Tuesday, February 24, 2009

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

హితులెవ్వరూలేని ఈ నిశ్శబ్దపు రాత్రి

చుట్టూ చీకటినిండుతుంటే

ఈ ప్రదేశమంతా భయంతో నిండినప్పుడు

నీవు ఇక్కడవుండి నా భయం పోగొడతావని

నాలో చిరునవ్వు పూయిస్తావని

నా ఆశ!

దురదృష్టం నీవిక్కడలేవు

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

ఇక ఎవరు పట్టించుకుంటారు నన్ను

5 comments:

Anonymous said...

కవిత చాలా బాగుంది.

మనల్ని మనమే పట్టించుకోవాలండి, లేకపోతే మనలోని మరోడో పట్టించుకోవాలి. ఇంకెవరున్నారు పట్టించుకోటానికి.

చావా కిరణ్

జాన్‌హైడ్ కనుమూరి said...

చావా కిరణ్
స్పందనకు నెనరులు
పోగొట్టుకున్న క్షణంలోని స్పందనను గుర్తుచేసుకోవడమే నా చిన్న కవితలోని ఉద్దేశం

ఎవరైనా పట్టించుకోలేదని అక్కడేవుండిపోతే జీవితం కష్టమౌతుంది కదా!

Anonymous said...

బావుంది.

Kathi Mahesh Kumar said...

దురదృష్టం మీద ఎంత ప్రేమ! బాగుంది.

జాన్‌హైడ్ కనుమూరి said...

Mr. Ravi, Mr. Katti Mahesh

స్పందనకు నెనరులు