Saturday, August 11, 2007

ఓ సంఘటిత వాక్కై ప్రతిఘటిద్దాం !


ప్రవాహానికి ఎదురీదుతున్నప్పుడు
మృత్యువు ముద్దివ్వాలని చూస్తుంది

నిర్లజ్జగా భయపెట్టి మాటలతో తూట్లు పొడవాలని చూస్తుంది
పాతుకుపోయిన వేళ్ళు

కొత్త ప్రవాహానికి అవరోధమే

ఏ దుశ్శాసనుడో అపహరిస్తున్నది
కళ్ళ ముందు కదలిపోతుంది

అది వస్త్రమో
వాక్ స్వేచ్చో
సమాజ పరిరక్షణో
నవ్య నిర్మాణ స్వప్నమో

ప్రవాహానికి ఎదురీదుతున్నప్పుడు
మృత్యువు ముద్దివ్వాలని చూస్తుంది


ఓ సంఘటిత వాక్కై ప్రతిఘటిద్దాం !

No comments: