Thursday, August 22, 2013

వెళ్ళిపోయిన కాలంలోంచి జ్ఞాపకాలు తొంగిచూస్తాయి.


వెళ్ళిపోయిన కాలంలోంచి జ్ఞాపకాలు తొంగిచూస్తాయి.  


ప్రసంగి 7 : 1-3 (బైబిలు) నుంచి
1. సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.
2. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.
3. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.
10. ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు
11. జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.
12. జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.
13. దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?
14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.
***
ఈ వాక్యం లోంచి  ఈ రోజు ముగ్గుర్ని తలచుకునే అవకాశం, అవసరం కల్గింది.
ఆ జ్ఞాపకాలనుంచి వెదజల్లే సుగంధం స్పూర్తినిస్తుంది.

ఈ రోజు జ్ఞాపకంచేసుకుంటున్న వారు

* శ్రీ ముప్పిడి సుందర్రావు గారు, - బంధుత్వం ప్రకారం మామ గారే కానీ
స్పూర్తిలో అంతకంటే ఎక్కువే అని గుర్తించేలోపే జ్ఞాపకంగా మిగిలిపోయారు.
కనకాపురం గ్రామం, ములగలంపల్లి పోస్టు, జీలుగుమిల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో  పాస్టరుగా, హోమియో వైద్యుడుగాను  తన  కాలాన్ని అనేకులకు పరిచర్యలో పనిచేసారు.
ఆయన జీవించిన విధానం సాధారణంగానే కనిపిస్తుంది కానీ ఆచరణలో అసాధరణమైనది. ఈ లోకంలో తన పని ముగించుకున్నారు.
** ఆనంద రాజు, (బి.హెచ్.ఇ.ఎల్.) రామచంద్రపురం, హైదరాబాదు
ఉదయమో సాయంకాలమో ఇటుగా వెళుతోనో, దారిలో కనిపిస్తేనో తమ్ముడూ అని పలుకరించి, మరదలు పిల్లలు బాగున్నారా? అని అత్మీయగంగా పలకరించిన ఆత్మీయ హస్తం.  
*** మాలతీ చందూర్
సాహిత్య లోకంలో తన కాలంలో, తనకంటూ  ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నవారు.  నా నూగుమీసాల చదువరి తనంలో ఎక్కువగా విన్న పేరు మాలతీ చందూర్.
చాలా మందిని ప్రభావితం చేయడం నేను గమనించాను.
* * *
మీ కాలంలో మీరు చేసిన ప్రభావిత ప్రకంపనాలు ఏదో రీతిగా జీవితంలో పనిచేస్తుంటాయి.
అందుకే మిమ్మల్ని స్మరించుకుంటూ
శిరసువంచి నమస్కరిస్తున్నాను. 

No comments: