14,15 డిశెంబరు 2004 పాల్గొన్నప్పుడు
అద్దేపల్లి గారితో పరిచయం నెలనెలావెన్నెల్లో జరిగింది. నేను రాస్తున్నవి కొన్ని ఆయనకు పోస్టులో పంపాను. వారం తిరక్కుండానే ఆయన దగ్గరనుండి జవాబు వచ్చింది. తర్వాత తరచూ ఫోనులో మాట్లాడటంతో సాన్నిహిత్యం పెరిగింది. కొన్ని సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సాన్నిహిత్యం మరింత పెరిగింది.
ఎక్స్‌రే, విజయవాడ వారు నిర్వహించిన 24 గంటల కవిసమ్మేళనంలో (14,15 డిశెంబరు 2004) పాల్గొన్నప్పుడు ఎక్కువ సమయం ఆయనతో గడపటం జరిగింది.
నా దీర్ఘ కవిత "హసీనా" ముందుమాట రాసి చర్చలో (30 డిశెంబరు, 2004) పాల్గొన్నాని నన్ను ప్రోత్సహించారు.
అపరంజి పైన్ ఆర్ట్స్, ఏలూరులో జరిగిన కవితావలోకనం, కవితోత్సవం (12.11.2005)లలో ఆయనతో వేదిక పంచుకోవడం జరిగింది.
ఆయన దగ్గర నేను గమనించిందీ, నేర్చుకున్నదీ ఒక విషయం.
అప్పుడప్పుడూ సాహిత్య కార్యక్రమాలలో జరిగే ఆలశ్యాలను బట్టి నిర్వహకులు సమయాన్ని కుదించాలంటారు. ఆకస్మికంగా జరిగే ఆ వత్తిడిలో సమన్వయాన్ని పాటించడం మరియు చెప్పాలనుకున్న విషయాలను ఎడిట్ చేసుకుని తడబాటులేకుండా మాట్లాడగలగటం ఆయనకున్న నేర్పరితనం. బహుశ ఆయనకు సుదీర్ఘ అనుభవంవల్ల వచ్చివుండవచ్చు.
అది గమనించిన నేను చాలా సందర్భాలలో నన్ను ఆహ్వానించిన చర్చిలోనో, సాహిత్య కార్యక్రమంలోనో నాకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పాటించాను.
అలా గురువువైన శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు గారికి
ప్రతిష్టాత్మక నాగభైరవ పురస్కారం డిసెంబర్ 15 న నెల్లూరు లో ప్రసిద్ద కవి,విమర్శకులు
డా అద్దేపల్లి రామమోహన్ రావు గారికి ప్రదానం అని కమిటీ ఈరోజు ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను.
No comments:
Post a Comment