Thursday, August 15, 2013

గుణవతియైన భార్య



నేను కొంత కాలంగా  దినచర్యగా  చదువుతున్న బైబిలు వాక్యాలు  తెలుగు బైబిలు బ్లాగులో యధాతధంగా పోస్టుచేస్తూన్నాను. సామెతలు 31వ  అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు కలిగిన భావాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను.

10వ వచనమునుండి "గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది" మొదలయ్యి ముత్యముకంటె అమూల్యమైనది అయిన భార్య దొరకటం ద్వారా కలిగే మేళ్ళను, లాభములను ఒక తల్లి కుమారునికి బోదిస్తుంది.



నాకు ఊహ తెలిసినప్పటినుంచి వివాహ సందర్భంలో తప్పనిసరిగా పాస్టర్లు, పెద్దలు ఇందులోని వాక్యాలను ఉటంకించి ఉపదేశించడం విన్నాను. అయినా ఈ రోజు చదువుతుంటే, టైపు చేస్తుంటే కొత్తగా అనిపిస్తున్నాయి ఈ వాక్యాలు.
 
 స్త్రీని భార్య స్థానంలో సగభాగంగా  గుర్తించడం కనిపిస్తుంది. బైబిలులో స్త్రీని ఈ దృష్టితో చూడటం మరే అధ్యాయాల్లో కనబడలేదని నాకు అనిపించింది. బహుశ బైబిలులో శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన స్త్రీపై దృష్టికోణం లేదని  నాకనిపిస్తుంది. అయినా కొన్ని చోట్ల స్త్రీలు ప్రముఖమైన పాత్రలు పోషించారు.  అయినా ఇక్కడ ఈ అధ్యాయాన్ని గురించిన విషయం కాబట్టి  బైబిలులో స్త్రీ దృష్టిని ప్రక్కన పెడదాం.

గుణవతి ఎలావుంటుందో, ఏమి చేస్తుందో వివరించిన చోటే గుణవతిగా ఉండటానికి ఏమిచెయ్యాలో చెప్పలేదనిపిస్తుంది. బహుశ ఒక తల్లి కుమారునికి చెబుతుండటం వలన ఆ విషయాలను ప్రస్తావించలేదేమో.!
ఇవే మాటలలోని పరమార్థాన్ని కుమార్తెకు తల్లి బోధిస్తుంటే గుణవతిగా వుండటానికి చేయవలసినవి చెప్పేదేమో!
 
"యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును
చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును."
ఈ మాటలతో ముగించడంద్వారా కొద్దిగా చెప్పినట్లు అనిపింది.
 
పురుషాధిక్యము కలిగిన సమాజంలో గుణవతిగా వుండటంకోసం, రూపాతరం చెందడంకోసం స్త్రీ అనేకానేక అవాంతరాలను ఎదుర్కొంటుంది, అధిగమించి చూపిస్తుంది కూడా. 
.. పాత్రత కోసం, అర్హత కోసం నిరంతరం ..తన పాత్రలు మార్చుకుంటూనే ఉంటుంది .. అయితే నిజమైన స్త్రీ ఎవరు .. ఈ ఇమేజ్ మాత్రమేనా స్త్రీ అనే సందేహమొస్తుంది.

భర్త గుణవంతుడుగా వుండవలసిన అవసరం కూడా చెప్పివుంటే ఇప్పటి భర్తలకు సూటిగాను, స్పష్టంగాను ఉండేదని నాకు అనిపిస్తుంది   
* * *
క్రైస్తవ్యంలోని నిరీక్షణ యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా మళ్ళీ వస్తాడని, సంఘమనే వధువును వివాహం చేసుకుంటాడానేది.   అలా రాబోతున్న పెండ్లి కుమారునికి గుణవతియైన వధువుగా వుండడానికి సంఘమనే దేహంలో అవయవాలుగా ఎప్పటికప్పుడు గుణగణాలను పరిరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనావుంది
* * *

ఇక వచనాలను చూడండి   :( from తెలుగు బైబిలు )
1. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,
The words of King Lemuel, the prophecy that his mother taught him:

2. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును?
నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?
What, my son? And what, the son of my womb? And what, the son of my vows?
10. గుణవతియైన భార్య దొరుకుట అరుదు
అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
Who can find a virtuous woman? For her price is far above rubies.

11. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును
అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.
The heart of her husband doth safely trust in her, so that he shall have no need of spoil.

12. ఆమె తాను బ్రదుకు దినములన్నియు
అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.
She will do him good and not evil all the days of her life.

13. ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును
తన చేతులార వాటితో పనిచేయును.
She seeketh wool and flax, and worketh willingly with her hands.

14. వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు
ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.
She is like the merchants' ships; she bringeth her food from afar.

15. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును
తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.
She riseth also while it is yet night, and giveth meat to her household and a portion to her maidens.

16. ఆమె పొలమును చూచి దానిని తీసికొనును
తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.
She considereth a field and buyeth it; with the fruit of her hands she planteth a vineyard.

17. ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని
చేతులతో బలముగా పనిచేయును
She girdeth her loins with strength, and strengtheneth her arms.

18. తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును
రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
She perceiveth that her merchandise is good; her candle goeth not out by night.

19. ఆమె పంటెను చేత పట్టుకొనును
తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.
She layeth her hands to the spindle, and her hands hold the distaff.

20. దీనులకు తన చెయ్యి చాపును
దరిద్రులకు తన చేతులు చాపును
She stretcheth out her hand to the poor; yea, she reacheth forth her hands to the needy.

21. తన యింటివారికి చలి తగులునని భయపడదు
ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.
She is not afraid of the snow for her household, for all her household are clothed with scarlet.

22. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును
ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
She maketh herself coverings of tapestry; her clothing is silk and purple.

23. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును
గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
Her husband is known at the gates, when he sitteth among the elders of the land.

24. ఆమె నారబట్టలు నేయించి అమ్మును
నడికట్లను వర్తకులకు అమ్మును.
She maketh fine linen and selleth it, and delivereth girdles unto the merchant.

25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు
ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.
Strength and honor are her clothing, and she shall rejoice in time to come.

26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును
కృపగల ఉపదేశము ఆమె బోధించును.
She openeth her mouth with wisdom, and on her tongue is the law of kindness.

27. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును
పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.
She looketh well to the ways of her household, and eateth not the bread of idleness.

28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు
చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు గాని
Her children arise up and call her blessed; her husband also, and he praiseth her:

29. వారందరిని నీవు మించినదానవు అని
ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
Many daughters have done virtuously, but thou excellest them all."

30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము
యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
Favor is deceitful, and beauty is vain; but a woman who feareth the LORD, she shall be praised!

31. చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును
గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
Give her of the fruit of her hands, and let her own works praise her at the gates.

తెలుగు బైబిలు - సామెతలు

No comments: