Tuesday, February 19, 2008

అశ్రునివాళి

శ్రీ దయాకిరణ్ (५.४.१९५७ - १४.२.२००८ ) డైరెక్టర్ , ఫెనోప్లాస్ట్ లిమిటెడ్, సికింద్రబాద్

నడుస్తూ నడుస్తూ
ఒరిగిపోయిన దేహం
కళ్ళలోనూ స్వప్నంలోనూ దుఖాఃన్ని నింపుతుంది
వెలుగురేఖలు నింగికెగుస్తున్న ఉదయాన్ని చీల్చుకొని
మా హృదయాలలో శోకాన్నినింపి
కొత్త పయనాన్ని నిశ్శబ్దంగానే వెతుక్కున్నారు.
ఏ రాహుకాలంలో నిదురకుపక్రమించారో
శాశ్వత నిద్రలోకి మిమ్మల్ని చేర్చింది కాలం
ఎన్నోసార్లు
మీ ఆజ్ఞను పాటించినట్లే
ఏదో ఒకరోజు మేమూ మీ వెంటరావాలని తెలుసు
అయినా...
మీరు వదిలి వెళ్ళిన పాదముద్రలు
మరింత నిశ్శబ్దంగా
కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి
లెక్కించలేని జ్ఞాపకాలు
ప్రతిహృదయంలో
సరికొత్త రాగంకోసం సంసిద్ధంచేస్తున్నాయి సుమా!
ఏదో ఒక రూపంలో
ముడివేసుకున్న బంధాలు
పలకరింపుల ఫోనులకోసం ఎదురుచూస్తూనే వుంటాయి
శోకతప్తంతో పార్థివ దేహాన్ని
తలో సమిదనువేసి గుప్పెడు బూడిదచేసినట్టు
మీ స్వప్నాల్ని చేయలేము
అందుకే
మీ స్వప్న సాకారాల జ్యోతుల్ని వెలిగిస్తూనే వుంటాము

1 comment:

Rajendra Devarapalli said...

గుర్తుంచుకోదగ్గ్గ నివాళి జాన్ గారు,