కొలిమంటుకున్నాది
******
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా
నీ పక్క పొలమోడు
దుక్కి సాగిండన్న
కాల్జాపి కూకోకు - రామన్నా
కార్తెపోతే రాదు - యినుమన్నా
ఎరువు కావాలింక
గుడిసలేసుకోవాల
నీ బండి పట్టాలు - రామన్నా
కొత్తయే కావాల - యినుమన్నా
ఉత్తరానురిమింది
రోజూ మొగలవుతుంది
ఎర్రమెరుపూ సూడు - రామన్నా
కర్రు పారా సాన - బెట్టన్నా
కంచాన గంజికీ
గద్దలూ కాకులూ
వడిసెల పేనుకో - రామన్నా
వడివడిగా రాళ్ళేసి - కొట్టన్నా
ఇనుప ముక్కలు కొడుకు
లుండిఫలమేముంది
పగలు నిద్రలు మాని - రామన్నా
కూడబెట్టిందేమి - లేదన్నా
చట్టాలు అన్నారు
పట్టాలు అన్నారు
పొలములొ కాలెడితే - రామన్నా
పోలీసులొచ్చేరు - ఏలన్నా
కౌలికిచ్చినోడు
కన్నెర్ర సేసేడు
అప్పులిచ్చినోడు
ఆలినే సూసేడు
దయజెప్పు సర్కారు
దాదాలె అయ్యేరు
నీ దారి గోదారి - రామన్నా
కానీక కదనాన - నిలువన్నా
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా
కర్రు పారా సాన - బెట్టన్నా
బతుకు యుద్ధములోన - నిలువుమన్నా
కొలిమంటుకున్నాది పాటలో విప్లవ ప్రభోదాన్ని ఒక మేల్కొలుపును మనం గమనించవచ్చు. ఈ పాటలో రైతుల, రైతు పేదల కష్టనష్టాలు చిత్రిత మయ్యాయి. చ్చెరబండరాజు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క చేతి వృత్తిని, కాయకష్టాన్ని స్మరిస్తూ వచ్చాడు. "కొడలుపగలేసినం" మొదలైన పాటలన్నిటినీ మనం గమనిస్తే మనకా విషయం అర్థమౌతుంది. ఈ పాట ఒక మేల్కొలుపుతో ప్రారంభమౌతుంది.
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నాపోరాటం రాజుకుందని, బతుకు పోరు సిద్దం కావాలని, ఆలస్యం చేయకూడదని కవి ఇందులో అన్యాపదేశంగా సూచిస్తున్నాడు. దుక్కి సాగించే క్రమాన్ని ఆ క్రమంలో చేయాల్సిన పనుల్ని, పంటచేతికి వచ్చినప్పుడు చేతిలో పట్టల్సిన బడిసెలను ఇందులో చెరబండరాజు ప్రసావించారు. ఇంత కష్టపడినా చట్టాలు, పట్టాలు అంటూ ఆ భూమిని స్వంతదారులు వేరంటూ పోలీసులు సృష్టించే కల్లోలం గురించి కూడా ఇందులో ప్రస్తావన వుంది. కౌలుకిచ్చిన వాళ్ళ, అప్పులిచ్చిన వాళ్ళ సర్కారు దొరల దౌర్జన్యాల గురించి ప్రస్తావన కూడా ఈ పాటలో కనిపిస్తుంది.
నీ దారి గోదారి - రామన్నా
కానీక కదనాన - నిలువన్నా
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా
కర్రు పారా సాన - బెట్టన్నా
బతుకు యుద్ధములోన - నిలువుమన్నా
బతుకు పోరులో ఎదురయ్యే కష్టాలను లెక్కచేయకుండా కదనానికి సిద్ధం కమ్మంటూ చెరబండరాజు చేసిన ప్రబోధం ఈ పాటలో వుంది. ఈ పాటలో భూమిని నమ్ముకున్న రైతుల వెతల్ని కవి చిత్రించాడు. ఆలస్యం చేయకుండా బ్రతుకు పోరాటానికి తయారు కమ్మన్నాడు. విప్లవానికి అనువుగావున్న వాతావరణాన్ని సూచిస్తూ, నిప్పరిపోనీకు రామన్నా, పొద్దెక్కి పోనీకు లేవన్నా అని ఉద్భోధించాడు. చట్టాలు, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయవన్న సత్యాన్ని నిర్భయంగా వెల్లడించాడు.

No comments:
Post a Comment