Monday, December 10, 2012

మొఘల్ ఎ ఆజాం


నేను ఇంట్మీడియెట్ చదువుతున్నప్పుడు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఒక కార్యక్రమం చూడటం జరిగింది. అందులో ఆయన మొఘల్ ఎ ఆజాం లోని సంభాషణలు దిలిప్ కుమార్‌కు పృద్వీరాజ్ కపూర్‌కు మధ్య అవి విన్నప్పుడు చాలా వుత్తేజితుణ్ణయ్యాను.

ఆ సినిమా చూడాలనే కోరిక చాలా కాలం తీరలేదు. తర్వాత హైదరాబాదు, జబల్‌పూర్లలో పనిచేయడంతో ఆ అవకాశం చిక్కింది. మొదటి సారి చూస్తున్నప్పుడు నేరెళ్ళ వేణుమాదవ్ గారు  చెప్పిన సన్నివేశం ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూసాను. అదే వారంలో మళ్ళీ చూసాను. ఈ నేపద్యంలో ఓ విషయాన్ని గమనించాను. అదేమంటే పాత హిందీ సినిమా హైదరాబాదులో మళ్ళీ వస్తే (రిలీజ్ అయితే)చిటీ మొత్తంలో రెండు నెలలపాటు తిరిగేది. ఒక థియేటర్లో మిస్స్ అయినా వేరొకచోట దొరకబుచ్చుకోవచ్చన్న మాట.  తర్వాతి కాలంలో  స్నేహితులతో ఎవరితోనైనా సినిమాల ప్రసక్తి వస్తే ఈ సినిమాలో ఉన్న సంభాషణలు, పాత్రలు, వేష భాషలు, పాటలు, సెట్టింగులు, యుద్దదృశ్యాలు దిలీప్ కుమార్, మధుబాల, పృద్వీల నటన అనేకమైన విషయాలను ఊదరగొట్టి వాళ్ళు చూసేలాగో, చూడకపోతే నేనే ఖర్చులు పెట్టుకొని ఎంతదూరమైనా సినిమా ఎక్కడ ఆడుతుందో తెలుసుకొని చూపించేవాణ్ణి. అలా అలా వంద సార్లకు పైగానే ఈ సినిమాను చూసాను.
నేనూ మిమిక్రీ ప్రాక్టీసు చేసిన రోజుల్లో ఈ సంభాషణల్లోని వైరుధ్యాన్ని చెప్పేవాణ్ణి.(పెద్దపెద్ద పోగ్రాములు ఇవ్వలేదులెండి)

బహుశ అందులోని సాహిత్యం తర్వాతి కాలంలో నా కవిత్వంపై ఏమైనా ప్రభావంచూపిందా అనిపిస్తుంది. నా వీపు నాకు తెలియదు కదా! ఎవరైనా చూసి చెప్తే కదా తెలిసేది.

వయసులో వచ్చిన ఆలోచనా మార్పులవల్ల సినిమాలమీద అంత ఆసక్తి లేకపోయినా అదోక గొప్ప అనుభూతే.

చాలా మందితో ఈ సినిమా గురించి మాట్లాడినా, కొదరికి సినిమా చూపించినా ఒక్కరి ప్రశంస నన్ను ప్పట్లో గర్వపడెలాచేసింది. మా అక్క ఒకరు టీచరు వుండేవారు. వాళ్ళ స్కూలు కరెస్పాందేంటు మరుయు ప్రిసిపాల్ ఒక ముస్లిం. ఓ సందర్భంలో వారికి నేను సినిమా గురించి సంభాషణలగురించి చెప్పాను. తర్వాత మర్చిపోయాను. తర్వాత ఒకసారి నన్ను పిలిపించి అభినందనలు చెప్పారు. ఈ మద్యే ఆ సినిమా చూసానని ఎంతగానో నచ్చింది. నీ విశదీకరణ బాగుంది అని.


ఇందులోని పాటల సాహిత్యము, బాణీలు సంగీతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివే అనిపిస్తాయి ఇప్పటికీ.

ప్యార్ కియతో డర్నాక్యా అంటూ ప్రేమికులకు ధైర్యాన్ని నూరిపోసిన విప్లవగీతమనిపిస్తుంది నాకు. అప్పటి కాలమానం ప్రకారం అది గొప్ప విప్లవానికి నాంది.

అప్పట్లో ఆ పాట సెట్టుకోసం లక్షరూపాయలు ఖర్చు చేయడం సినిమా ఆఖరి ఘట్టంలో దాన్ని పగలగొట్టటం పెద్ద చర్చే అని చెప్పవచ్చు.
ఈ పాట ఒక్కటే కలర్‌లో వుండటం ఒకవిషేషం. మిగతా సినిమా నలుపు తెలుపులొనే వుంటుంది.


No comments: