పల్లకిలో ఊరేగింపు
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధస్సు
మేనిలో క్రొత్తసొగసు
ఒహోం ఒహోం హోయ్
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధస్సు
మేనిలో క్రొత్తసొగసు
ఒహోం ఒహోం హోయ్
ఫ్రీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు
గుబాళింపుల పరిమళాలై
ముందునడుస్తూ మున్ముందుకు నడుస్తూ
కలలే ఓ చిగురాకు
పండిన గోరింటాకు
నున్నని బుగ్గలపై చేరి
మెరిసి మురిపిస్తూ మైమరపిస్తూ
గుసగుసలాడే ఆశల ఊసులు
బుస బుస పొంగే కోరికల తూపులు
రాగాలై సరాగాల మేళాలై
వీధుల్లో వినువీధుల్లో ఆలపిస్తూ
5 comments:
"ఫ్రీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు"
ఈ లైన్స్ భలే నచ్చాయి
బాగా రాసారండి. నాకు కూడా ఫ్రీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు బాగా నచ్చాయి
కొత్త పెళ్ళికూతురు మనఃస్థితిని మీదైన భాషలో, భావంలో అభివర్ణించారు జాన్ గారు......సింబాలిక్ గా ఇది పెళ్ళికూతురు గురించే కాక వయసులో ప్రతీ అమ్మాయి మనసు ఇలానే ఉంటుందనే కదా చెప్పదల్చుకున్నారు?......అభినందనలు....మీ వాసుదేవ్
ఫ్రీజేర్ గీజేర్ ప్రయోగం చేసేటప్పుడు దానికి ప్రతీక ఏంటి మానస్ ఫ్రీజారా దేహపు గీజరా ....మాడెర్న్పెల్లికుతురన్నమాట మరి పల్లకి ఎందుకో...ప్రేమతో..జగతి
@ Murali
@ రసజ్ఞ
@ వాసుదేవ్
@ జగతి
thanks for your comments
Post a Comment