Thursday, November 29, 2012

సినిమాలు - నా అనుభవాలు, జ్ఞాపకాలు




ఓ సినిమా జ్ఞాపకంగా పోస్టు రాసిన తర్వాత ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే నేను చూసిన మొదటి సినిమా ఏమిటి థియేటర్లో చూసిన ఆఖరి చినిమా ఏదని?

మా ఇంటిలో సినిమాలు చూడటం నిషిద్దంగా వుండేది, ఇప్పటికీ వుంది కూడా. ఎవరైనా వెళ్ళి చూసివచ్చినా చాటుగానే తప్ప బహిరంగా కాదు. ఆ అలవాటు ఎందుకో ఇప్పటికీ కొనసాగుతూనేవుంది.

బహుశ 1968, 69లో అనుకుంటా తాజమహల్ (హిందీ) చూసిన గుర్తు. పోలవరం (పశ్చిమ గోదావరి జిల్లా) లో భాను సినిమా హాలు వుంది. అప్పట్లో హిందీ సినిమాలు వచ్చేవి కాదు. అందుకని కొందరు ఊరి ప్రముఖులు, ఉద్యోగస్తులు కలిసి ప్రత్యేకంగా ఒక షోను వేసుకొనేవారు. దానికోసం అందరి ఇళ్ళనుండి కుర్చీలు పోగుచేసేవారు. మా ఇంటినుండి నాలుగు కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఆ కుర్చీలు నేపద్యంలో ప్రతేక సినిమా గురించి తెలిసింది. ఎలాగో సినిమా చూసాను. సినిమాలో ఒక్క సీను తప్ప ఏమీగుర్తు లేదు. కలువ పువ్వులో ప్రేమలేక పెడ్తే  అది నీళ్ళలో అలా అలా వెళ్ళడం. ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానో.

హైస్కూలుకు వచ్చాక ఏలూరు వచ్చేసాం.  8వ తరగతి వరకు గవర్నమెంటు స్కూలు సాగిన చదువు, వాతావరం వల్ల 9వ తరగతి జేవియర్స్ హైస్కూల్లో క్రమశిక్షణ కఠిన మనిపించేది. దైర్యంచేసి ఒకసారి  నేను నా మిత్రుడు మద్యాహ్నం స్కూలు ఎగ్గొట్టి "రాధమ్మ పెళ్ళి" సినిమాకు వెళ్ళాము. మరసిటిరోజు మాక్లాసు టిచరుకు అది తెలిసింది. ఇక పనిష్మెంటుల పర్వం మొదలయ్యింది. క్లాసు గుమ్మంలో ఒక పీరెడ్ మోకాళ్ళపైన మిగతా క్లాసులు గుమ్మం దగ్గరే క్రింద కూర్చోవాలని పనిష్మెంటు. అలా కూర్చోవడం ద్వారా స్కూలు మొత్తం నా సినిమా సంగతి, పనిష్మెంటు సంగతి తెలిసిపోయింది. మా నాన్న గారితో పరిచయమున్న మాష్టారు ఇదిచూసి పనిష్మెంటు ఇచ్చిన మాష్టారితో మాట్లాడి మద్యాహ్నం నుండి క్లాసులోపలికి పంపారు. బ్రతికిపోయాను అనుకున్నా. ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న గారు బెల్టు తీసారు. విషయం నాకర్థం అయ్యేలోపు నాలుగు వాతలు, విషయం మా నాన్నగారి దగ్గరికి చేరిందనే సంగతి  అర్థమయ్యింది.    

***

ఇంతర్మీడియెట్ రెండవ సంవత్సరం తర్వాత సినిమా పిచ్చి ముదిరిందనే చెప్పాలి. ఏలూరు నుండి విజయవాడ, రాజమండ్రి వెళ్ళి సినిమా చూసిన రోజులున్నాయి. రైలు ప్రయాణాలన్నీ సాహసాలే అందులో.

***
మద్య ప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు దగ్గరలో సినిమా హాలు లేకపోవడం వల్ల సినిమా పిచ్చి కొంత తగ్గినట్లు అనిపించినా ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు వరుసగా ఏలూరులో వున్న కొత్త సినిమాలన్నీ చూసేవాణ్ణి. తీరా తిరిగి వెళ్ళాక స్నేహితులు ఎవరితోనైనా సినిమాల గురించి మాట్లడితే కథలు కలగా పుగం అయ్యేవి.
***

1987లో పెళ్ళి చెసుకున్నాక హైదరాబాదులోనే అప్పుడప్పుడు ఇద్దరం వెళ్ళే వాళ్ళం. ఆమెకు సినిమాలపై ఆశక్తి వుండేది కాదు. ఇంగ్లీషు సినిమాలంటే అస్లీల సినిమాలు అనే అభిప్రాయం వుండేదామెకు. అది పోగొట్టడానికి కొన్ని సినిమాలు చూపించాను.

ఇక సినిమాలు థియేటర్లో చూడటం మానేయడానికి నాకు నేను, పరోక్షంగా నా ప్రక్కటెముక కారణం.

ఎర్రగడ్డ గోకుల్‌లో "రాం తేరీ  గంగా మైలీ హోగయీ" సినిమా వచ్చింది. మొదటి ఆటకు వెళదామని త్వరగా వచ్చేస్తానని రడీగా వుండమని చెప్పాను. తీరా ఆరోజు ఆలస్యంగా ఇంటికి వచ్చను సరికదా అసలు అమెను సినిమాకు తీసికెళ్ళాలి అనేవిషయాన్ని మర్చిపోయి స్నేహితుల్తో కలిసి మందు పార్టీకి వెళ్ళాను అదీ సంగతి. పాపం అమె అనుకుంది ఒకవేళ మొదటి షో కాకపోతే రెండవ షోకు వెలదామనుకుంది. నేను వచ్చేసరికి ఆ సమయం కూడా దాటిపోయింది. అదీ సంగతి.
ఇక ఒట్లు మీద ఒట్లు పెట్టుకున్నాం
నాతో సినిమాకు రానని ఆమె, అమె లేకుండా సినిమాకు వెళ్ళనని నేను
ఆ మాటమీదే నిలబడి, కట్టుబడి ఉన్నాము.

తర్వాతి కాలంలో "నువ్వే కావలి", టైటానిక్ రెండే మేము చూసిన సినిమాలు.
తర్వాత తర్వాత సినిమాలపై ఆసక్తి తగ్గిపోయింది.  


No comments: