Wednesday, April 24, 2013

అతికి పోతే.....


నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ఎలా ఏర్పడిందో గాని మిరపకాయబజ్జీలంటే భలే ఇష్టం ఏర్పడింది. సాయంకాలంపూట ఒక(పాక/గుడిశె) హోటలులో సాయంకాలాలు మిర్చిబజ్జీలు వెయ్యడం మొదలుపెట్టారు. అక్కడే చిన్న ఆ వూరిబస్సులు ఆగేవి. అప్పటికి ఇంకా బస్సు షల్టరు ప్రత్యేకంగా ఏదీ లేదు ఆవూరిలో. సినిమాహాలుకు వెళ్ళే దారికూడా కావటంవల్ల బాగానే అమ్ముడుపోయేవి. 

ఒక్కో మిర్చి బజ్జీ 3 పైసలు, 
10 పైసలకు నాలుగు ఇచ్చేవారు. మిర్చిలోపల ఏ రకం మషాలా పెట్టేవారో సరిగ్గ గుర్తులేదు కానీ వామ్ము తప్పకుండా వుండేది.
చేతిలో పది పైసలు వుంటే నలుగు స్నేహితులం కలిసి బజ్జీలు తినేవాళ్ళం.


ఒకరోజు స్నేహితుల మధ్య ఎవరు ఎక్కువ తినగలరు అని ఒక వాదన పుట్టింది. ఇక బెట్టింగు మొదలయ్యింది. అప్పటికే నాకు బాగా ఇష్టమని నాకూ, నా స్నేహితులకు తెలుసు. చేతిలో డబ్బులు పోగుచేసుకొని ఓ రోజు   ఒక పట్టుపట్టాము. స్నేహితులు రెండు, మూడు కన్నా ఎక్కువ తినలేకపోయారు. నేను మాత్రం 11 బజ్జీలను సునయాసంగా తినేసాను. వాంతి కాని అవుతుందేమోనని కొద్దిసేపు వేచి చూసాము. ఏమీ కాలేదు. పందెం గెలిచి ఇంతికివెళ్ళి పడుకున్నాను. 

తెల్లవారి నిద్ర లేచే సరికి   వళ్ళంతా దద్దుర్లు. చలా కంగారు అయ్యింది. అమ్మకు తెలిస్తే తిడుతుందని కనబడకుండా చూసుకొని ఇంటినుంచు బయటపడ్డాను. స్కూలుకు వెలుతూ స్కూలు ప్రక్కనే వున్న గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు దగ్గరకు వెళ్ళాను. అప్పుడు తెలిసింది ఆ దద్దుర్లు రాత్రి తిన్న బజ్జీలలోని మిర్చివల్ల వచ్చిందని. ట్యాబ్లెట్టులు తీసుకుని స్కూలుకు వెళ్ళిపోయాను. ఆసుపత్రిలొ పనిచేసే ఒకాయన నన్నుచూడటంవల్ల  విషయం అమ్మకు తెలిసిపోయింది.

సాయత్రం స్కూలునుంచి రాగానే తెలియకుండా బయట తిన్నందుకూ, పందెం కోసం తిన్నందుకూ, దద్దుర్లు దాచిపెట్టి ఆసుపత్రికి వెళ్ళినందుకు దద్దుర్లు సరిపోవని వాతలు వచ్చేటట్లు నాలుగు వుతికింది.

దద్దుర్ల కన్నా వాతలే బాగా బాధించిన దానికన్నా అమ్మకు కోపంతెప్పించానే అనేబాధ ఎక్కువనిపించింది.


ఇంతకీ నేను ఎందుకు గుర్తొచ్చిందీ ఇది అంటే "అతికి పోతే ఏదొక దద్దుర్లు, తర్వాత వాతలు తేలతాయని"


**15725

No comments: