Thursday, June 30, 2011

నేను - సముద్రం- విశాఖ

ఆపుడప్పుడూ చూసే
సముద్రమంటే ఎదో భయం

దూరాన్నుంచి చూస్తున్న
కెరటం ఎగసిపడి
నన్నెప్పుడూ తనలోకి లాక్కోలేదు

అడుగులు ముందుకేసినప్పుడు
పాదాన్ని తాకిన నురుగు
అనంత అనుభవాల లోతుల్లోకి
స్వాగతం పలుకుతోంది

హోరెత్తే ధ్వని పదే పదే చెబుతోంది
అలలపై తేలియాడటం
అలల్లో మునగడం
నా చేతుల్లోనేవుందని.

3 comments:

Afsar said...

బాగుంది, జాన్!
అవును...మునగడం తేలడం మన చేతుల్లోనే వుంది, నిజం!

MURALI said...

బాగుంది. వైజాగ్ ఎప్పుడెళ్ళారు

Anonymous said...

ee poem nakosamaa vow i m honored john....thank u soooo much inthakee meeru samudramu visakha unnaru nenekkadaaaa?...love j