Monday, November 26, 2012

వంద(100)సార్లు చూసిన సినిమా - ఓ జ్ఞాపకం



మచిలీపట్నం

చిన్నక్క బి.ఇడి. చదువుతోడి. రికార్డులు బొమ్మలు వగరా వగైరా సాయంచేయడానికి నేను వెళ్ళాను. బృందావన్ సినిమా వెనుక రైసు మిల్లులు వున్నాయి వాటి వెనుక రెండు రూములు. సాయంత్రాలు అక్క స్నేహితులు వచ్చి అన్ని రకాల కబుర్లు చెప్పుకొని కొంత చదువుకొని వాళ్ళ రూములకు వెళ్ళెవారు. 

నాకు కొద్దిగా పెన్సిలు తిప్పడంలోనూ, ఇండియన్ ఇంకుతో బ్రస్సు తిప్పడంతోనూ పరిచయం వుండటంవల్ల అవసరమైన వాళ్ళకి చార్టులువేసి, బొమ్మలు వేసి నా జేబుఖర్చులు నింపుకొనేవాణ్ణి. 

అక్క కాలేజికి వెళ్ళాక నాకు పెద్దగా పనివుండెది కాదు. అలాగే ఓరోజు కాళీగావుండి ఆలా ముఖ్యమైన రోడ్లన్నీ సర్వేచేస్తున్నాను. ఆ సర్వేలో కొన్ని సినిమా హాలులు కనిపించాయి. (సినిమాహాలు పేరు గుర్తు రావడం లేదు) కొత్త సినిమా విడుదల అయ్యింది. నేను సినిమాకని బయలుదేరలేదు కాబట్టి జేబు పెద్దగా బరువుగా లేదు. అయినా వున్నంతలో చూద్దంలే అని హాలు లోపలికి వెళ్ళా. అది ఆరోజే విడుదలయ్యిన సినిమాకి ఉదయం ఆట. బుక్కింగు వైపు చూసాను ఎవ్వరూ కనబడలేదు. టికెట్లు అయిపోయాయనుకున్నా కాని తీరా చూస్తే చాలా ఖాళీగా వుంది. లోపలికి వెళ్ళాలా వదా అని తటపటాయించాను. సినిమా మొదలయ్యిన దగ్గరనుండి నేను వింత మోహానికి లోనయ్యాను. ఇంటర్వెల్‌లో బయటికి కూడా రాలేదు. బయటికి వచ్చేటప్పుడు చూస్టే చాలా తక్కువమంది వచ్చారని అర్థమయ్యింది. నాకు సినిమా మళ్ళీ చూడాలనిపించింది. 

బహుశ నాకు అలా అనిపించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి. ఇలా ఇంతకుముందు "పదహారేళ్ళా వయసు" ఉదయం ఆట, వెంటనే మాట్నీ చూసాను. 

జేబు కొంచెం బరువు తగ్గినట్టు అనిపించి రూముకు పరుగెత్తి, కడుపులోకి కొచెం అదరా బదరా మింగి మాట్నికి పరుగెత్తాను. 
రూముకు వచ్చి ఎంతలేపినా లేవనంతగా నిద్రపోయాను. 

***

10 గంటలప్పుడు తినడానికి అక్క లేపితే బలవంతంగా లేచాను. అప్పటికి అక్క స్నేహితులు వరండాలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. నేను తింటూ సినిమా సంగతి చెప్పా. నా మాటలు విన్న వాళ్ళు మరుసటి రోజు ఎలాగైనా సినిమా చూడాలని ప్లాన్ చేసుకున్నారు. నేను తిని మండుకున్నా సినిమాయే నాకు కళ్ళలో మెదిలింది.

***
నేను చెప్పిన కథనరీతికి ముగ్దులై  మరుసటిరోజు సినిమాచూసివచ్చారు. ఒకటే తిట్లు నాకు. వాళ్ళకి నచ్చలేదెందుకో.

వాళ్ళతో చాలా రోజులు వాదోపవాదాలు నడిచాయి. ఓ వారం తర్వాత వాళ్ళే మళ్ళీ చూసి నాకు సారీ చెప్పారు.

* * *
ఇంతకీ ఆ సినిమా శంకరాభరణం

* * *
గుడివాడలో, రాజమండ్రిలో, ఏలూరులో ఆ సినిమా ఎక్కడ కనబడినా చూసాను. ఏలూరులో విశ్వశాంతి హాలులో ఆడుతుండేది. ఒకవారంలో నాలుగు సార్లు వెళ్ళేటప్పటికి ఒకడు స్నేహితుడయ్యాడు. మానేజిమెంటు టికెట్లును గురించి చెప్పాడు, అవి కొంత కన్సెషనుకు తెలిసిన వాళ్ళకు ఇస్తారు. అవి తీసుకొని దాదాపు ఓ వంద(100)సార్లు పైగా చూసాను. (నాకు షీల్డు ఎవ్వరూ ఇవ్వలేదు) 

* * *

మొన్న టివిలో వస్తుంటే చూడలనిపించలేదు ఎందుకో అర్థం కాలేదు. 



1 comment:

astrojoyd said...

వయసు-అభ్రుచుల్లో వచ్చిన మార్పుల వల్లా మీకు ఆ సినిమా ఇప్పుడు చూస్తే పేలవంగా కనిపిస్తోంది..ఇందులో అర్ధం కాక పోడానికి ఏముంది మాస్తారూ