..
శివసాగర్ కవిత్వం
*****
అలలు
*****
అలలపై నిఘా!
అలలుకనే కలలపై నిఘా!
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!
అలపై కదిలే
పడవలపై నిఘా!
పడవల తెరచాపలపై నిఘా!
పడవల తెరచాపల తెల్లదనంపై నిఘా!
ఉరికంబం మీద అలలు
కటకటాల వెనుక అలలు
కన్నీళ్ళలో అలలు! అలలు!
కారడవిలో అలలు! అలలు!
కడలి జనం ! అలలు దళం!
అలలు కడలి ప్రాణప్రదం!
అలల కంఠంపై కత్తి!
అలల గాయాల నుండి కొన్నెత్తురు!
సముద్ర దొంగల గుర్రపు డెక్కకింద
అలల గాయాల నుండి కొన్నెత్తురు!
కత్తులతో సముద్రం గుండెల్లో గుచ్చుతూ
పచ్చినెత్తురు తాగుతూ దొంగలు! సముద్ర దొంగలు!
మట్టికాళ్ళ మహారాక్షసి పుత్రులు
అన్ని తీరాల్లో తిరుగాడే దొంగలు!
అలలు ఏడ్చినవి
విశాల విషాదము సముద్రము
అలలు ప్రశ్నించినవి
సముద్రమంతా హోరు
అలలు కదిలినవి
సముద్రమంతా పెనుగాలి
అలల కొసల మంటలు
సముద్రంలో బడబాగ్ని
అలలు కదిలినవి
అలలు హోరెత్తినవి
అలలు వలయాలు పన్నినవి
తీర తీరాలు తాకినవి
ఏకాంత ద్వీపాంతరంలోని
మట్టికాళ్ళ మహారాక్షసిని కూల్చినవి
అలల నెవ్వరడ్డగలరు?
కడలినెవ్వడాపగలరు?
సముద్రం పురిటి నొప్పులుగా అలలు
దరిద్రం రేపటికోసం కన్న కలలు
అలలు సముద్రం చేతి కత్తి
అలలు సముద్రం చేతికలం
ఉదయం నిండా అలలు
అలలు అలలు అలలు
నీలో నాలో
అలలు
అలలు కనే
కలలు
కలలు తెగిన
కలలు
అలలపైన నిఘా!
అలలుకనే కలలపై నిఘా!
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!
విప్లవ రాజకీయాలకు నిబద్దత వహించి, సృష్టించిన సాహిత్యం విప్లవ సాహిత్యమనీ, మార్కిష్టు సిద్దాంతాన్ని సమసమాజ నిర్మాణానికి ఒక సాధనంగా అంగీకరించి ఆచరణలో స్వీకరించి నడిపే రాజకీయాలను విప్లవ రాజకీయాలు అని ష్థూలంగా చెప్పవచ్చు. 1969 లో వెలువడిన తిరగబడు అను కవితా సంకలనం విప్లవ కవిత్వానికి ఒక వైతాళిక గీతంగా పనిచేసింది. విప్లవ కవితా ఉద్యమాన్ని పరిపుష్పం చేసిన కవులలో శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు మొదలగువారు ప్రసిద్ధులు.
అలలు రచన శివసాగర్ చేసినది. 1931 జూలై 15 శివసాగర్ జన్మించిన రోజు. ఇది అతని కలంపేదు. అతని అసలు పేరు కంభంజ్ఞాన సత్యమూర్తి. విప్లవ కవిత్వంఓని వస్తు, రూప వైవిధ్యాన్ని శివసాగర కవిత్వంలో మనం గమనించవచ్చు. విప్లవ వాతావరణంలోచి భిన్నమైన అనుభవాల నేపథ్యాలనుంచి, పోరాటాలనుంచి రూపుదిద్దుకున్న కవిత్వం శివసాగర్ది. కవితా పద్దతిలో శివసాగర్ సంవేదన, లలితమైన భావన, హృదయాంతరాలను తాకే అనుభూతి, అభివ్యక్తి "అలలు" కవితలో కనిపిస్తుంది.
ఈ కవితలోని విప్లవ నిదర్శనాలు, విప్లవ కవులకు సంకేతాలు. "చిరుగాలి సితారా సంగీతం" ప్రజా విప్లవోద్యమం. మట్టికాళ్ళ మహారాక్షసి ...సామ్రాజ్యానికి చిహ్నం. చాలా స్పష్టమైన, సూచియైన సంకేతాలను ఉపయోగించి కవి ఒక విప్లవ సందర్భానికి సంబంధించిన అవగాహనను పాఠకుల్లో కలిగించడానికి "అలలు" కవితలో ప్రయత్నం చేశాడు.
అలలపై నిఘా
అలలుకనే కలలపై నిఘా
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారపై నిఘా !
అంటూ ప్రజల, విప్లవదళాల చర్యలను ఒక క్రమపరిణామంలో సూచించడానికి ప్రయత్నించాడు
అలలు ఏర్పడినవి
విశాల విషాద సముద్రము
అలలు ప్రశించినవి
సముద్రమంతా హోరు
........
........
మట్టికాళ్ళు మహారాఖసిని కూల్చినవి"
పై మాటలద్వారా ప్రజాదళాల విప్లవాచరణ సామ్రాజ్యవాదాన్ని పెకలించి వేస్తుందనే కవిభావం ఇందులో ప్రస్పుటమవుతుంది.
అలలు సముద్రంచేతికత్తి
అలలు సముద్రం చేతికలం
ఉదయంనిండా అలలు
అలలు అలలు అలలు
అని కవి అనడంలో ప్రజాదళాల విప్లవ కార్యాచరణ, విప్లవ సాంకేతికోద్యమంలో భాగంగా సాహిత్య సృజన అనే రెండు అంశాలను కవి సూచించాడు. చివరగా అలలపై అనురాగంచూపించే "చిరుగాలి సితారా సంగీతం"పై కూడా నిఘా వుందనడంలో విప్లవోద్యమం పట్ల సామాన్య ప్రజలు కూడా ప్రేమ చూపిస్తున్నారని, పోరాటానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారని ఒక ఆశావ్హమైన చూచనతో కవి కవితను ముగిస్తాడు. విప్లవ పోరాటాలకు సంబదించిన అనుకూల, ప్రతికూల వాతావణాన్ని మన కళ్ళకు కట్టేట్లు చిత్రించడంలో కవి సఫలుడయ్యాడు.

No comments:
Post a Comment