Wednesday, May 28, 2014

ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము


ఒక్కోసారి ఒకానొక సమయానికి చిక్కి ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. 

అలా ఎందుకు జరిగింది
బయటికి ఎలా రావాలి
చుట్టూవున్న వాతావరణం ఏమిటి అని అలోచించేలోగా కాలం దొర్లిపోతుంది.

ఇరుక్కున్న కాలంలోనే ఏదో తెలియని వత్తిడి, సందిగ్దత ఏర్పడతాయి.
ఇప్పుడు నా పరిస్థులు అలానే అన్పిస్తున్నాయి.

కాలేజీ చదివే రోజుల్లో ఇలాంటిదే ఒక అనుభవం. (ఓ 34 ఏళ్ళ నాటిది) 

పశ్చిమ గోదావరిలోని తణుకు, దువ్వలలో నాకు మేనమావ వరుస అయ్యేవారు వుండేవాళ్ళు. అంతకుముందెప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. తణుకులో నా స్నేహితుడొకడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాడి దగ్గరికి ఒకసారి వెళ్ళాను, అక్కడికి దగ్గరే కదా అని దువ్వ వెళ్ళాను.  వాళ్ళ పిల్లలు నాకంటే చిన్నవారవటంతో ఆటలు, కాలవలో స్నానాలు సరదాగానే గడిచింది.  వెళ్ళిన సాయంత్రమే మావయ్య నాదగ్గరకు వచ్చి ఒరే నీ దగ్గర వున్న డబ్బులు ఇవ్వు రేపు ఇస్తాను అంటే నా దగ్గర వున్నవన్నీ ఇచ్చేసాను. (వందలూ, వేలూ ఏమీ కాదు).


ఆయన ఇబ్బంది ఏమిటో నేను  ఆ వయసులో తెలుకోలేకపోయాను గానీ, నేను మాత్రం సుమారు ఒక వారం రోజులు ఇరుక్కుపోయాను. 

మొదటి రెండు రోజులూ బాగానే గడచినా తర్వాత నాకూ అక్కడ గడపటం ఇబ్బంది కరంగా అనిపించేది అయినా కదలలేని స్థితి .  

No comments: