బహుశ 1984 అనుకుంటాను
స్నేహితుల వల్ల రెండు రాత్రులు, రెండు పగళ్ళు పోలీసు స్టేషనులో వున్నాను.కొంతకాలం కలిసితిరిగాం, కలిసి సినిమాలు చూసాం, కలిసి పార్టీలు చేసుకున్నాం, ప్రేమ పెళ్ళిళ్ళు చేసాం, విడిపోయాం మళ్ళీ కలిసిన జ్ఞాపకాలు లేవు. వీరిని స్నేహితులు అనాలా, మిత్రులు అనాలా? సందేహం. కాని అనుభవాలు మిగిలిపోయాయి.
ఒక సెంటరులో సైకిలు రెపేరు షాపు రాజు, టీ బడ్డీ సుందర్రావు, మంగలి షాపు విష్ణు, ఉండేవాళ్ళు.అక్కడికి చాలామందిమి చేరి టైము పాస్ చేసే వాళ్ళము. జార్జి అనే వాడి తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాళ్ల కాలేజీలో గొడవలతో కొట్టుకున్నారు, అది జార్జికి తెలిసి వాళ్ళను కొట్టివచ్చాడు. వాళ్ళు ఓక గ్రూపుగా ఏర్పడి మళ్ళీ జార్జిని, వాడి తమ్ముణ్ణి కొట్టాలని బయలుదేరారు. కొచెం చీకటిగా వున్న మలుపులో గుంపుగా తూముపై కూర్చొన్నరు. ఇంతలో అటుగా పోతున్న సి. ఐ. చూసి అనుమానం వచ్చి వారిని సోదా చేస్తే వారిదగ్గర రెండు సైకిలు చైనులు, ఒక చిన్న కత్తి, చినన్న ఇనుపరాడ్ దొరికాయి. వెంటనే వాళ్ళను జీపులో ఎక్కించి స్టేషనుకు తీసుకు వెళ్ళాడు. వాళ్ళలో అందరూ ఉన్నత ఉద్యోగుల పిల్లలే వున్నారు.గొడవతెలుసుకున్న సి.ఐ. జార్జిని పిలిపించి లోపల వుంచారు. మీ బాచ్ ఎవరు అని జార్జి నిలదీసే సరికి కొతమంది పేర్లు చెప్పాడు. ఈ గొడవతో నాకు సంబందం లేకపోయినా అప్పుడప్పుడూ కలిసి తిరగటంవల్ల నాపేరుకూడా అందులో వచ్చి, నన్నుకూడా స్టేషనుకు తీసుకు వెళ్ళారు. అందరిని ప్రశ్నించి, ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఒకరోజు గడిచిపోయింది. కేసు రాసి మరసటిరోజు ఆదివారం కావటం వల్ల మరింత ఆలస్యమయ్యింది. నాకు తెలిసిన ఒక ఆయన ఆదివారం సాయంకాలం ష్టేషనుకు ఎందుకో పనిమీద వచ్చాడు నన్ను చూసి జరిగింది తెలుసుకొని, సి.ఐ.తో మాట్లాడి నన్ను తీసుకు వెళ్ళాడు.
అలా నాకు సంబందంలేని దానిలో ఇరుక్కున్నాను.
ఆ రెండు రోజుల పోలీసు స్టేషను అనుభవం వివరించలేనిది.
ఆ రెండు రోజుల పోలీసు స్టేషను అనుభవం వివరించలేనిది.
6 comments:
ప్రతి నాణేనికీ రెండు వైపులు ఉంటాయి. స్నేహం అనే కంటే సాంగత్యం అనవచ్చేమో మీరు రాసిన ఉదాహరణలని.
మనకి ఎందరో ఎదురవుతుంటారు. వేరే పదం లేక "friends అని ఒకే పేరుతో అందరినీ పిలిచేస్తుంటాము. స్నేహ బంధం మెల్లగా గాఢమవుతుంది. అది ఆకర్షణ వల్లనో, అవసరం వల్లనో కాదు.
నాకు అదృష్టం కొద్దీ మంచి స్నేహితులు లభించారు. ఆ స్నేహం చాలా నెమ్మదిగా పుంజుకుంది. కలిసి చదువుకున్నాం. కలిసి మంచి జ్ఞాపకాలు ఏర్పర్చుకున్నాం. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాం.
"ప్రతి నాణేనికీ రెండు వైపులు ఉంటాయి. స్నేహం అనే కంటే సాంగత్యం అనవచ్చేమో మీరు రాసిన ఉదాహరణలని.
మనకి ఎందరో ఎదురవుతుంటారు. వేరే పదం లేక "friends అని ఒకే పేరుతో అందరినీ పిలిచేస్తుంటాము. స్నేహ బంధం మెల్లగా గాఢమవుతుంది. అది ఆకర్షణ వల్లనో, అవసరం వల్లనో కాదు" 100% ఏకీభవిస్తాను
ఇది నిజమేనండి మీది చెడు సాంగత్యం. కానిమిమ్మల్ని ప్రేమించే స్నేహితుడు త్వరలో కలవాలని నా ఆకాంక్ష.
అయ్యా కనుమూరి గారూ మీరు మాత్రం బ్లాగ్విషయం మీద క్రమం తప్పకుండా బాధ్యతగా రాసేస్తున్నారు. మిమ్మల్ని చూసి నేను రాయలేకపోతున్నందుకు బాధపడ్తున్నాను. కృతజ్ఞతలు. కొనసాగించగలరు.
బహుశ అది 1984 అనుకుంటాను
23 ఏళ్ళ కిందటి మాట
నా జ్ఞాపకాలు అని మరచిపోకండి
ప్రకటనలన్నీ వాగ్దానాలు కాదూ అని విశాఖపట్నానికి చెందిన ఒక రాజకీయ నాయకుదు చాలా కాలం క్రితం ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చాడు.అలాగే పరిచయం ఉన్న వారందరినీ స్నేహితులనుకోవటం మనలో ఉన్న మంచి లక్షణం.కానీ అదే సమయంలో ఆ భావన ఇచ్చిపుచ్చుకునేదిగా లేనప్పుడు వారిని మొఖపరిచయస్తులుగానే మిగలనివ్వండి.
నేను చాలా కాలం కరివేపాకు పాత్ర నిండుమనస్సుతో పోషించాను. కానీ ఎంత కాలం ? మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తావ్?మాఇంటికొస్తూ నాకేమి తెస్తావ్ అంటూ ఉంటే ఎంతకాలం అయినా ఎవరు సహించగలరు?నావరకు నాకు హైస్కూలు మిత్రులు ఇప్పటికీ అదే స్నెహం. అదే అరెయ్,ఒరేయ్ లతో ఉన్నారు.కాలేజీలో, యూనివర్సిటీలో చాలా మంది పరిచయమయ్యారు.రెందుపీజీలు,పీ హెచ్ డీలో పరిచయమైన వందలవేల మందిలో ఇప్పటికీ ఏ ఇద్దరో ముగ్గురో ఇంకా ఆ పరిచయాన్ని కొనసాగిస్తున్నాం.ఇప్పుడు నీకు నిజమైన ఫ్రెండు ఎవరంటే నా భార్య అంటాను,రోజుకు వంద సార్లు కీచులాడుకున్నా సరే.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
http://visakhateeraana.blogspot.com/
Post a Comment