Saturday, January 4, 2014

when I look 2013


సంవత్సరాన్ని నెలలు నెలలుగా విభజించి బేరీజువేసుకున్న ధాఖలాలు లేవు. కానీ 2013 ఎందుకో బేరీజుల తక్కేడలో నా కళ్ళముందు కదలాడింది.
తొలిమాసంలోనే కొంత అలజడి, ఆ అలజడి  సంవత్సరం పొడుగునా వెంటాడింది అనే చెప్పవచ్చు. పని బాద్యతలవిషయంలో  తలెత్తిన   అలజడి ఒక అవగాహన రాకుండానే కొన్ని నెలలలు గడచిపోయి, మళ్ళీ ఆ పనే నేనే బాధ్యవహించవల్సి వచ్చింది. ఈ అలజడి కొంత మనస్థాపాన్ని కలిగించి అవమానంగా మనసుకు తోచింది మనసుకు. కానీ ఏమి చెయ్యాలి ఆపరేషన్‌వల్ల కలిగిన శారీర మార్పువల్ల కొంత నన్ను నేను నిగ్రహించుకోక తప్పలేదు.
నన్ను,  నా  శరీర పరిస్థితికి సహాయం చేస్తున్నామనుకుంటూనే గాయపరచటం జరిగింది. మాట వినని  మనసు  గాయం అలాగేవుంది. చదువుతున్న బైబిలు సత్యాలనుంచి, యేసు చెప్పిన ప్రేమించమన్న  నూతన ఆజ్ఞను మననం చేసుకోవడంద్వారా పాటించాలనుకోవడంద్వారా కొంత వుపసమనం స్వగాతానికి  జరుగుతున్నా, బంధాలమధ్య  సమన్వయం కాకుండానే పోతుంది. దానికి లోలోపల ఉన్న "ఇగోను" శాంతపర్చడం కష్టంగానేవుంది. 
గుండె బాగానే పనిచేస్తున్నా సహాయసహకారాలిచ్చే అవయవాలు ఒక్కోసారి మొండికేయడంవల్ల పరీక్షలు, పరీక్షల ఫలితాలకై ఎదురుచూపులు, జేబుకత్తిరింపులు తద్వారే వచ్చే వత్తిడి కొన్ని నెలలను మింగేసి, నాకు మందుబిళ్ళల(టాబ్లెట్ట్లు) సంఖ్యను పెంచాయి. మళ్ళీ అదో జేబుకత్తిరింపు.

కొన్ని అనువాదాలు మొదలుపెట్టినా పూర్తి చెయ్యలేకపోయాను.  ఎం.ఎ. తెలుగు గతసంవత్సరం రాయని పేపర్లను రాయలేకపోయాను.
గురువుగారి సూత్రం కొత్త పుస్తకాలు చదడం, సంపాదించడం ...ఈ విషయంలో కూడా వెనుకంజ అయ్యింది.
నా ప్రక్కటెముకకు సాహిత్య స్నేహితుల పట్లకలిగిన సందేహం అలాగే కొనసగుతున్నది. సాహితీ మిత్రులెవరూ ఇంటికివచ్చి పలుకరించలేదని అమె మాట. నిజమే కావొచ్చు. ఈ విషయాన్ని ఎలా అర్థంచేసుకోవాలో తికమక పడుతూనేవున్నాను. అందుకే ఎక్కువ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనలేదు.
కావాలని పిలిచిన వారుకూడా తీరా వెళ్ళాక పట్టించుకోనితనం, ప్రాముక్యతలేని సమయాన్ని  కేటాయించడంలాంటి సంఘటనలు అవమానంగానో, మనసుకు కష్టంగానూ తోచాయి.

2013
కొందరని కొల్పొయాను.. (4) చూసి వద్దమని, పలకరిద్దమని అనుకున్న కానీ శారీరక పరిస్థితులవల్ల వాయిదా వేస్తూ వచ్చాను

చెయ్యలనుకున్నవి చెయ్యలెకపొయ.

మొన్నె మా స్నేహితుల మూడు జంటలు  కలిసుమున్నము

సాహిత్య మిత్రులు  ఎవ్వరు ఆపరేషన్  అయ్యక ఇంటికివచ్హి పలకరించలెదనే నా ప్రక్కటెముక ప్రశ్న ......బ్లంక్గా మిగిలిపొయింది.

చెప్పు తగ్గట్టూ ఎమి రాయలేదేమో




ఫేసు బుక్కులో పాత మిత్రులు మెల్లగా వెనుకకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. కొత్తవారు రోజు రోజూ కలుస్తూనేవున్నారు.

ఇవన్నీ ఎలావున్నా బైబిలు చదవడం, నమ్మిన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు.
ప్రతీవారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళగలగటం గొప్పవూరట.

No comments: