సాహితీ మిత్రుడు ఈగ హనుమాన్ నాలో ఏమిచూసాడో గానీ నానోలు రాయమని కాక రాయగలవు అంటూ పదేపదే ప్రోత్సాహిస్తుంటే చిన్న ప్రయత్నంగా ఇలా మీముందుకు వచ్చాయి.
నానోలు
1
రాలే
శిశిరం
వసంత
ఆగమనం
2
కడిగిన
కన్ను
మలినరహిత
మనసు
3
మరిగే
ఆలోచనలు
మనసు
రణరంగం
4
విజయం
అపజయం
బొమ్మా
బొరుసు
5
సీత
గీత
దాటితే
యుద్దమే!
6
చిగురు
వగరు
కోకిల
వసంతగానం
7
రెక్కలు
ఉహలు
కలలు
అందమే!
8
పప్పు
ఉప్పు
నిప్పు
వంటకమే!
9
నిజం
నిశ్శబ్దం
నిర్మానుష్యం
భయపెట్టేవే!
10
ఎవరి
లంకకు
వారే
లంకేశ్వరులు
.....
ఇంకా నానోలకోసం దర్శించండి
http://nanolu.blogspot.com/2009/03/blog-post_22.html
5 comments:
బాగున్నాయి సార్
కనుమూరి గారు, ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నాను, అవును, మీకు నానోల్లో కవిత్వాన్ని పండించే క్లుప్తతపై ప్రభుత్వం ఉంది. మీ "హసీనా" చదివిన వాన్ని కాబట్టి చెబుతున్నాను. ఇంకా తాదాత్మ్యపడి, మరి కొన్ని నానోలకోసం తపించండి, ఎంత చక్కగా రాయగలరో చూడండి..
ఈగ హనుమాన్
తెలుగు అభిమాని
స్పందనకు నెనరులు
హనిజీ
స్పందనకు నెనరులు
కనుమూరి గారు!
ఈ నెనర్లు అనే పదం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, దీని బదులుగా, ధన్యవాదాలు అన్నదే బావుంటుంది. కాబాట్టి ఇకనుండి నెనర్లకు స్వస్తి చెబుదాం.
ఇటువంటి వాటి కోసమనే "బ్లాగ్దేవి (blog-devi.blogspot.com)" బ్లాగును ప్రారంభించాను, మీ స్పందన కోరుతూ...
మీ
ఈగ హనుమాన్.
Post a Comment