ్ళాను. ఎవరో ఫోను చేసారని, రూముకు మారుస్తున్నామని చెప్పారు.
అప్పటికి సమయం రాత్రి 12:00 గంటలు ఆ ఫోను చేసింది ఎవ్వరో తెలియరాలేదు. నేనూ తెలుసుకోవడానికి
ప్రయత్నించలేదు. ఎందుకంటే ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు
గనుక.
ఆ NIMS అనుభవం నా జీవితంలోనూ, నా అధ్యాత్మికతలోనూ
చాలా మార్పు తెచ్చింది. బైబిలును పరిశిలనగా చదవ నారంభించి, చాలా తీక్షణంగానే చదివాను
అనిచెప్పాలి
***
అనుభవంలో వున్నప్పుడు అనుకూలంగా లేనివాటికి
మనసు, పరిస్థితులు, పరిసరాలు ఇబ్బందిగా ఉన్నాయనిపిస్తుంది. వాటిలో నిలబడి ఉన్నప్పుడే
దాటి రాగలిగినప్పుడే సాక్ష్యంగా మిగులుతుంది.
పరిస్థితులకు అననుకూలతలకు తలొగ్గినప్పుడు
ఆ బాధల్లోనే కొట్టుమిట్టాడుతుంటాము.
***
1 తిమోతికి 6: 5-8 వచనాలలో
5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై
దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై
యున్నది.
7. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి
ఏమియు తీసికొని పోలేము.
8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి
వాటితో తృప్తిపొందియుందము.
***
ఆయా సమయములలో అలా ఉన్నప్పుడు పౌలు మాటలు
విశ్వాసానికి కొత్త బలానిస్తాయి.
**
కీర్తనలు 76:1
1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
ఈ వాక్యములో యూదాలో బదులు మనమున్న స్థలాన్ని
ఇశ్రాయేలులో బదులు మన ఇంటిపేరును ఆయన నామము గొప్పది. అని చదివి
చూడండి
అంటే
ఆర్.సి. పురంలో దేవుడు ప్రసిద్ధుడు
కనుమూరివారిలో ఆయన నామము గొప్పది.
ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా వున్న
దేవుడు ప్రసిద్దుడుగా వుండాలని
ప్రతి గృహములో ఆయన నామము గొప్పగా ఉండాలంటాడు.
మన ద్వారా ఆయన గొప్పదనాన్ని చాటడానికి
ఒకొక్క సమయంలో ఒక్కోలాగా ఉంచుతాడు. మనకు ఇష్టమైనవి, ఇష్టమైవాళ్ళు లేకపోవడంవల్ల అంత
బాగా లేదనిపిస్తుంది అయినా
"అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో
తృప్తిపొందియుందము"
ప్రతి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు
1 comment:
ఈవెనింగ్ పెళ్ళి ఫ్లడ్ లైట్స్‌లో రౌండ్ టేబిల్స్ మీద భోజనాలు ఆజానబాహులు రాచర్లవారి వైభవం ఆ రోజులకే ఎనభైయవ దశకంలో ఒక వింత, మరి నేనెన్నడు చూడలేదు. అక్కడ అంతా జాన్ అన్నయ కుర్రకారుతో, మూడి అన్నయ యషిక కెమేరా ఫ్లాషులతో హడావుడి.
ఙాపకాలు కొనసాగుతూనే ఉంటాయి
గతించువారు గతిస్తూ ఉన్నా మన హృదయాలలో వారికి ఎల్లప్పుడూ అగ్రపీఠం ఉంటుంది.
గత సంవత్సరం నాన్న తనకు ఆరోగ్యం అనుకూలంగా లేకపోయినా ఎంతో సంతోషించారు.
అన్నయ అబ్రహాం (సత్యానంద్) లింకన్ పద్మ ఫ్లారెన్స్ వదినల పెళ్ళి నాటికి నాది హైస్కూల్ చదువు. పెళ్ళి కి ముందు వెంకయ్య (డేనిఎల్) బావ నెలలో రెండుసార్లు ఏలూరు పోలవరం మేము ఎక్కడవుంటే అక్కడకు వచ్చేవాడు. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంవల్ల, నాకంటే పెద్దవారు చదువులు ఉద్యొగాలకు వేరు వేరు ప్రాంతాలలో ఉండటంవల్లా నేనె వండిపెట్టేవాడిని. క్రిష్టియాన అక్క పోలవరం, ఏలూరు ఒక్కొక్కసారి వచ్చింది. అక్క రాక నాకు తీయని ఙాపకంగా మిగిలిపోయింది. పెళ్ళి తరువాత పెళ్ళి పిల్లను వదలి వెళ్ళిన తరువాత మళ్ళా ఏలూరులో నాన్న పార్ధివ దేహంవద్ద వద్ద చూశాను, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు.
అన్నయకు పక్షవాతం వచ్చే రోజుకు నా పెళ్ళి నిమిత్తం తీసుకున్న నెలరోజులు శెలవులు అయిపోయాయి. లేటుగా ఆఫీస్‌కు బయలుదేరినవాడికి ఫోన్ వచ్చింది. ఆఫీస్‌కి వెళ్ళి లీవ్ మరొక పదిహేను రోజులు పోడిగించానే కాని మళ్ళా ఆఫీస్‌కు వెళ్ళలేదు. అలాగని జాన్ అన్నయకు పెద్దగ సహాయపడింది లేదు. సొంతవారి మోసాల మధ్య అప్పటికే నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. కెరీర్ విడిచిపెట్టి ఆధ్యాత్మికవైపు పూర్తిగా మరలాలని, నాన్న-పిన్ని కూడావుండాలని, సిటి వదిలేయాలని నిర్ణయం జరిగిపోయింది.
Post a Comment