***
సంవత్సరమేదో
గుర్తులేదు కానీ, అప్పుడే హైదరాబాదు వచ్చిన కొత్త. మల్కాజగిరిలో అన్నయ్యతో పాటు ఉండటవల్ల
అవసరార్దం వంట చెయ్యాల్సి వచ్చింది. మోండా మార్కెట్టుకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమి
దొరుకుతాయో చెప్పాడు అన్నయ్య. ఓ రోజు నేను ఒక్కడ్ణే వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కూరగాయ
ఊరించింది. అవి తీసుకున్నప్పటినుంచీ ఎప్పుడు వండుదామా అని కుతూహలంగా ఉండింది.
నాకు
బాగా గుర్తుంది ఆ రోజు ఆదివారం, చర్చికి సనత్‌నగర్ వెళ్ళేవాళ్ళం. సంజీవరెడ్డినగర్‌లోని
రావుగారింట్లో అన్నయ్య స్నేహితులు కలిసేవారు. వారందరికి అది పోస్టల్ చిరునామా అడ్డా.
ఎందుకంటే రావుగారిది సొంత ఇల్లు కాబట్టి.
చర్చి
వెళ్ళాలనే కంగారు ఒక ప్రక్క, నాకిష్టమైనవి వండాలని ఒక ప్రక్క. అన్నయ్య లేచేసరికి కూర
వండేసాను. అన్నయ్య లేస్తూనే ఏమి వండావు అని అడిగాడు, చెప్పాను. తీరా బ్రెష్సు చేసుకుని
తినడానికి కూర్చున్నాక అడిగాడు.
చిక్కుడు
కాయ అన్నావు ఇదేదో తేడాగా ఉందే అని. క్రిందా మీదా కూరను చూసి, వలిసిన పొట్టుపరీక్షించి
తేల్చిన దేమంటే నేను వండింది చిక్కుడు కాయలు కాదు.
మరేమనుకున్నారు!
పచ్చి బటాణీలు. తొక్కతో సహా వండేసరికి కొద్దిగా వగరగా వుంది. కూరతో తినకుండానే లేచిపోయాడు.
ఇంతకీ
విషయం ఏమిటంటే గింజలున్న చుక్కుడు కాయలు అనుకుని బటాణీ కాయలు తెచ్చి వండాను. అంతకుముందు
బటాణీలను పచ్చి కాయలు చూడకపోవడం వలన, గింజలున్న చిక్కుడు కాయలు అనుకోవడం వలన ఇంత గందరగోళం.
సాయత్రం
మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం పడెయ్యలేక
మొత్తం నేనే తిన్నాను.
1 comment:
సాయత్రం మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం పడెయ్యలేక మొత్తం నేనే తిన్నాను.
>>
యేం చేస్తాం సార్!(వంట) చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా?!
Post a Comment