Friday, October 10, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 2

ముందు రాసిన టపాకు వచ్చిన అభిప్రాయాలు, నాతో మాట్లాడిన స్నేహితుల మాటలను దృష్టిలో పెట్టుకొని మొదటి టపాకు కొనసాగింపుగా రాస్తున్నాను.
నా స్నేహితుల మద్య నడచిన సంభాషణల్లో క్రైస్తవ్యంలోకి జేరటంవల్ల ఆర్థికమైన సహాయం లబిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది ప్రశ్న?
నాకు నా అనుభవంలో అది నిజంకాదనిపిస్తుంది. మా మాన్న, పెదననాన్నలు మిషనరీల దగ్గర పెరిగినప్పటికి స్వయం పాలనను, వ్యక్తిగత స్వేచ్చను వారికి నానమ్మ నేర్పిందనిపిస్తుంది. కేవలము ఒక సామాజికమైన దన్నుకోసము, పిల్లలను చదివించాలనే లక్ష్యముతో మిషనరీల వద్ద పనిచేసింది కాని వారిజీవితాలను మిషనరీలపై ఆధారపడెటట్లు చెయ్యలేదు. తన ఆర్థిక వెసులుబాటుకోసం లేసులు అల్లేది (అప్పట్లో ఉభయగోదావరి జిల్లాలలో లేసులు అల్లి ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేవి), కలుపు పనులకు, కోతలకు, నాట్లకు వెల్లేది. నాన్న రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యొగంచేసారు. వారి సర్టిఫికెట్లలోగాని పిల్లమైన మా సర్టిఫికిట్లలోగాని "కులము" అనేది ఎక్కడా పేర్కొనలేదు.
నేను యవ్వనంలో ఈవిషయాన్ని చాలా సార్లు ప్రతావించినప్పుడు బైబిలులోని కొన్ని వాక్యాలను చెప్పేవారు "ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇవిగో సమస్తమును కొత్తవాయెను" ఈ వాక్యమును ఉదహరిస్తూ మనమిప్పుడు క్రీస్తును కలిగియున్నాము కాబట్టి మనము నూతనమైన వారము మనకి కులంతో ఏమి పని అనేవారు. వేదాంతపరంగా అది బాగున్నట్లు అనిపించినా తన వుద్యొగ ధర్మంలో తరచూ జరిగే బదిలీలలో అద్దేఇల్లు దొరకటం కష్టంగానేవుండేది. చాలా సార్లు ఊరిచివర్లోనో, కొత్తగా కడుతున్న ఇళ్ళలోనో వుండటం నాకు గుర్తు.
ఇక పోతే ఏడుగురు పిల్లలకు ప్రభుత్వంనుండి వచ్చే ఏరాయతీలకోసం ఆశించలేదు, కడుపు కట్టుకొనో అవసరాలను తగ్గించుకొనో, పస్తులు వుండో పిల్లలను చదివించారే తప్ప ప్రభుత్వ రాయతీలవైపు చూడలేదు. దానిక వెనుక దాగిన గొప్ప విశ్వాసమేదో నాకు ఇప్పటికీ అంతు పట్టడంలేదు.
ఒక్కడిగా వున్న మా తాతకు కలిగిన ముగ్గురు పిల్లలనుండి ఇరవైరెండు మంది పిల్లలుగా వృద్ది చెందడం, ప్రతివొక్కరూ చదువుకోవటం వారి పిల్లలు మరింత వున్నతమైన చదువులవైపు వెళ్ళడం ఆ నమ్మకంలోని ఆశీర్వాదమే అంటారు. ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలో అద్దె ఇల్లు దొరకటం అనేది పెద్ద సమస్య.
నమ్మకము, విశ్వాసాల మద్య సాంఘికమైన అవరోధాలు, అవమానాలు ఎదురౌతూనేవున్నాయి.
బలవంతంగా క్రైస్తవ్యంలోకి మారుస్తున్నారనేది మరొక అపవాదు. ఏది ఏమైనా క్రైస్తవులుగా మారటం ఒక సవాలే !
ఎన్ని జరుగుతున్నాఏదో ఒక కులాన్ని ఆశ్రయించి సాంఘిక లబ్ది పొదటం అనేది జరలేదు. ఇప్పుడు మాకుటుంబాలలో అన్ని రకాలైన కులాలనుండి వచ్చిన వారు వున్నారు.
మేమంతా క్రీస్తులో పాలి భాగస్తులమే అనేది మా అవగాహన. సామజికంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిపెడితే ఎటూ చెందని వారముగా మిగిలిపోతామేమో?

9 comments:

Anil Dasari said...

జాన్‌హైడ్ గారు,

క్రిస్టియన్‌గా మీ అనుభవాలని ఎవరినీ నొప్పించని విధంగా రాస్తున్నారు. అభినందనలు. మరి కొన్ని వివరాలని నేను ఇస్తున్నాను.

మత మార్పిడులకి సంబంధించి అంతా తెలుసనుకునేవారికి తెలియని విషయాలు బోలెడున్నాయి. అన్నిసార్లూ దళితులో, మరే ఇతర వెనుకబడిన తరగతుల వారో మాత్రమే మారరు. డబ్బు కోసమో, ఇతర ప్రలోభాల కోసమో మాత్రమే కూడా మారరు.

హిందూ అగ్రకులాలకు చెందినవారు ఊర్లకి ఊర్లే క్రైస్తవంలోకి మారిపోవటం నాకు తెలుసు (ఉదా: గుంటూరు జిల్లా రెంటచింతల. ఈ ఊరు మొత్తం రెడ్లు, వాళ్లలో ఎనభై శాతం క్రైస్తవులు. అలాగే ఫిరంగిపురం, సిరిపురం, రెడ్డిపాలెం, ఇలా అనేక ఊర్లు). ఇది మూడు తరాల క్రితం జరిగిన విషయం. ప్రస్తుత తెనాలి పార్లమెంటు సభ్యుడు బాలశౌరి కూడా అలా తరాల క్రితం మతం మారిన కుటుంబానికి చెందినవాడే. వీళ్లకి ప్రలోభాలకి గురై మత మార్పిడి చేసుకోవలసిన అవసరం లేనంత సిరిసంపదలున్నాయి. మిషనరీ స్కూళ్లు, హాస్పటళ్ల కోసం ఆస్తులు దానం చేసిన వారు వీళ్లలో వందలమంది ఉన్నారు. క్రైస్తవంలోకి మారినా వీళ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మాత్రం హిందూ పద్ధతిలోనే ఉంటాయి.

'మతం మారితే ఈ దేశం మీద ద్వేషం పెరుగుతుంది, ఇక్కడ హిందువులు తప్ప మిగతా వాళ్లంతా దేశ ద్రోహులు' తరహా వితండవాదాలు చేసే మేధావుల కోసం ఇదంతా రాయవలసొచ్చింది. పైన చెప్పిన స్కూళ్లకి ఉదాహరణ విజయవాడ లయోలా కాలేజి, హైదరాబాదు లయోలా అకాడెమీ, రెంటచింతల సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్, గుంటూరు సెయింట్ ఆన్స్ కాన్వెంట్, తెనాలి జెఎమ్‌జె కాలేజ్, ఇంకా మరెన్నో.. పై అన్నిటికీ ఆస్థులిచ్చిన కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటువంటి వారి ఉదార స్వభావంతో ఇన్నేళ్లలో విద్యాబుద్ధులు నేర్చుకుని బాగుపడ్డవారిలో తొంభై శాతం హిందువులే అని నేను ఘంటాపధంగా చెప్పగలను. సైంటిస్టులు, రాజకీయ నాయకులు, దేశం గర్వించదగ్గ క్రీడాకారులు, కళాకారులు, ఇలా మహామహులెందరో ఉన్నారు ఆయా కళాశాలల నుండి వచ్చినవారిలో. ఇప్పుడు కోట్ల విలువ చేసే ఆస్థులని ఆ నాడు నలుగురి మంచి కోసం వదులుకుని, ప్రస్తుతం పేదరికంలో బ్రతుకుతున్న వారు కూడా నాకు తెలుసు. ఇదా దేశ ద్రోహం? ఈ దేశభక్తి కబుర్లు చెప్పే మతవాదులంతా చేసే చేతలంటూ ఏమీ లేవు, కాస్తో కూస్తో మంచి చేసే అవతలి వారిని మిడిమిడి జ్ఞానంతో ఆడిపోసుకోవటం తప్ప.

Bolloju Baba said...

మీరు వ్రాస్తున్న విధానంలో ఏదో మహత్తు ఉంది. చదువుతుంటే ఒక రకమైన ఆరాధనా భావం కలుగుతుంది. మనసంతా ఆర్ధమౌతుంది.

బహుసా ఆమూడ్ లోనే అబ్రకదబ్ర గారు కొనసాగింపు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.

ధన్యవాదములతో
బొల్లోజు బాబా

నాగప్రసాద్ said...

@అబ్రకదబ్ర గారు,
మత మార్పిడుల గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. దయచేసి వాటిని తీర్చగలరు.
1. క్రైస్తవులు మత ప్రచారం ఎందుకు చేస్తారు?
2. అంత డబ్బు ఖర్చు పెట్టి మత మార్పిడులు చేయడం వలన వాళ్ళ కొచ్చే లాభం ఏమిటి?.
3. సేవ చెసే వాళ్ళకు మతంతో పనేంటి?.

Kathi Mahesh Kumar said...

@నాగప్రసాద్: మీరు ప్రశ్న అబ్రకదబ్రగార్ని అడిగినా, నేను కొంత ప్రయత్నం చెయ్యడంలో తప్పులేదనుకుంటాను.

1.చినజీయర్ స్వామి,గణపతి సచ్చిదానందస్వామి,సుఖభోగానంద స్వామి ఇలా కొన్ని వేలమంది హిందూ ప్రచారకులు తమ ప్రభోధనల్ని ఎందుకు ప్రచారం చేస్తారో క్రైస్తవులూ అందుకే వారి మత ప్రచారం చేస్తారు.

సత్యం,ఆనందం అవగతమైందనుకున్న ప్రతిఒక్కరూ వాటిగురించి పదిమందికీ తెలిపి అందరూ ఆ దారిలో సత్యాన్వేషణ చేసి ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. అందుకు జరిగే ప్రయత్నాలే "ప్రచారాలు". అది ఓషో చేసినా, రవిశంకర్ చేసినా క్రైస్తవులు చేసినా ఆదర్శం మాత్రం ఒక్కటే.

2.అంతడబ్బుపెట్టి క్రైస్తవులు మతప్రచారాలూ మతమార్పిడులూ చెయ్యటంలో వారి మతంపట్ల వారికిగల విశ్వాసం నిబద్ధత తెలుస్తాయి. వారు బలంగా వారి మతాన్ని నమ్ముతారుకాబట్టే అంతేబలంగా వాటికి ప్రచారం కల్పిస్తారు.

ఇందులో వాళ్ళకొచ్చే తృప్తితప్ప,స్థూలమైన ఆర్థిక లాభమైతే నాకు కనబడటం లేదు.ఒకవేళ ఉందేమో కనుక్కోవాలి.మీరు తెలియజెప్పగలిగితే నాకు మిక్కిలి సంతోషంగా ఉంటుంది.

3.‘సేవ’అనేది క్రైస్తవమత బోధనల్లో,జీవనవిధానాల్లో ఒక భాగం.Christianity is all about loving and serving. అలాంటప్పుడు సేవని మతంనుంచీ,మతాన్ని సేవనుంచీ వేరు చెయ్యడం అసమంజసం.
అయినా, చాలా క్రైస్తవ స్కూళ్ళు,హాస్పిటల్లలో మతానికి అతీతంగానే సేవలు ఇవ్వబడతాయి. కాకపోతే, ఎవరైనా వారి నమ్మకాన్ని అంగీకరించేవారు కనబడితేమాత్రం వొదలరు. ఇంతకు ముందేచెప్పానుకదా, వారికి తెలిసిన సత్యాన్ని వీలైనంతమందికి తెలియజెప్పాలనే తపన మరి!

Anonymous said...

జాన్ హైద్ గారు నా అబిప్రాయాన్ని మీకోసమే ఈ టపాలో రాసాను ఓసారి చదవండి (జాన్ హైడ్ గారికోలేఖ-మత మార్పిడులపై నా అభిప్రాయం మా...)www.telugukavitaluvasili.blogspot.com

జాన్‌హైడ్ కనుమూరి said...

స్పందించిన మిత్రులకు
నెనరులు
నిజానికి నేను చెప్పదలుచుకున్న విషయం పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది.

దాడులు ఏ కాలంలోనైనా జరుగుతూనే వున్నాయి
వాటిమద్య కొన్ని కుటుంబాలు నలుగుతూనే వున్నాయి అనేది నా ఉద్దేశం.
నేను టపా రాసే సమయానికి అనామకం గారి పోస్టును నేను చదలేదు. దానికి స్పందించానని అనుకోవడం దురదృష్టం.
ఇక గణాంకాల జోలికి వెళ్ళేముందు వాటి స్వరూప స్వభావాల్ని గమనించాల్సిన అవరాన్ని తెలుసుకోవాలి.
ఎవరి జ్ఞాన, అవగాహన, పరిథులలో వున్న ఆలోచననలను, అవగాహనను మార్చుకోమని ఎవ్వరికీ చెప్పడం లేదు. గమనించగలరు

నాగప్రసాద్ said...

కత్తి మహేష్ కుమార్ గారు,

నాకు కొంచెం అయోమయంగా వున్నాయి మీ సమాధానాలు. దయచేసి వాటి గురించి కాస్త వివరంగా రాస్తారా. ఇక్కడ కాదు. మీ బ్లాగులో టపా గా రాయండి. ప్లీజ్.


జాన్ హైడ్ గారు విషయం పక్క దారి పట్టినందుకు క్షమించండి.

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు,

1.
స్వాములు హిందువులు వాళ్ళు ప్రభోధనలు చేసేది హిందువులకు అని మరవకండి. క్రైస్తవులు వాళ్ళలాగా మతమార్పిడికి కాదు.

2.
Our culture is our backbone, without backbone u cant walk in Future. They want to destroy our future by religion poison.

Once upon a time muslims why they distroyed our temples and converted (by force) ... its same reason now christains are converting with love... think it? is not it?

3.
We all belive, Christianity is all about loving and serving.

What about hindus???? they cant love?? i mean being a hindu (without changing religion) we cant loving and serving??

All chistains not serving and loving as well as some hindus serving and loving.

మాఊరిలో 2002 వరకు అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు 3 చర్చిలు ఊరిలో సగం మంది అ మతం వారే. అయినా తప్పు లేదు కాని, చాలా రోజుల తరువాత మా ఊరి వెళ్ళి మా తాత (చాలా పెద్ద మనషి ఆ ఊరికి చాలా సేవ చేసిన వాడు, ఊరి కోసం ప్రాణం వదిలినవాడు, a CPI leder) సమాధి దగ్గర కొబ్బరికాయ (not పూజా) కొంటి దారిన పోయే వాళ్ళకు అందరికి పంచితే. ఏసుదాసు మారిన ఏడుకొండలు మరియు వారి బుంధం వాటిని తీసుకోలేదు, becasue i am hindu (sorry i am not a christains) and i am following my cluture.

ఒక రోజు ప్రక్క ఇంటివారు మతం తీసుకున్నారు (in 2002 1st time in villiage), అడవారు బోట్టు, మంగల సూత్రం తీసి ముసుకుతో బయటకు వచ్చిన్నారు, అది చూసి మా అవ్వ భయపడి దూరం జరిగినది నిజం కాని not all. Now they are rich (sorry his a ఫాదర్ and leder u cant touch him!!), alin cultured and they converted half the villiage, his telling me his going bombay by flight.

జాన్ హైడ్ గారు

Please try to understand if you or your family doing strange things in ur life, there no wounder peoples look at u and ur family with strange.

I am Anonymous becasue I am a typical Indian (లౌకికవాదం తోలు కప్పబడిన హిందువును).

Anonymous said...

Hi, I come across the following information on Internet about Goa Inquisitions.

http://www.blogs.ivarta.com/Inquisition-Goa-Atrocities-Hindus-by-missionaries-III/blog-191.htm

---------
"When I think of all the harm the Bible has done, I despair of ever writing anything to equal it"
- Oscar Wilde (1854-1900), Irish author:
---------
"Christianity is the most ridiculous, the most absurd and bloody religion that has ever infected the world". - Voltaire (French Philosopher, 1694-1778)

"Millions of innocent men, women and children, since the introduction of Christianity, have been burnt, tortured, find, imprisoned: yet we have not advanced one inch towards humanity. What has been the effect of coercion? To make one half of the world fools, and the other half hypocrites. To support error and roguery all over the earth" - Thomas Jefferson (1743-1826)

---------------

I think the information there in is false. Can you confirm about it.