Sunday, December 2, 2012

సినిమాలు జీవితానికి ఏమి ప్రభావితం చేసాయి?



(నన్ను నేను తరచిచూసుకొనే ప్రయత్నం)

ఇంటమీడియెట్ రెండవ సంవత్సరంలోకి వచ్చేసరికి కొంట స్వేచ్చ దొరికింది. ఇంటిలో నేను భయపడెది నాన్నగారికి ఒక్కరికే. ఆయనకు నాకు సమయాలు కలిసేవి కావు. దాన్ని గమనించిన నేను నాకు అనువుగా మలచుకోవడం ఎలా అని ఆలోచించాను. పెద్దగా చించుకోకుండానే దొరికింది. ఆయనకు బట్టలు ఇస్త్రీ చేసిపెట్టడం. అప్పట్లో ఇస్తీ చేయడం పెద్దపనిగా అనిపించేది. చాకలికి ఇస్తే కొన్నిసార్లు ఆలస్యం అయ్యేది. కొంచెం కష్టమైనా  ఆపని ఎంచుకున్నాను. ఎప్పుడూ రెండు-మూడు జతల బట్టలు సిద్దంగా వుండేటట్లు చూసేవాణ్ణి. ఇలా చేయడంవల్ల నాకు రెండు ప్రయోజనాలు జరిగాయి. మా నాన్న గారినుండి నాకు చదువుపై వత్తిడి లేకపోవడం. రెండు ఆయన విడిచిన బట్టల్లో అప్పుడప్పుడూ దొరికే చిల్లర. ఇది కొంత నన్ను సినిమాల ఆసక్తిని పెంచిందేమో అనిపిస్తుంది. మొదట్లొ చిల్లర కనబడితే తిరిగి ఇవ్వడమో లేకపోతే ఇందులోవున్నాయి ఫలానా పనికి వాడాను అని ఎవరో ఒకరికి చెప్పడమో చేసేవాణ్ణి. తర్వాత తర్వాత ఆలోచన మారింది. నా పెట్టె(బట్టలకోసం పెట్టెవుండేది) అందులో వేసేవాణ్ణి. పెద్దమొత్తాలు నొక్కేసిన సందర్బాలు ఉన్నాయి. ఇంటిలో అందరికి నేను ఒక సేవింగ్ బ్యాంకు అనుకునేవారు. అసరు రహస్యం వారికి తెలియదండోయ్.  అమ్మకోసం ఒక పని చేసేవాణ్ణి. అందులోనూ డబ్బు ప్రమేయం వుంది కాబట్టి. కాలేజినించి ఇంటికి వచ్చే దారిలో సాయంత్రపు కూరగాయల మార్కెట్టు వుండెది. వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు తెచ్చిపెట్టేవాణ్ణి. కూరగాయలకోసం అమ్మ ఇచ్చేదానిలో చిల్లర నొక్కేసేవాణ్ణి. (చిల్లర అంటే 10 పైసల నుంచి 1రూపాయి లోపు అంతే).


ఇలా దాచుకున్నది సినిమాలకు ఖర్చు చేసేవాణ్ణి. రిలీజ్ అయిన ప్రతి చినమా మొదటి మార్నింగ్ షో చూడాల్సిందే. అప్పట్లో మొదటిరోజు షోలకు ఎక్కువ పాన్స్ వుండేవారు. ఫాన్స్ మద్య గొడవలు అయిన సందర్భాలు వున్నాయి. నాకు హీరోతో పనిలేదు, ఏకాసు టికెట్టు దొరికిందీ అనే ప్రసక్తీ లేదు. సినిమా చూసానా లేదా అంతే! తాకూవంటే 75 పైసలు, ఎక్కువంటె 4 లేదా 5 రూపాయిలు వుండేవి.

ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్.ల మధ్య పోటీ తగ్గి, కృష్ణ మధ్య పెరిగింది. శోభన్‌బాబు   సినిమాలు కూడా బాగానే ఆడేవి. కృష్ణంరాజు, రామకృష్ణ, హీరోల మధ్య పోటీ వుందో లేదో తెలియదు కానీ ఫాన్స్ మధ్య వుండేది. అప్పుడె రజనీ, కమల్‌లు కొత్త తరాన్ని ఇచ్చారు. 

కొన్ని సినిమాలు ఏదో ఒక అంశం నచ్చి ఒకటికి నాలుగు సార్లు చూడటం అలవాటయ్యింది. అలా చూసిన సినిమాల జాబితా నేను ఇప్పుడు ఇవ్వలేను.

ఇంతకీ నేను చెప్పేది ఏమంటే ఇవన్నీ నా ఇంటర్మీడియెట్ చదువుపైన ప్రభావాన్ని చూపాయి. లెక్కల్లో ఫెయిలవ్వడం, బోర్డువారు తప్పుడు మార్కుల లిస్టు పంపడం, దాని సవరణకోసం ఎదురు చూపులో కొంత కాళీ సమయం దొరకడం, మరిన్ని సినిమాలు చూడటానికి దోహద పడింది. ఇంజనీరింగ్ చదవాలనౌకున్న నేను దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాను.

హిందీ సినిమాలు కొంత భాషను మట్లాడటానికి, సంగీత సాహిత్యాలను ఆస్వాదించడానికి దోహద పడ్డాయి. బహుశ నేను ఇప్పుడు నేను రాస్తున్న కవిత్వానికి అక్కడ పునాది పడిందేమో అనిపిస్తుంది. 

కొన్ని సినిమాలలోని సాంఘిక ఆదర్శాలు ప్రభావాన్ని చూపాయనే చెప్పాలి. కొన్ని ఆదర్శాలు జీవితంలో పాటించడానికి, అవగాహన చేసుకోడానికి, చర్చించడానికి వేదికయ్యాయనే చెప్పాలి. ( ఆ అద్ర్శాలు నాకు ఎటువంటి ఫలితాలనిచ్చాయి అనేది నేను ఎప్పుడూ బేరీజు వేసుకోలేదు కాబట్టి వాటి గురించి చెప్పలేను) 

100 సార్లు కంటే ఎక్కువసార్లు చూసిన సినిమాలు మూడున్నాయి

1 శంకరాభరణం - శంకర శాస్త్రి ఆదర్శం నన్ను ప్రభావితంచేసింది

2. మొఘల్-ఎ-ఆజమ్   - సాహిత్య పరంగా నన్ను ఉత్తేజ పరిచింది 

3. షోలే - హెలెన్ డాన్స్‌కు  ఇప్పటికీ ఫిదాయే. ఆ డాన్స్‌కోసం చూసిన సందర్బాలు ఎక్కువ. మిగతా కారణాలన్నీ తర్వాతే. (కొన్ని నిజాలు ఇలాగే వుంటాయి కదా!)    






1 comment:

anrd said...

సమాజంపై సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉంటుందండి.