Saturday, February 23, 2008

సంసిద్దతచేసే పాత్ర

ఎక్కడినుంచి ఎగిరొచ్చిందో
రాత్రికురిసిన వాననీటిలో లేని చేపకోసం
ఎదురుచూస్తున్న కొంగలాంటి మనసు

మట్టితో చేయబడ్డదేహం
మళ్ళీ మట్టిలో కలవడం సృష్టి ధర్మం

సిలువనెత్తుకొని
ఒలికే కన్నీటితో
పరుగులాంటి నడక
అంధకార శక్తులతో నిత్యం పోరాటమే
ఎందరివో పగిలన హృదయాలను కడ్తుంది

నిరీక్షించే దారుల్లో
నిత్యం వేధించే భయాలను ఛేదిస్తూ జాగురూకచెయ్యడం
వెలిగించిన జీవితాన్ని దీపస్థంబంగా పెట్టడమే

మట్టి శరీరం శిథిలమవ్వడం తప్పనిసరి
వెలుగిచ్చే త్రోవలలో
వెలుగురేఖల పయనానికి సంసిద్దతచేసే పాత్ర
సిద్దమైన జీవకిరీటంకోసం సాగిపోతుంది

నీతిసూర్యుని కిరణాలలో వెలిగే
మహిమ శరీరంకోసం
పయనం సాగిపోతూనేవుంటుంది

Labels:

1 Comments:

At February 24, 2008 7:09 PM , Anonymous యువరాజు said...

పరమపురిలో పరిశుద్ధులకై "వెలకందరాని నిశ్చలజీవవిలసత్కిరీటాలు" సిద్ధం!

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home