ఈ మధ్య నా కవితా ప్రయాణంగురించి మాట్లాడే అవకాశంవచ్చింది. ఏమి మాట్లాడాలి అని పదిరోజులపాటు (కాలేజీలో పరీక్షలకు సిద్ధపడినట్టు) సిద్దపడ్డాను. ఆ నేపద్యంలో నాకు నన్ను ప్రభావితంచేసిన వారు గుర్తుకొచ్చారు.
వారిలో : మృణాలిని చుండూరి
నా అక్క 70వ దశకంలో నవలలు బగా చదివేది. అక్కకు నవలలు నేనే తెచ్చిపెట్టేవాణ్ణి చాలాసార్లు. అయినా నవలలు చదవడం నాకు అంతగా వంటబట్టలేదు. ఆరోజుల్లో అక్క నోటిద్వారా మృణాలిని పేరు విన్న గుర్తు. నిజానికి ఆమె ఏమి ఏమి రాసారో నాకైతే అవగాహనలేదు.
నేను ప్రత్యక్షంగా మృణాలిని గారిని 2004 డిశెంబరులో తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో కలిసాను అంతే. అమె ప్రసంగించిన సాహిత్యకార్యక్రమాలను కొన్ని పాల్గొనడం జరిగింది. అయితే
ఆమె బిబిసి అనుభవాలను ఎప్పుడో చదివిన/రేడియోలోవిన్న గుర్తు. అందులో ఆమె ఇవ్వబడ్డ సమయాన్ని సమన్వయంచేసుకుంటు, వార్తను తర్జుమా చేసుకుంటూ, ఎడిటింగు చేసుకుంటూ వార్తలను చదవడం గురించి తన అనుభవాన్ని చెప్పారు.
నాకు అలాంటి సందర్భం ఎదురయ్యినప్పుడు ఆ అనుభవాలు ఉపకరించాయి. అందుకే ఆమె నా పరోక్ష గురువు.
నా అనుభవలంలోకి వచ్చిన సందర్భాలు కొంచెం వివరంగా
సాధరణంగా కొన్ని కార్యక్రమాలకు అథిదిగా పిలిచి, మాట్లాడవలసిన అంశాన్ని ఇస్తారు. మాట్లాడే అవకాశం రావడం, ఆహ్వానించిన వారిని బట్టి ఆహుతులను అంచనావేయడం, కొందరు పెద్దలు వుంటారనే ఊహ కొంత ఉద్వేగానికి లోను చేస్తుంది. జాగ్రత్తగా మాట్లాడటంకోసం పగడ్బందీగా మాట్లాడనేవుద్దేశంతో మరింత శ్రద్దతో నోట్సు తయారుచేసుకునేవాణ్ణి. తీరా సభ ప్రారంభం ఆలస్యం కావడమో, అథిదుల క్రమమం మారిపోవడమో, అంశాలు ఎక్కువ అవ్వడమో, మొదట మాట్లాడినవారు మొత్తం సమయాన్ని తినెయ్యడమో, సాంకేతిక ఇబ్బందులో(కరెంటు, మైకు..వగైరా), ఇలాంతి కారణాలవల్ల నిర్వాహకులు సమయాన్ని పరుగెట్టించాలని చూస్తారు. మనకిచ్చే సమయాన్ని కుదించమంటారు. అదీ చెవిలో చెప్పకుండా మైకులో చెబుతారు. అది కొంచెం వత్తిడిని పెంచుతుండేది. మొదట్లో చాలా వత్తిడి అనిపించేది, మాట్లాడాలని సిద్ధంచేసుకున్నవి తికమక అయ్యేవి.
ఇలాంటివి చర్చిలోనూ, సాహిత్య సభలలోనూ అనుభవానికి వచ్చాయి. అప్పుడు మృణాలినిగారి మాటలు పదే పదే గుర్తు చేసుకుని, నిర్వాహకుల అసహాయతను, ఆత్రాన్ని సహృదయంతో అర్థంచేసుకుని నన్ను నేను, నేను మాట్లాడనుకునే అంశాలను కుదించుకోవడం అభ్యాసం చేసాను. అందుకే ఆమె నా పరోక్ష గురువు
కొసమెరుపు ఏమిటంటే మాట్లాడవలసిన ఈ సందర్భంలో కూడా సమయాన్ని కత్తిరించారు. ఏ వత్తిడిలేకుండానే సమయాన్ని కుదించుకున్నాను. :)
(ఫొటో నేను తీసిందే)
No comments:
Post a Comment