Friday, November 30, 2012

ప్రశ్నలు? ప్రశ్నలు?? ప్రశ్నలు ??? ఇప్పుడు నన్ను వేధిస్తున్నాయి


నిస్సత్తువ ఆవరించిందా??
52 ఏళ్ళకే జీవితం అయిపోయిందా???
సాధించినదీ ఏమీ కనబడటంలేదు
సంపాదించినదీ ఏమీ కనబడటంలేదు

పిల్లలు నా బలం అనుకున్నాను
వారి అభిప్రాయాలు భిన్నమైనప్పుడు బలం ఎలా అవుతారు?

సాకేతికాలు, విధానాల మార్పు పేరుతో గత సంవత్సరాలుగా చేస్తున్న పని పరిగణలోకి రావడంలేదు.
మార్పుల్లో నా భాగ స్వామ్యం లేకుండా పోతుందా? లేకుండాచేస్తున్నారా?
నేను అందుకోలేకపోతున్నానా?

నా గుండె ఆపరేషను నాకు నా పని సామర్ధ్యానికి  బలహీనమా??

చదివిన పుస్తకాలు, పోగుచేసుకున్న పుస్తకాలు షెల్పుల్లో మగ్గాల్సిందేనా??

అవి నాకు తిండి పెట్టలేవా?? రోజూ నా తిండిని వెదుక్కోవససిందేనా??

నేను నేనుండాల్సిన స్థితికంటే ఎక్కువా ఆలోచించి అందుకోలేకపోయానా??

నా తగ్గింపు తత్వం నాకు, నా ఎదుగుదలకు ప్రతిబంధకం అయ్యిందా??

నా సామాజిక వర్గానికి అనుకోకపోవడం  ఆదర్శం అనుకున్నా?? అది తప్పు అయివుండచ్చా??

ప్రశ్నలు? ప్రశ్నలు?? ప్రశ్నలు ??? ఇప్పుడు నన్ను వేధిస్తున్నాయి



2 comments:

Anonymous said...

కొద్దిపాటి తేడాతో అందరి పరిస్థితి ఇలానే ఉండవచ్చు. ఇవే ప్రశ్నలు ఉదయించవచ్చు. మార్పును స్వాగతించాలి. ఉన్న పరిస్థితుల నుంచి కొంచం భిన్నంగా ఆలోచించాలి, కొత్త వ్యాపకాల గురించి ఆలోచించాలి. శరీరం లో సత్తువ ఉన్నంత వరకు మనకు అవసరమైనది మనమే సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం

జాన్‌హైడ్ కనుమూరి said...

Anyonymous gaaru

నిజమే మీరన్నది

మార్పును స్వీకరించలేని ఒకానొక సందర్భంనుంచి వచ్చే మాటలవి. మార్పుపై తిరస్కారమేమీ కాదు. బుజాన్ని ఎత్తుకోలేని ఒకానొక నిస్సత్తువ.
కాలం ఇలాగే వుండిపోదు..... అయిన మనసు పడే స్థబ్దత మధ్య ఒక వూగిసలాట