ఈ అనుభవం ఎవరితో పంచుకోవాలి?
బషీర్ బాగ్, ప్రెస్ క్లబ్ లో దిలావర్ కథల పుస్తకం పరిచయసభకు వెళ్ళాను. సభ పూర్తి అయ్యి మిత్రుల పలకరింపుల తర్వాత అసెంబ్లి దగ్గర బస్సు ఎక్కాలని మెల్లగా నడచుకుంటూ బయలుదేరాను. పెట్రొలు పంపు దాటి కంట్రోలు రూమువైపు నడుస్తున్నాను. ఇంతలో సెల్లు మోగింది రోడ్డు పక్కగా ఫొను మట్లాడుతూ నడుస్తున్నాను. బహుశ ఇండొర్ స్టేడియం గేటు దగ్గరకు వచ్చాను. కొద్దిగా చీ కటిగా వుంది. అక్కడ మాన్ హోలు ఒకటి పొంగుతుంది గమనించలేదేమో కుడికాలు అందులో పడింది. నీళ్ళు తగిలేసరికి ఒక్కసారి వులిక్కిపడి గెంతాను. ఫ్యాంటు మోకాలి వరకు తడిసి పొరలా అంటుకుంది. ఒకటే వాసన కడుపులోవొక్కసారి తిప్పినట్లయ్యింది. దగ్గరలో నీళ్ళు ఎక్కడా దొరకలేదు. షాపులుకూడా లేవు నీళ్ళా బాటిల్ అయినా కొందమంటే. చివరికి కంట్రోలు రూము దగ్గర మంచినీళ్ళ కోసం పెట్టిన టాప్ కనిపించింది. అక్కడకూడా నిలవలేనంతగా నీళ్ళు, తడి టాప్ షింక్ నిండా ఏదేదో చెత్త, అయినా ఓపిక కూడతీసుకొని దొసిళ్ళతో నీళ్ళు పట్టుకొని కడుక్కున్నాను. పూర్తిగా పోలేదు గాని ప్యాంటు పై తెట్టులా అంటింది చాలా వరకూ పోయింది కాని వాసన మాత్రం పొలేదు. కష్టంగా లకడీ క పూల్ చేరి బస్సు ఎక్కను. పటాన్ చెరు సుమారు గంట ప్రయాణం, కుక్కట్ పల్లి వరకూ రద్దీగానేవుంది. ఎంతమంది వాసనకు తిట్టుకున్నారో యేమో ! ఇంటికిచేరి స్నానంచేసి తిని పడుకునేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది। ఏ ఆనందం మనసులో మిగల్లేదు। సాహిత్య కార్యక్రమానికి వెళ్ళిన, మిత్రులను కలిసిన ఆనందం మిగల్లేదు

అభివృద్ది చెందుతున్న నా నగరం ఎప్పుడు ఈ మాన్ హోల్ సమస్యనుండి బయటపడుతుందో?
ప్రధాన రహదారుల్లోనే ఇలావుంటే చిన్నప్రదేశల పరిస్థితి ఏమిటో?
No comments:
Post a Comment