Saturday, February 16, 2008

"షోలే" తో ముడివడ్డ జ్ఞాపకాలు

"షోలే" తో ముడివడ్డ జ్ఞాపకాలు
రాత్రి జీ లో షోలే సినిమా వచ్చింది. చాలాకాలం తర్వాత ఇష్టమైన సినిమా కనిపించేసరికి చూడలనిపించింది. అందులోనూ ఇంటిలో ఎవ్వరూ లేకపోవటంవల్ల కూడా చూడాలనిపించింది. కొన్ని జ్ఞాపకాలు వెన్నంటాయి. కొన్ని ఇక్కడ మీతో.
ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నేను ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటిలో సినిమాకు వెళ్ళడానికి అనుమతి లేకపోవడంవల్ల నేను చూసిన సినిమాలన్నీ దొంగచాటుగానే. ఈ సినిమా ఎన్ని సార్లు చూసానో గుర్తులేదు. అప్పటికే మిమిక్రీ అభ్యాసం చేస్తున్న నేపద్యం, ఇంటరులో రెండవభాషగా హిందీ చదవటంవల్ల కొన్ని సీనులు, కొన్ని డైలాగులు కంఠతా పట్టాను. మిమిక్రీ చెయ్యడానికి అనువైన, భిన్నమైన స్వరాలు(మాడ్యులేషన్స్) ఇందులో వుండటం విశేషం.
సినిమా మొదట విదుదలయ్యే సమయానికి ఏలూరులొ హిందీ సినిమాలు వచ్చేవి కాదు. విజయవాడలో నవరంగ్‌లో వచ్చింది. హౌస్ ఫుల్ కలక్షన్లతో ఆడుతోదని తెలిసింది. ఏమిచెయ్యాలో అర్థం కలేదు. కోటి అనే స్నేహితుడు ఏలూరు పవర్‌పేట స్టేషను వద్ద వుండే వాడు. వాడితో ఈ సినిమా గురించి మాట్లడుతున్నప్పుడు వాడు ఒక ఆలోచనచెప్పాడు. అదేమంటే 11 - 11.30 గంటల మద్య ఈస్టుకోస్టు రైలు వుంది. అది పవరుపేటలో ఆగుతుంది, కాలేజీకి దగ్గర. అది ఎక్కితే విజయవాడ ఒక గంట ప్రయాణం. మళ్ళీ విజయవాడలో 7గంటలకు జనతా ఎక్స్ప్రెస్ వుంది. అది ఎక్కితే 8.30 గంటలకల్లా ఏలూరులో స్టెషన్లలో దిగొచ్చు. అది ఇంటికి దగ్గర. ఇకపోతే టిక్కట్టు తీయకుండా, ష్టేషన్లలో ఎవ్వరూ పట్టుకోకుండా బయటికి వచ్చే మార్గాల్ని కోటి చూపిస్తానన్నాడు. ఇక సినిమాకోసం డబ్బులు వుంటే ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కాని తిరకాసు ఏమిటంటే కోటికి సినిమా ఖర్చులు నేను పెట్టుకోవాలి. ఈ ఆలోచన మరో సినిమా పిచ్చి దోస్తులకు చెప్తే భయపడ్డారు. సరే ఒకరోజు ప్లాన్ చేసి విజయవాడ వెళ్ళి సినిమా చూడటానికి ప్లాన్ చేసాము. ఉదయమే కాలేజీకి బయలుదేరినట్టే ఇంటివద్ద బయలుదేరి ఎవ్వరికీ అనుమానం రాకుండా పవరుపేటా స్తేషను చేరుకుని, నేను కోటి కలుసుకున్నాము. గుండెల్లో ఎదోభయం. రైలుప్రయాణం కొత్తకాదు కాని టికెట్టులేకుండానే ప్రయాణించడం మొడటిసారి.
ప్రయాణమంటా ఒక సాహసం ఎడ్వంచరు। రైల్వే పోలీసుల, టిటి, స్టేషను మాష్టరు ఇలా భయం వెన్నంటే వుంది. ఎదురుచూస్తున్న ఈస్టుకోస్టు రానేవచ్చింది. జనరల్ బోగీలో ఎక్కాము. కొచెంరద్దీగానే వూంది. విజయవాడలోపు మద్యలో ఏశ్తేషనులోనూ ఆగదు కాబట్టి కొంచేం భయం తగ్గింది. ఇంచుమించు ఒక గంటలో విజయవాడ చేరుకున్నాము నేను, కోటి. ముందుగా అనుకున్న ప్రకారం దిగగానే ఎవరివైపు, ఎటువైపు దిక్కులుచూడకుండా ప్లాట్ఫారం చివరికి చాలా వేగంగా నడచి వెళ్ళాము. అక్కడ పార్సిలు ఆపీసు వుంది. దాన్ని దాటి ముందుకువెళ్ళి పట్టాలను దాటితే అక్కడ కొంచే సన్నని ఖాళీ వుంది. అందులోచి దూరితే కొచేం చేత్త చెదారం దాటి, అటు ఇటు నడిస్తే రోద్దు వచ్చింది. అప్పటి వరకు ఎవరైనా వస్తున్నరేమో, ఎవరైనా చూస్తున్నారేమో అని ఒకటే దడ, దడా. అక్కడనుంచి పరులాటి నడకతో నవరంగ్ చేరుకున్నాము. బహుశ ఒంటిగట అయ్యివుండవచ్చు(సరిగా గుర్తులేదు) అప్పటికే టికెట్లకోసం క్యూ వుంది. రెండు రూపాయల లైనులో నిలబడి తోపులాటలమద్య టికెట్టు సంపాదించాము. సినిమా చూస్తున్నంసేపూ చిత్రమైన అనుభూతి. మాదగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయేమో ఏదైనా ఇబ్బంది పడతామేమో అని ఇంటరువెల్లులో ఏమీ తినలేదు, కొనుక్కోలేదు. సినిమా అయిన తర్వాత జనతా ఎక్స్‌ప్రెస్ వెళ్ళిపోతుందేమోనని ఒకటే కంగారుతో పరుగులాంటి నడకతో విజయవాడ స్టేషను చేరాము. కొద్దిసేపటికి రైలు వచ్చింది ఏలూరు చేరాము. ఏలూరు బాగా ఎరిగిన స్టేహ్స్నే కాబట్టి మెల్లగా బయటపడి ఇళ్ళకుచేరాము. నాయింటి వద్ద ఎవరైనా ఏమంటారొనన్ని కొద్దిగా భయవుంది, కాని అప్పటికి మా నాన్నగారు ఇంటికి రాకపోయే సరికి కొంతవూపిరితీసుకున్నాను.

No comments: