Saturday, July 16, 2011

రెవ. ఆర్.ఆర్.కె. మూర్తి గారు ప్రభువు మహిమలో నిద్రించారు.

Acharya Rayasam Radha Krishana Murthy well known to the world as RRK Murthy
Born 1927 February, 1927
Expired 2011 July, 2011
సరలమైన తెలుగులో బైబిలు పాటాలను అనేకులకు రేడియో ద్వారా అందించి చివరిశ్వాసవరకు కృషి చేసిన రెవ. ఆర్.ఆర్.కె. మూర్తి గారు ప్రభువు మహిమలో నిద్రించారు.

ఆయన చేసిన కృషి నిరంతరము మనముందువుంటుంది. Almost 57 years

Prayer will be at 2 PM at Ramanthapur baptist Church

సమాధి 17.7.2011 సాయత్రం 3 గంటలకు Hyderabad, నారాయణగుడలోని సమాధులతోటలో జరుగుతుందని విన్నాను
To read his Testimony : http://www.uecf.net/rrk_testimony.pdf

5 comments:

వేణు said...

ఆరార్కే మూర్తి గారి మృతి గురించి ఈరోజు ఉదయం హైదరాబాద్ సిటీ ఎడిషన్లోని ప్రకటన ద్వారా తెలిసింది.

మూర్తి గారి ఆధ్యాతిక భావజాలం నాకు సరిపడదు కానీ, ఆయన వాయిస్ లోని మృదుత్వం; చెప్పదల్చుకున్న విషయాన్ని శ్రోతలకు ఆప్యాయంగా, హాయిగా.. ఒక సమ్మోహన శైలిలో వివరించి చెప్పే పద్ధతి ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. నాస్తికులైనా, ఏ (మత)భావాలు ఇష్టపడేవారైనా అధ్యయనం చేయదగ్గది. ఆ మధ్య ఆరార్కే మూర్తి గారు తన జీవిత చరిత్ర ను చిన్న పుస్తకంగా తెచ్చారు; చదివాను.

Anonymous said...

రెవరెండ్ ఆర్ ఆర్ కె మూర్తి గారు స్వర్గస్థులయ్యారని తెలిసి ఎంతో బాధ పడ్డాను. నా చిన్నపుడు రాత్రి ఏడు-ఏడున్నర మధ్యలో ఆయన ప్రవచనాలు రేడియోలో వస్తుండేవి!నెమ్మదిగా, స్వస్థత చేకూర్చే స్వరంతో నిశ్చలంగా, తొణక్కుండా, ఒక రకమైన ఏకాగ్రతతో ఆయన చదువుతుంటే హిప్నటైజ్ చేస్తున్నట్టు ఉండేది.

మా బంధువు ఒకావిడ, (మా అమ్మగారి కజిన్) ఉబ్బసంతో బాధపడుతూ, అది ఒక స్వస్థత సమావేశంలో కొంత నెమ్మదించడంతో బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళింట్లో రేడియో ఉండేది కాదు. వాళ్ళిల్లు మా ఇంటికి దగ్గరే కావడంతో మూర్తిగారి ప్రవచనాలు వినాలని ఆ సమయానికి మా ఇంటికి వచ్చి నాన్నగారిని అడిగి ఆ స్టేషన్ ట్యూన్ చేయించుకుని మరీ వినేవారు.

ఆయన్ని ఎప్పుడైనా చూడాలని అనుకునేది. ఆవిడ చూడలేదు గానీ, ఇప్పుడు నేను మీ బ్లాగులో ఫొటో మాత్రం మొదటి సారి చూశాను.

ఎందరికో తన ప్రవచనాలతో మనశ్శాంతి కల్గించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్న్నాను.

సుజాత

aravind Joshua said...

he inspired a generation of believers& many more. would miss him. He fought a great fight of faith& I am sure he would recieve his reward. may God be with him

aravind Joshua said...

he inspired a generation of believers& many others. would miss him he fought a great fight of faith. I am sure he would recieve his reward with God. may God bless him!

vrdarla said...

rrk murthy garu chanipoyari telisi chaalaa baadanipistundi. nenu chinnappudu radio lo aayana prasangaalanu vinevadini. aayana ceppina vilasa -valas-pulasa katha chaalaa goppagaa untundi. chinna chinna kathalatho goppagaa inspire chesevaru.