Photo from Sakshi
గాయమైన గుండె
బాగానే పనిచేస్తుందంటారు డాక్టర్లు
ప్రతినిముషం లాగి పట్టే బిగువు ఏమనాలి
నువ్వు పలకరిస్తావు అని
ప్రతినిముషం లాగి పట్టే బిగువు ఏమనాలి
నువ్వు పలకరిస్తావు అని
ఎవ్వరికోసమో ఎదురుచూస్తుంది మనసు
ఎవ్వరులేని చోట నిశబ్దంలోంచి
నాలోంచి నాలోకి ఏదో స్వరం మాట్లాడుతుంది
ఆ ఎదురుచూపు - నిశ్శబ్దాల మధ్య
ఎవ్వరులేని చోట నిశబ్దంలోంచి
నాలోంచి నాలోకి ఏదో స్వరం మాట్లాడుతుంది
ఆ ఎదురుచూపు - నిశ్శబ్దాల మధ్య
వూగిసలాడుతుంటాను
గుండె ఇంకా బరువుగానే వుంటుంది
గుండె ఇంకా బరువుగానే వుంటుంది
తప్పటడుగుల చిరునవ్వుల్తో
సమస్తాన్ని తుడిచెయ్యాలనుకుంటాము
ఆ స్వచ్చతకు నడవలేక పాట్లు పడుతుంటాను
మిత్రులారా!
నాకో వింజామర కావాలి
నాలో నేనై పాడుకునే సంగీతాన్ని వెదజల్లాలి ఆ వింజామర
కలగనేందుకు నా కనులు అలసటచెందాయి
అక్షరాలు వాక్యాలై
కొత్త సత్తువను నేను శ్వాసించాలి.
సమస్తాన్ని తుడిచెయ్యాలనుకుంటాము
ఆ స్వచ్చతకు నడవలేక పాట్లు పడుతుంటాను
మిత్రులారా!
నాకో వింజామర కావాలి
నాలో నేనై పాడుకునే సంగీతాన్ని వెదజల్లాలి ఆ వింజామర
కలగనేందుకు నా కనులు అలసటచెందాయి
అక్షరాలు వాక్యాలై
కొత్త సత్తువను నేను శ్వాసించాలి.
1 comment:
అవును కొన్ని సమయాలలో వింజామరలు కావాలి,.బాగుందడి.
Post a Comment