బ్లాగ్విషయం - స్నేహం3
సత్యనారాయణ అని తాహసిల్దారుగా పనిచేసేవారు.
నా చిన్నప్పుడు నా ప్రక్క ఇంటిలో వుండేవారు.
కొంతకాలం తర్వాత ఏలూరు వచ్చాము ఆయనకూడా అక్కడికి వచ్చారు. అప్పటికి నేను 9వ తరగతిలో వున్నాను. అప్పుడప్పుడు కలిసేవాణ్ణి. నా దస్తూరీ బాగుంతుందని తన కొన్ని ప్రతులను నా చేత రాయించుకొనేవారు. మా పరిచయము 6 - 7 సంవత్సరాలు నడిచింది. కొన్ని వివాహ సందర్బాలలోను, వారి అమ్మాయి ప్రసవ సందర్భాలలోను నేను చూపించిన కొంచెం శ్రద్ద వారికి నచ్చాయి. వారి సాంగత్యంలో తాపీ ధర్మారావు పుస్తకాలు చదివాను, సాహిత్యం చదవటం అక్కడే ప్రారంభమయ్యిందని ఇప్పుడనిపిస్తుంది. ఆయనతో కూర్చొని మాట్లాడటం సమయం తెలిసేది కాదు. అది నేను చదువుమాని సమయం వృధా చేస్తున్నానని కొందరు అంటూ వుండే వారు. మా మద్య సినిమాలగురించి, సాహిత్యం గురించి తరచూ చర్చ జరిగేది. ఆ రోజుల్లోనే వచ్చిన "గోరంతదీపం" ఒక మంచిసినిమా ఎందుకు, ఎలా అని నేను చెప్పిన విశ్లేషణను చాలామందితో చెప్పి ఆనందించే వారు. (ఇప్పుడా విశ్లేషణ గుర్తు లేదండోయ్! ఇప్పుడు నేను సినిమాలు చూడటంలేదు) సినిమాల్లోకి నేను వెళితే రాణిస్తానని చెప్పేవారు. (నా కంటే చిన్నవాడయిన వాళ్ళ అబ్బాయి సినిమా హీరో అయ్యాడు. మేమిద్దరం ఒక సంవత్సరం ఒకే మాష్టరి దగ్గర లెక్కలకు ట్యూషనుకు వెళ్ళాము, అది వేరే సంగతి)
వాళ్ళా అమ్మాయి నాకు 6వ తరగతి నుండి సమాంతరంగా చదివాము. అమ్మాయి పెళ్ళి ఒక వెటర్నరీ డాక్టరుతో రిజిష్టరు ఆఫీసులో ఏ ఆడంబరాలు లేకుండా జరిగింది. డాక్టరుతో కొంతకాలం పరిచయం, సంబాషణలు నాలో కొన్ని ఆదర్శాలవైపు బీజాలు నాటాయనిపిస్తుందిప్పుడు.
నేను పెళ్ళిచేసుకొన్న కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఏలూరులో ఒక పెళ్ళిలో కలిసాము. నా కుటుంబాన్ని పరిచయంఛేసాను చాలా సంతోషించారు. బహుశ అడే చివరిసారి చూడటం.
కుటుంబ విషయాలు మరి కొన్న్ని పరిస్థితులవల్ల వారితో పరిచయం తెగిపోయింది. చివరికి వారిని ఆఖరిగా కూడా చూడలేకపోయాను. వారి కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడూ కలవలేకపోయాను.
ఇప్పటి నా వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలకు నాకు తెలియకుండానే పునాదివేసిన నా స్నేహితుడయాన.
No comments:
Post a Comment