Monday, October 13, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3
ఇలా రాయవలసిన అవసరం వస్తుందని అనుకోలేదు.
నేను రాసిన విషయము చర్చగా పక్కదారి పడుతున్నందుకు ఈ టపాను రాస్తున్నాను.
1. మతపరమైన దాడుల వార్తలను చూస్తున్నప్పుడు నాకు మా తాత గారు గుర్తుకురావటం జరిగింది. ఆయన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సామాజికంగాను పడిన అవస్థలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు నాకేమనిపించిందంటే దాడులు జరగటమనేది నేడు కొత్తకాదు అని..

దాడుల జరుగుతున్న నేపద్యంలో ఆస్థులను కోల్పోతూ, అస్థిత్వాన్ని కోల్పోతూ కూడా క్రైస్తవ్యాన్ని నమ్ముకోవడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది. అందువల్లనే తరువాత తరానికి అందించారు అని నాకు అనిపిస్తుంది.
మాలాగే హిందువులనుంచి అనేకులు క్రైస్తవులగా మారిన వారు, క్రైస్తవ వ్యాప్తికోసం, క్రైస్తవ సేవకోసం తమ ధనాన్ని, ఆస్తులను విరాళంగా ఇచ్చిన వారు వున్నారు ... అలా అస్తులను పంచీవ్వడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది.

3. మత ప్రచారాన్ని గురించిగాని, మార్పిడులగురించి గాని నేను ప్రస్తావించలేదు.
సామాజికంగా వెనుకబడిన వారు మతం మారుతున్న నేపద్యాలవెనుక అర్థిక, సామాజిక, లౌకిక రాజ్య పర్థితులు వున్నాయి. వాటిని నేను చర్చించడంలేదు.

4 నాకు లేఖరాసిన బ్లాగుమిత్రుడు ఇచ్చినవివరాలు, గణాంకాలు నిజానిజలతో నా టపాకు సంబంధం లేదనిపిస్తుంది.
నేను రాసినది స్వీయానుభవంనుండి నా భావన. అది గణాంకలతో కొలిచేది కాదు. మిత్రుడు రాసినది తన ఇంతకుముందు రాసిన టపాకు కొనసాగింపు. రెండు టపాలు క్రైస్తవ్యానికి సంబందించినవే అయినా విభిన్న పార్శ్వాలకు చెందినవి. ఒకచోట ముడివేయడం సరైయిన పద్దతి కాదేమో!

5. నేను మా తాతనుండి మా పిల్లవరకూ జరుగుతున్న క్రైస్తవ మార్పులను రాద్దామని మొదట అనుకున్నాను కాని పక్క దార్లు పడుతున్న వాదనలు, అభిప్రాయలకు కొంచెం కలతచెంది విరమించుకోవాలనుకుంటున్నాను.

ఏది ఏమైనా క్రైస్తవాన్ని స్వికరించి వడుదుడుకులకు, కాల వత్తిళ్ళకు నిలదొక్కుకుంటూ క్రైస్తవ్యాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నిలుపుకోవడంలో ఏదో మర్మం (సీక్రెట్) దాగివుందనే నా బలమైన నమ్మకం.

----
4829

7 comments:

Rajendra Devarapalli said...

ఎవరో లేఖ గురించి మీరు కలత చెందాల్సిన అవసరమూ లేదు,విరమించాల్సిన అగత్యమూ లేదు,మీరు కొనసాగించండి,మేము ఆసక్తి గా చదువుతున్నాము.మీ అనుభవాలు,మీ కుటుంబసంఘటనలు,చరిత్ర మీరు చెప్తున్న పద్ధతీ బాగా చదివిస్తున్నాయి.మీరు ఆపకండి జాన్ గారు.

నాగప్రసాద్ said...

జాన్‌హైడ్ కనుమూరి గారు,

మతాల్లో మర్మం వుండదు. మనిషి సంకల్పంలో వుంటుంది.

ఇక విషయానికొస్తే రాజేంద్ర కుమార్ గారన్నట్లు మీ అనుభవాలు,మీ కుటుంబ సంఘటనలు, చరిత్ర మీరు చెప్తున్న పద్ధతీ బాగున్నాయి.

Kathi Mahesh Kumar said...

మీరు కానివ్వండి బ్లాగులున్నదే మనగురించి మనం రాసుకోవడానికి. ఆబ్జక్టివ్ గా రాసి ప్రపంచాన్ని ఉద్దరించాలంటే పత్రికల్లో పనిచెయ్యమా!

మీ కుటుంబ చరిత్ర, మీ రచనా శైలి కొన్ని లోతైన భావల్ని పలికిస్తోంది.మమ్మల్ని నిరాశపర్చకండి.

Anonymous said...

Pls..continue ur postings on christianity..vasilisuresh teluguneastamaa..

Anonymous said...

Meeru naavalla kalata chemdi, baadhapaDi kraistavyam meeda Tapaalu rayaTam aapaDam nijamgaa naaku baadhaakaramgaa umdi..meeru naavalla naa blaagu valla baadha paDitea maatram nannu kshamimchamDi..blaagu mukhamgaa meeku saaree chebutunnaanu.. vasilisuresh teluguneastamaa..

Bolloju Baba said...

please continue sir.
if you want you can use comment moderation. but dont stop please.

bollojubaba

జాన్‌హైడ్ కనుమూరి said...

@రాజేంద్ర గారు,
@ నాగ ప్రసాద్ గారు
@ కత్తి మహేష్ గారు

@ బొల్లోజు బాబా గారు

స్పందనకు నెనరులు

@ వాసిలి సురేష్ గారు
నేను కలతచెందినది మీ టపాకు కాదు
మీ టపాకు, నా టపాకు మద్య వ్యత్యాసాన్ని గమనించకుండా మొదలయిన చర్చకు కలతచెందాను.